MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి కల్పిక ? ఆమెకి మెంటల్ డిజార్డర్ ఉందంటూ బాంబు పేల్చిన తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు

త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి కల్పిక ? ఆమెకి మెంటల్ డిజార్డర్ ఉందంటూ బాంబు పేల్చిన తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు

తన కుమార్తెకి మెంటల్ డిజార్డర్ ఉందంటూ కల్పిక గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వల్ల అందరికీ ప్రమాదమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2025, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి కల్పిక గణేష్ ?
Image Credit : Instagram/Kalpika Ganesh

త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి కల్పిక గణేష్ ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున ఈసారి కూడా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని లీక్ అయ్యాయి. అందులో నటి కల్పిక గణేష్ పేరు కూడా ఉంది. జులాయి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద లాంటి చిత్రాలతో కల్పిక గణేష్ గుర్తింపు పొందింది. 

DID YOU
KNOW
?
మంచు మనోజ్ మూవీతో కల్పిక ఎంట్రీ 
2009లో మంచు మనోజ్ ప్రయాణం చిత్రంతో కల్పిక నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలు ఆమెకి గుర్తింపు తీసుకువచ్చాయి. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తరచుగా వివాదాల్లో కల్పిక 
Image Credit : Instagram/Kalpika Ganesh

తరచుగా వివాదాల్లో కల్పిక 

అయితే కొంత కాలంగా కల్పిక గణేష్ తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. ప్రిజమ్ పబ్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పబ్ సిబ్బందిపై అసభ్యకర పదజాలంతో కల్పిక విరుచుకుపడింది. దీనితో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ రిసార్ట్ లో కూడా కల్పిక గణేష్ అక్కడ సిబ్బందితో గొడవపడింది. నానా హంగామా చేయడంతో ఈమెకి ఏమైంది అని అంతా ఆశ్చర్యపోయారు. సిగరెట్ల కోసం కల్పిక చేసిన హంగామా చూసి నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. 

35
కల్పికకి మెంటల్ డిజార్డర్ ఉంది 
Image Credit : Instagram/Kalpika Ganesh

కల్పికకి మెంటల్ డిజార్డర్ ఉంది 

తాజాగా కల్పిక గణేష్ వ్యవహార శైలిపై ఆమె తండ్రి సంఘవార్ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్పికపై ఆమె తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఊహించని పరిణామం. తన కుమార్తె కొంతకాలంగా డిప్రెషన్, మెంటల్ డిజార్డర్ తో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమెపై సంఘవార్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కుమార్తె వల్ల కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని తెలిపారు. 

45
ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు 
Image Credit : Instagram/Kalpika Ganesh

ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు 

రెండేళ్లుగా కల్పిక డిప్రెషన్ కి సంబంధించిన మెడిసిన్ ఆపేసింది. దీనితో తరచుగా కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో గొడవలకు దిగుతోంది. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించాం. అక్కడ కూడా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె బయట ఉంటే చాలా ప్రమాదం. ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించింది. తన కుమార్తెని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంఘవార్ పేర్కొన్నారు. 

55
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ సాధ్యమేనా 
Image Credit : Instagram/Kalpika Ganesh

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ సాధ్యమేనా 

మరికొన్ని రోజుల్లో కల్పిక గణేష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి చేసిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? తండ్రి చేసిన వ్యాఖ్యలతో కల్పిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం సాధ్యమేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే కల్పిక బిగ్ బాస్ హౌస్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image3
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Related Stories
Recommended image1
16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర, ఆ స్టార్ క్రికెటర్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదే
Recommended image2
చిరంజీవి మూవీపై శోభన్ బాబు, కృష్ణంరాజు, సుమన్ అటాక్.. ఏం జరిగిందో తెలుసా, దిమ్మతిరిగే ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved