Guppedantha Manasu: రిషి చంపేస్తాడని భయపడుతున్న దేవయాని.. తల్లి కొడుకులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంటుంది. తమ్ముడు మీద ఈగ కూడా వాలనివ్వని ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 4 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మీకు తలనొప్పి తగ్గకపోతే అర్ధరాత్రి అయినా లేపి అడగండి, మొహమాట పడకండి టాబ్లెట్ ఇస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ధరణి. చూసావా మామ్ తను హద్దులు దాటి ఎలా మాట్లాడుతుందో అంటాడు శైలేంద్ర. నేను హద్దులు దాటలేదు, నేను హద్దులు దాటినట్లయితే మీ ఇద్దరూ ఇలా మాట్లాడుకునే వారు కాదు. మావయ్య మీ ఇద్దరినీ ఇవ్వకుండా చూడమని చెప్పారు కానీ నేను అలా చేయడం లేదు.
మీరు త్వరగా మాట్లాడేసి రండి మీకు బాగా గాయాలు అయినట్టు ఉన్నాయి ఆయింట్మెంట్ రాస్తానుఅని వెటకారంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. అప్పుడు దేవయాని ముకుల్ ని చూస్తే చాలా భయంగా ఉంది వాడి కళ్ళు డేగ కళ్ళు లాగా ఉన్నాయి అని భయంగా అంటుంది. వాడి గురించి భయపడకు వాడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు శైలేంద్ర. నా భయం వాడి గురించి కాదు రిషి కి మన గురించి తెలిస్తే చంపేస్తాడు, పెద్దమ్మ అని కూడా చూడడు అంటుంది దేవయాని.
నువ్వు టెన్షన్ పడకు టీ తాగి రిలాక్స్ అవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. మరోవైపు రిషి తో నిన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లావు కదా ఏంటి విషయాలు అని అడుగుతాడు మహేంద్ర. నేను పర్సనల్ విషయాలు మాట్లాడటానికి వెళ్ళలేదు, అమ్మ కేసు కి సంబంధించి ఆఫీసర్ ని పరిచయం చేయడానికి వెళ్లాను అంటాడు రిషి.
అతనితో మీరు కూడా మాట్లాడండి, టీ కి రమ్మని పిలుస్తాను అంటాడు. అవసరమైతే తప్పకుండా మాట్లాడుతాను కానీ మీ అమ్మని చంపిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి అంటాడు మహేంద్ర. తప్పకుండా వాళ్లు ఎలాంటి వాళ్ళు అయినా నామరూపాలు లేకుండా చేస్తాను, మీ కళ్ళ ముందే శిక్షిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
ఇప్పటికైనా ఆయన ఒక అడుగు ముందుకు వేశారు మావయ్య అంటుంది వసుధార. రిషి వేసే ప్రతి అడుగు వాళ్ళ పతనానికి నాంది అవుతుంది అంటాడు మహేంద్ర. మరోవైపు అనుపమ మహేంద్ర కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. జగతి గురించి తెలుసుకుందామంటే మహేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసాడు పెద్దమ్మ చెప్పినట్లు గతంలోకి వెళ్ళటమే కరెక్ట్ అనుకుంటుంది అనుపమ.
ఇంతలో వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏం డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతుంది. మహేంద్ర ని కలవకముందు నా మనసులో భావాలు మనసులోనే ఉండేవి కానీ మహేంద్ర కనిపించిన తర్వాత స్థిరంగా ఉండలేకపోతున్నాను వాళ్లని కలవాలని అనుకుంటున్నాను అలాగే నువ్వు చెప్పినట్లు కోపం కూడా తగ్గించుకుంటాను అంటుంది అనుపమ.
ఆ మాటలకి ఆనందపడుతుంది పెద్దమ్మ. అలాగే చేయు కానీ నీ తల్లిదండ్రులను కూడా కలువు మన వైఫల్యానికి తల్లిదండ్రులని కారణం చేయకూడదు వాళ్ళకి నీ ప్రేమని పంచు అని నచ్చ చెప్తుంది. సరే అంటుంది అనుపమ. మరోవైపు ముభావంగా కూర్చున్న దేవయానితో రాత్రి ఎందుకు లేటుగా పడుకున్నావు అని అడుగుతాడు ఫణీంద్ర. ఈయన కూడా లేటుగానే పడుకున్నారు అంటుంది ధరణి.
వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వద్దు అని టాన్స్కిస్తే టాస్క్ లో ఫెయిల్ అయ్యావు అంటాడు ఫణీంద్ర. గెలుస్తాను మావయ్య అంటుంది ధరణి. మీ టాస్కుల గోల కాస్త పక్కన పెట్టండి నేను అసలే చికాకుగా ఉన్నాను అంటుంది దేవయాని. ఏమైంది అంటాడు ఫణీంద్ర. రిషి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అందుకని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే ఆఫీసర్ తో సహా వచ్చాడు. అయినా ఇదంతా మీ తమ్ముడు వల్లే.
తను తాకకుండా ఉండి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు అంటుంది దేవయాని. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. నా తమ్ముడు ఎంత గొప్పవాడో తెలుసా ఉమ్మడిగా ఉండడం కోసం భార్యని సైతం పక్కన పెట్టాడు. అలాంటి వాడి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు నువ్వు ఇప్పటికీ వాళ్ళని అర్థం చేసుకోలేదు, వాళ్లకి కోపం తగ్గి ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని ఎదురు చూస్తున్నాను.
ఈ లోపల పిచ్చి వేషాలు వేశారంటే నాలో కోపం చూడాల్సి వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. మీరు దేవుడు లాంటి వారు మావయ్య, అందుకే మీకు నిజం తెలియకూడదని చిన్నత్తయ్య బలైపోయారు అని మనసులో అనుకుంటుంది ధరణి. మరోవైపు కాలేజీకి టైం అవుతుంది త్వరగా రండి అని రిషికి చెప్పి బయట వెయిట్ చేస్తుంది వసుధార.
రెడీ అయి బయటికి వచ్చిన రిషి తో బోర్డు మీటింగ్ ఉంది వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మిమ్మల్ని బోర్డు మీటింగ్ ని త్రాచులో వేస్తే మనసు నీదైతే మొగ్గింది అంటుంది వసుధార. మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది అని కారు ఎక్కుతాడు రిషి. తర్వాతే ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.