MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?

Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నటసింహం బాలకృష్ణ.. తన రెమ్యునరేషన్ పెంచాల్సిందిపోయి.. తగ్గించుకున్నాడట. ఇంతకీ బాలయ్య ఎందుకలా చేశాడు? కారణం ఏంటో తెలుసా? అందుకే బాలయ్య మనసు బంగారం అంటుంటారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
భారీగా వసూలు చేస్తున్న హీరోలు...
Image Credit : Face book/Nandamuri Balakrishna

భారీగా వసూలు చేస్తున్న హీరోలు...

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్లు ఎప్పటికప్పుడు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కోటి తీసుకుంటే చాలా పెద్ద హీరోగా చూసేవారు. కానీ ఇప్పుడు 300 కోట్లు తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. నిర్మాణంలో భాగం అవుతున్నారు. భారీగా షేర్లు కూడా తీసుకుంటున్నారు. ఈరకంగా నిర్మాత తరువాత హీరోలలే ఎక్కువ లాభపడుతున్నారు. హిట్టు ప్లాపు సంబంధం లేకుండా.. హీరోలు ఇలా భారీగా వసూలు చేస్తున్న టైమ్ లో.. తన మంచి మనసు చాటుకున్నారు బాలయ్య.. తన రెమ్యునరేషన్ నుంచి 10 కోట్లు తగ్గించుకున్నారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నిర్మాతకు అండగా బాలకృష్ణ
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

నిర్మాతకు అండగా బాలకృష్ణ

నిర్మాతకు అండగా నిలబడాలని బాలకృష్ణ తన పారితోషికాన్ని ఏకంగా రూ. 10 కోట్లు తగ్గించుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సినిమా రిజల్ట్ తో సంబంధంలేకుండా.. హీరోలు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న టైమ్ లో, వారికి భిన్నంగా బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న టైమ్ లో.. రెమ్యునరేషన్ పెంచాల్సిందిపోయి తగ్గించాడట బాలకృష్ణ.

37
డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా బాలయ్య.
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా బాలయ్య.

డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా ఉన్నాడు బాలకృష్ణ వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. 5 సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు బాలయ్య. అఖండ సినిమాతో స్టార్ట్ అయ్యి, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్, అఖండ 2 వరకూ ఐదు సూపర్ హిట్ సినిమాలను బాలయ్య చేశారు. మలినేని గోపీచంద్ తో చేయబోతున్న నెక్ట్స్ మూవీ హిట్ అయితే.. డబుల్ హ్యాట్రిక్ హిట్ రికార్డు ఆయన సొంతం అవుతుంది.

47
నిర్మాతలకు భారం కాకూడదని
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

నిర్మాతలకు భారం కాకూడదని

అయితే, గత ఏడాది విడుదలైన ‘అఖండ-2’ మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, అధిక ఖర్చుల కారణంగా నిర్మాతలకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో బాలయ్య ఈ విషయాన్ని దృష్ణిలో పెట్టుకుని నిర్మాతలకు భారం కాకూడదని భావించారట. అందుకే తన రెమ్యునేషన్ ను తగ్గించారని సమాచారం.

57
10 కోట్లు తగ్గించుకున్న బాలయ్య..
Image Credit : Youtube/14 Reels Plus

10 కోట్లు తగ్గించుకున్న బాలయ్య..

సాధారణంగా హీరోలు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తమ పూర్తి పారితోషికాన్ని తీసుకుంటారు. కానీ, తనపై నమ్మకం ఉంచిన నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో సుమారు రూ. 40 కోట్లు అందుకున్న ఆయన, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘NBK 111’సినిమాకి రూ. 30 కోట్లకే అంగీకరించినట్లు సమాచారం.

67
65 ఏళ్ల వయసులో బాలకృష్ణ దూకుడు..
Image Credit : Nandamuri Balakrishna\Instagram

65 ఏళ్ల వయసులో బాలకృష్ణ దూకుడు..

65 ఏళ్ల వయసులో బాలకృష్ణ ఫిల్మ్ కెరీర్ పరుగులు పెడుతోంది. ఈ ఏజ్ లో ఏ హీరో కు లేనన్ని సక్సెస్ లు ఆయన ఖాతాలో పడ్డాయి. గోపీచంద్ మలినేనితో ఆయన చేస్తున్న ఈ కొత్త సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక బాలకృష్ణ నెక్ట్స్ సినిమాల లైనప్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఆయన చేయబోయే సినిమా కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

77
బాలయ్య ఖాతాలో మరికొన్ని సినిమాలు..
Image Credit : Asianet News

బాలయ్య ఖాతాలో మరికొన్ని సినిమాలు..

ఈ ప్రాజెక్టు మే 1న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అలాగే, జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీమ్ భావిస్తోంది. అదేవిధంగా, దర్శకులు వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో బాలకృష్ణ సినిమాలు చేయబోతున్నట్టు సమాచారం.ఇక రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..
Recommended image2
Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved