- Home
- Entertainment
- చిరంజీవి మూవీపై శోభన్ బాబు, కృష్ణంరాజు, సుమన్ అటాక్.. ఏం జరిగిందో తెలుసా, దిమ్మతిరిగే ట్విస్ట్
చిరంజీవి మూవీపై శోభన్ బాబు, కృష్ణంరాజు, సుమన్ అటాక్.. ఏం జరిగిందో తెలుసా, దిమ్మతిరిగే ట్విస్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రం అప్పట్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొని అఖండ విజయం సాధించింది. చిరంజీవి చిత్రానికి పోటీగా స్టార్ హీరోలు కొందరు తమ చిత్రాలని విడుదల చేశారు.

చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ని అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే దాదాపుగా సూపర్ హిట్ అనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉండేది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగానే వీరి చిత్రాలు ఉండేవి. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన క్లాసిక్ హిట్స్ లో ఛాలెంజ్ మూవీ ఒకటి. ఈ చిత్రంలో విజయశాంతి, సుహాసిని హీరోయిన్లుగా నటించారు.
KNOW
చిరంజీవికి పోటీగా నలుగురు స్టార్ హీరోల చిత్రాలు
ఈ చిత్రం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడితే ఏదో ఒక చిత్రానికి నష్టం తప్పదు. కానీ ఛాలెంజ్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవికి పోటీగా ఏకంగా నలుగురు స్టార్ హీరోలు తమ చిత్రాలని రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఛాలెంజ్ మూవీ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దిమ్మతిరిగే ట్విస్ట్ అదే
ఛాలెంజ్ చిత్రానికి వారం ముందు శోభన్ బాబు ఇల్లాలు ప్రియురాలు చిత్రం విడుదలైంది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఛాలెంజ్ చిత్రానికి వారం ముందు ఇల్లాలు ప్రియురాలు రిలీజ్ కాగా.. ఛాలెంజ్ రిలీజ్ అయ్యాక వారం తర్వాత శోభన్ బాబు నటించిన మరో చిత్రం 'మిస్టర్ విజయ్' రిలీజ్ అయింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దిమ్మతిరిగే ట్విస్ట్ ఏంటంటే ఇల్లాలు ప్రియురాలు, ఛాలెంజ్, మిస్టర్ విజయ్ మూడు చిత్రాలకు దర్శకులు ఒక్కరే.. ఆయనే కోదండరామిరెడ్డి.
యావరేజ్ గా నిలిచిన కృష్ణంరాజు, సుమన్ మూవీ
అప్పట్లో హీరోలు అత్యధిక చిత్రాల్లో నటించేవారు. అందుకే ఒక హీరో నటించిన ఓ చిత్రానికి తదుపరి చిత్రానికి గ్యాప్ తక్కువగా ఉండేది. ఇక ఛాలెంజ్ చిత్రానికి పోటీగా వచ్చిన మరో మూవీ రారాజు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, సుమన్ హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
పోటీలో వెనుకబడిన సూపర్ స్టార్ కృష్ణ
ఇదిలా ఉండగా ఛాలెంజ్ మూవీ రిలీజ్ అయిన రోజే ఆగష్టు 9న సూపర్ స్టార్ కృష్ణ నటించిన బంగారు కాపురం చిత్రం విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం చివరికి పోటీలో వెనుకబడి యారేజ్ గా నిలిచింది. ఇలా తీవ్రమైన పోటీని తట్టుకుని ఛాలెంజ్ చిత్రం చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది.