MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్లు కోట్లు వసూలు చేస్తుంటే, లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోయిన్లు కోట్లు వసూలు చేస్తుంటే, లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

గతంలో మాదిరి కాదు.. హీరోయిన్లు కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుటున్నారు. కొంత మంది అయితే హీరోలను మించి వసూలు చేస్తున్నారు. హీరోయిన్లు అంతా అప్ డేట్ అయ్యి కోట్లకు టెండర్ వేస్తుంటే.. ఇంకా లక్షల్లోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 20 2025, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram/ pooja Hegde

ఆమె ఒక స్టార్ హీరోయిన్. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ స్టార్ హీరోయిన్ కు కాలం కలిసిరాక వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈ హీరోయిన్ అవకాశాలు లేక ఇబ్బందిపడుతోంది. 5కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోవలసిన హీరోయన్ రెమ్యునరేషన్ లక్షల్లోనే ఆగిపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ ?

25
Image Credit : youtube print shot/Gemini tv

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది. రెండు హిట్టు పడితే చాలు వెంటనే హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన హీరోయిన్లు కోటి రూపాయల పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అయితే మూడు కోట్ల నుంచి 10 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. కొంత మంది అయితే ఐటెం సాంగ్స్‌ చేసిన చాలు 3 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. అటువంటిది స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే మాత్రం చాలా తక్కువ రెమ్యునరేషన్ కు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Related Articles

Related image1
చెట్టు కోసం కోటి రూపాయలు, అంబానీ తో పోటీ పడ్డ ప్రభాస్, అంత ప్రత్యేకత ఏంటి? నిజమెంత
Related image2
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐకాన్ స్టార్ వరకూ డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతోన్న స్టార్స్ ఎవరు?
35
Image Credit : Youtube/GeminiTV

పూజా హెగ్డే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు మోనికా. ఇటీవలే విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. పాటలో పూజా చేసిన స్టెప్పులు, గ్లామర్ ప్రెజెన్స్ కు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటకు గాను ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 70 లక్షలు మాత్రమే అని సమాచారం.

45
Image Credit : Youtube/GeminiTV

ఇది చాలా తక్కువ మొత్తం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత, పాటకు 3 కోట్లు, మరోవైపు పుష్ప2 లో సాంగ్ చేసినందకు శ్రీలీల 2 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అలాంటిది స్టార్ ఇమేజ్ ఉన్న పూజా హెగ్డే సాంగ్ చేసినందకు కేవలం లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

55
Image Credit : Pooja Hegde Instagram

పూజా హెగ్డేకు ఈపరిస్థితి రావడానికి కారణం రీసెంట్ గా ఆమె ఫేస్ చేసిన ఫ్లాప్స్ మాత్రమే కారణం అని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్లాప్ లు, అవకాశాలు లేక బాలీవుడ్‌కు వెళ్తే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్క్ చేయకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్‌లో కూడా పెద్ద సినిమాలు లేవు పూజా హెగ్డేకు. దాంతో ఆమె స్పెషల్ సాంగ్స్ కు తక్కువ రెమ్యునరేషన్ అయినా ఓచే చేపుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికైతే పూజా హెగ్డే నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ పూజా ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది కేవలం స్పెషల్ సాంగ్‌కి మాత్రమేనని, ఒక పూర్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తే ఆమె రెమ్యునరేషన్ 2 కోట్లు నుంచి 3 కోట్లు వరకూ ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?
Recommended image2
Allu Arjun: ఒక్క సినిమాకి 300కోట్లు.. పారితోషికంలో అల్లు అర్జున్‌ నయా ట్రెండ్‌.. తెరవెనుక భారీ ప్లాన్‌
Recommended image3
Senior Heroes Fight: ఒకేసారి నలుగురు సీనియర్ల సినిమాలు, టాలీవుడ్‌ చరిత్రలో మొదటిసారి.. అసలు పండగ ఇదే
Related Stories
Recommended image1
చెట్టు కోసం కోటి రూపాయలు, అంబానీ తో పోటీ పడ్డ ప్రభాస్, అంత ప్రత్యేకత ఏంటి? నిజమెంత
Recommended image2
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐకాన్ స్టార్ వరకూ డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతోన్న స్టార్స్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved