- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతికి సపోర్ట్ చేస్తున్న ఫణీంద్ర.. రిషి ప్రవర్తనకు షాకైన ఏంజెల్, విశ్వనాథం?
Guppedantha Manasu: జగతికి సపోర్ట్ చేస్తున్న ఫణీంద్ర.. రిషి ప్రవర్తనకు షాకైన ఏంజెల్, విశ్వనాథం?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన కొడుకు ఆశయాన్ని నెరవేర్చడం కోసం తపన పడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మిషన్ ఎడ్యుకేషన్ లో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నా తెలివితేటలతో రిషి ప్లేస్ ని రిప్లేస్ ని రీ ప్లేస్ చేస్తాను అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుతున్నావు రిషి ప్లేస్ ని నువ్వే కాదు ఎవరు రీప్లేస్ చేయలేరు అంటుంది జగతి. ఏం ఎందుకు చేయలేరు? శైలేంద్ర కూడా చదువుకున్నాడు కదా అతనికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటుంది దేవయాని.
నిజంగానే రిషి ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అతని క్యాపబిలిటీని అందుకోవటం మనకి సాధ్యం కాదు అని మరదలు కి సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతాడు ఫణీంద్ర. మీటింగ్ అరేంజ్ చేయమని మహేంద్ర కి చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర దగ్గరికి వచ్చి నువ్వు నాతో మాట్లాడవు కానీ నేను చెప్పేది ఒకసారి విను శైలేంద్రని కొట్టడం నీకు తప్పుగా అనిపించొచ్చు కానీ నాకు నా కొడుకు కంటే ఎవరు ఎక్కువ కాదు.
వాడి క్షేమం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్తుంది జగతి. శైలేంద్ర మిషన్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అవుతాను అంటున్నాడు.. అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు అతని స్వభావం మిగిలిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు ఆలోచించాలి ఈ విషయాలు నేను మీటింగులో చెప్పలేను అందుకే నీకు చెప్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి. ఈ మాటలు వింటాడు శైలేంద్ర.
నా మీదే చాడీలు చెప్తావా అని మనసులో కసిగా అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే షాపింగ్ చేసి వచ్చిన ఏంజెల్ మెడలో చైన్ ఒక దొంగ కొట్టేసి పారిపోతూ ఉంటాడు. ఆ పెనుగులాటలో ఏంజెల్ కింద పడిపోతుంది హెల్ప్ అంటూ కేకలు వేస్తుంది. అప్పుడే అటువైపుగా వస్తున్న వసుధార ఆ సంఘటన చూసి పారిపోతున్న దొంగ మీదికి కర్ర విసురుతుంది. కింద పడిపోయిన దొంగ దగ్గర నుంచి చైన్ లాక్కుంటుంది.
నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ దగ్గరికి వచ్చి ఆమెని పైకి లేపి చైన్ ఆమెకి ఇస్తుంది. చాలా థాంక్స్ ఇది నా సెంటిమెంట్ చైన్ అంటుంది ఏంజెల్. కొన్ని వస్తువుల మీద సెంటిమెంట్ అలా ఉండిపోతుంది వాటికి ఏమైనా అయితే భరించలేము అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వసు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ ని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది విశ్వనాథం గారి ఇల్లు అని, ఏంజెల్ విశ్వనాథం గారి మనవరాలు అని తెలుసుకుంటుంది.
ఏంజెల్ కూడా వసు వాళ్ల కాలేజీలోనే పనిచేస్తుందని తెలుసుకుంటుంది. బయటి నుంచే వెళ్ళిపోబోతుంటే కాఫీ తాగకుండా వెళ్ళిపోతే మా విశ్వం బాధపడతాడు అని చెప్పి లోపలికి తీసుకెళ్లి కాఫీ ఇస్తుంది. జరిగిందంతా విశ్వనాథంతో చెప్తుంది ఏంజెల్. విశ్వనాథం కూడా కాలేజీలో కేడి బ్యాచ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి అంటూ జరిగిందంతా చెప్తాడు. ఇంతలోనే రిషి వస్తాడు. రిషి కి వసు ని పరిచయం చేస్తుంది ఏంజెల్.
తను నాకు తెలుసు అని చెప్తాడు రిషి.రిషి సర్ కూడా నాకు బాగా తెలుసు అంటుంది వసు. మరి ఇద్దరూ అంత బాగా తెలిసినప్పుడు ఎందుకు ఎవరో అపరిచితుల్లాగా ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు అంటుంది ఏంజెల్. మన రిషి ఎక్కువ ఎవరితోనూ మాట్లాడడు కదమ్మ అంటాడు విశ్వనాథం. అప్పటికే రిషి ఇబ్బంది పడుతుండడం గమనించి నేను బయలుదేరుతాను అంటుంది వసు. వసుధారని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని రిషి ని అడుగుతుంది ఏంజెల్.
నాకు కుదరదు చాలా పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. రిషి ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు విశ్వనాథం, ఏంజెల్. వద్దులెండి ఆయనని ఇబ్బంది పెట్టొద్దు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది వసు. ఆ తరువాత రిషి తనని కలవడానికి వచ్చిందని అనుకుంటాడు రిషి. ఎంత గతం గుర్తు చేయద్దు అని చెప్పిన తను నా వెంట పడుతుంది కానీ నేను ఆమెను జీవితంలో క్షమించేది లేదు అనుకుంటాడు. అటు వసుధర కూడా రిషి సర్ నన్ను అపార్థం చేసుకుంటారు. కానీ ఎప్పటికైనా ఆయన నిజం తెలుసుకుంటారు అప్పటివరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అనుకుంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.