- Home
- Entertainment
- Pooja Hegde Comments: జాతకాలపై పూజా హెగ్డే కామెంట్స్... ఇంతకీ ఆమె జాతకాలు నమ్ముతుందా...?
Pooja Hegde Comments: జాతకాలపై పూజా హెగ్డే కామెంట్స్... ఇంతకీ ఆమె జాతకాలు నమ్ముతుందా...?
జాతకాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది పూజా హెగ్డే. పూజా హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా రీసెంట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ మూవీ కంప్లీట్ గా జాతకాల మీద నడిచే కథతో తెరకెక్కింద. మరి పూజా హెగ్డే రియల్ లైఫ్ లో వాటిని నమ్ముతారా..?

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ నెల 11 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు ఐదు భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది ఈమూవీ.
ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా కనిపిస్తాడు. జాతకాలు..విధిరాతల చుట్టూ రాధేశ్యమ్ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేమకు, చేతిరాతలకు, తలరాతకు, జాతకానికి ముడిపెడుతూ తెరకెక్కించారు ఈ సినిమాను. అయితే మన సొసైటీలో చాలా మంది జాతకాలను నమ్మరు. అసలు అలాంటివి లేవని కొట్టిపారేస్తారు.
అయితే 300 కోట్ల బడ్జెట్ తో.. స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈసినిమాలో నటించిన స్టార్స్ కు మరి జాతకాలమీద నమ్మకం ఉందా.. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో ప్రభాస్ - పూజ హెగ్డేలకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఎవరి సంగతి ఏంటో తెలియదు కాని ఈ విషయంలో మాత్రం పూజా హెగ్డే తన అభిప్రాయం వెల్లడించింది.
మీరు జాతకాలను నమ్ముతారా.. విధిరాతను విశ్వసిస్తారా..? అన్న ప్రశ్నలకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది పూజ హెగ్డే. తనదైన శాలిలో ఆమె స్పందించింది. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. విధిరాత ప్రకారమే అంతా జరుగుతుందని భావిస్తూ ఉంటాను. విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు .. దాని బారి నుంచి ఎవరూ తప్పించలేరు. అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
అంతే కాదు ఒక మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టిపెరిగాను. మా ఫ్యామిలీలో అంతా బాగా చదువుకున్నవారే. నేను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కెరియర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు చూశాను. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాను అంటూ.. గతరోజుల గురించి గుర్తుకు తెచ్చుకుంది పూజా హెగ్డే.
ఇక తను ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న రోజు నుంచి ఈ స్టార్ డమ్ వచ్చేంత వరకూ..విధి తనను ఆ రోజున అలా నడిపించిందని అంటుంది. అంతే కాదు ఈ రోజున ఈ స్థాయికి చేర్చింది విధికాక మరేమిటి అని అన్నది పూజా. అందుకే తాను విధిరాతను గట్టిగా నమ్ముతాను అంటోంది స్టార్ హీరోయిన్.