MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం

Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం

Pokiri Rejected Heroes: టాలీవుడ్‌లో `పోకిరి` మూవీది ప్రత్యేక స్థానం. ఇది ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తెలుగులో కలెక్షన్ల ట్రెండ్‌ ని క్రియేట్‌ చేసింది. మరి ఇలాంటి ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్న హీరోలు ఎవరో చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 28 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్‌ లో ట్రెండ్‌ సెట్టర్‌గా `పోకిరి`
Image Credit : Prime Video

టాలీవుడ్‌ లో ట్రెండ్‌ సెట్టర్‌గా `పోకిరి`

`పోకిరి` సినిమా మహేష్‌ బాబు కెరీర్‌నే మార్చేసింది. ఈ చిత్రంతో ఆయన సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. పూరీ జగన్నాథ్‌, మహేష్‌ బాబు కాంబినేషన్‌ లో వచ్చిన తొలి చిత్రమిది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌ రాజ్‌ విలన్‌. బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో కలెక్షన్లని లెక్కలను మార్చేసింది. ఇది సుమారు నలభై నుంచి యాభై కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. కలెక్షన్ల పరంగా ఎక్కువగా చర్చ జరిగింది ఈ మూవీ విషయంలోనే. ఇంకా చెప్పాలంటే, మేకర్స్ కి కలెక్షన్ల రుచి చూపించిన చిత్రమిది. ఇది విడుదలై నేటికి 20ఏళ్లు. ఈ సందర్భంగా ఈ మూవీ వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే, దీన్ని దాదాపు నలుగురు హీరోలు మిస్‌ చేసుకున్నారు. వాళ్లు ఎవరో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోకిరిని రిజెక్ట్ చేసిన పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Asianet News

పోకిరిని రిజెక్ట్ చేసిన పవన్‌ కళ్యాణ్‌

పూరీ జగన్నాథ్‌.. మొదట ఈ కథని పవన్‌ కళ్యాణ్‌ కి చెప్పారు. అప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో పూరీ బద్రి సినిమా చేశారు. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో పూరీని బాగా నమ్మాడు పవన్‌. కానీ ఎందుకో `పోకిరి` స్క్రిప్ట్` ఆయనకు నచ్చలేదు. దీంతో నో చెప్పారు. అలా `పోకిరి` కథ మొదట పవన్‌ కళ్యాణ్‌ వదులుకున్నారు. బ్లాక్‌ బస్టర్‌ని మిస్‌ చేసుకున్నారు. అప్పుడు పవన్‌కి ఉన్న ఇమేజ్‌కి ఈ సినిమా చేస్తే ఇండస్ట్రీ షేక్‌ అయిపోయేదంటే అతిశయోక్తి కాదు.

35
పోకిరిని మిస్‌ చేసుకున్న రవితేజ
Image Credit : zee telugu

పోకిరిని మిస్‌ చేసుకున్న రవితేజ

ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌.. ఈ కథని రవితేజకి చెప్పారు. అయితే ఈ మూవీకి పూరీ మొదట అనుకున్న టైటిల్‌ ఉద్దమ్‌ సింగ్‌ సన్నాప్‌ సూర్యనారాయణ. మాస్‌ మహారాజా ఈ మూవీ కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యాడు వెంటనే ఓకే చెప్పాడు. ఎందుకంటే పూరీ, రవితేజ కాంబినేషన్‌లో అప్పటికే రెండు హిట్‌ సినిమాలు వచ్చాయి. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్‌`  రెండూ రవితేజ కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించాయి. `ఇడియట్‌`తో స్టార్‌ అయిపోయాడు. దీంతో వెంటనే `పోకిరి` కథకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ అప్పుడే తమిళంలో హిట్‌ అయిన `ఆటోగ్రాఫ్‌` రీమేక్‌ వచ్చింది. ఇది రవితేజకి పర్సనల్‌గా బాగా నచ్చింది. దీంతో సినిమా చేశాడు. ఈ క్రమంలో `పోకిరి` కథని కొన్ని రోజులు పక్కన పెట్టారు. ఈ గ్యాప్‌లో పూరీ రెండు సినిమాలు చేశారు. అయినా రవితేజతో మూవీ సెట్‌ కాలేదు.

45
సోనూ సూద్‌ నుంచి మహేష్‌ వద్దకు
Image Credit : Facebook

సోనూ సూద్‌ నుంచి మహేష్‌ వద్దకు

ఇలా కాదని చెప్పి.. బాలీవుడ్‌కి వెళ్లి సోనూ సూద్‌తో ఈ సినిమా చేయాలనుకున్నారు పూరీ. ఆయనకు కూడా కథ చెప్పారు. కారణం ఏంటో గానీ, అది కూడా వర్కౌట్‌ కాలేదు. దీంతో ఫైనల్‌గా మహేష్‌ బాబుని కలిశాడు పూరీ జగన్నాథ్‌. మహేష్‌ ఈ కథకి ఇంప్రెస్‌ అయ్యాడు. ఓకే చెప్పాడు. కానీ కొన్ని మార్పులు చెప్పాడు. పూరీ కూడా కాదనకుండా ఆ మార్పులు చేశారు. స్క్రిప్ట్ పై నమ్మకంతో మహేష్‌ నిర్మాతగా మారారు. తన అక్క మంజులని నిర్మాతని చేశాడు. ఈ సినిమాని పూరీ జగన్నాథ్‌తోపాటు మంజుల ఘట్టమనేని ప్రొడక్షన్స్ కంపెనీ, వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మించారు. సుమారు రూ.12కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం రూ.70కోట్ల గ్రాస్‌ని, నలభై కోట్లకుపైగా షేర్‌ని సాధించిందని సమాచారం. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 2006లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అన్ని టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. మహేష్‌ బాబు కెరీర్‌ ఈ సినిమాతో బిగ్‌ టర్న్ తీసుకుంది. ఆయన టాప్‌ స్టార్ గా మారిపోయాడు.

55
బ్యాడ్‌ లక్‌ అంటే ఆయనదే
Image Credit : youtube/@ColliderInterviews

బ్యాడ్‌ లక్‌ అంటే ఆయనదే

మొత్తంగా `పోకిరి` వంటి బ్లాక్‌ బస్టర్‌ని పవన్‌ కళ్యాణ్‌, రవితేజ, సోనూ సూడ్‌ వదులుకున్నారు. అయితే ఇందులో బ్యాడ్‌ లక్‌ అంటే రవితేజ దే. ఈ సినిమా చేసి ఉంటే ఆయన రేంజ్‌ మారిపోయేది. ఇప్పుడు టాప్‌ సూపర్‌ స్టార్స్ లో ఒకరిగా ఉండేవారు. ఒక ఫెయిల్యూర్‌(నా ఆటోగ్రాఫ్‌) మూవీ కోసం ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్నాడు రవితేజ.  

 ఇక ఈ సినిమా చేసిన మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. గ్లోబల్‌ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌, అడ్వెంచర్‌, టైమ్‌ ట్రావెల్‌ వంటి జోనర్ మేళవింపుగా ఇది రూపొందుతుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
Recommended image2
Ram Charan: ఆల్రెడీ మహేష్ సినిమాతో దెబ్బ పడింది, రాంచరణ్ సినిమా కూడా ఫ్లాపై ఉంటే.. ఎలా తిట్టేవారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved