- Home
- Entertainment
- Guppedantha Manasu: షార్ట్ ఫిల్మ్ హీరో, హీరోయిన్లుగా వసు, రిషీ.. దేవాయనిని షూటింగ్ కి రాకుండా చేసిన ఫణింద్ర!
Guppedantha Manasu: షార్ట్ ఫిల్మ్ హీరో, హీరోయిన్లుగా వసు, రిషీ.. దేవాయనిని షూటింగ్ కి రాకుండా చేసిన ఫణింద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu) ఈ సీరియల్ ప్రేక్షకులలో గొప్ప స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

సీరియల్ ప్రారంభం కావడంతోనే రిషి వసుధార ఇంటి దగ్గరకి వచ్చి కార్ హారన్ కొడుతూ ఉంటాడు. వసుధారా ఇది రిషి సార్ కార్ హారన్ అంటూ సంతోషంతో వెళ్తుంది. ఇదంతా చూస్తున్న జగతి నవ్వుకుంటూ ఉంటుంది.
రిషి,వసుధార కారులో వెళుతుండగా జగతి మేడమ్ కి కాల్ చెయ్యి మాట్లాడాలి అంటాడు. మళ్లీ ఏం జరుగుతుందో అన్న భయంతోనే జగతికి కాల్ చేస్తుంది వసుధారా. రిషి మాత్రం కూల్ గా షార్ట్ ఫిలిం సక్సెస్ కావాలి అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తాడు. దీంతో వసుధార, జగతి చాలా ఆనంద పడతారు.
ఇక దేవయాని కాలేజీలో జరిగే షూటింగ్ కి వెళ్తాను అంటూ రెడీ అయ్యి వెళుతూ ఉంటుంది. ఫణింద్రా మాత్రం నువ్వు దేనికోసం వెళ్తున్నావు నాకు తెలుసు అంటూ నువ్వు వెళ్ళకూడదు అని చెప్తాడు. దీంతో దేవయాని మండిపోతు ఉంటుంది. ఇది చూస్తూ ధరణి లోలోపలే నవ్వుకుంటుంది.
కాలేజీలో షార్ట్ ఫిలిం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వసుధార, గౌతమ్ కూడా రెడీ అవుతూ ఉంటారు. ఈలోపు రిషి అక్కడికి వస్తాడు చీరలో ఉన్న వసుధారాను అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక షూటింగ్ ని ప్రారంభిస్తారు డైరెక్టర్.
గౌతమ్ డైలాగ్స్ చెప్పమంటే తనకు నచ్చినట్టు, తన స్టైల్ లో చెప్తూ డైరెక్టర్ ని విసిగిస్తాడు. దాంతో డైరెక్టర్ అందరికీ లంచ్ బ్రేక్ అంటూ వెళ్ళిపోతాడు. రిషి, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ వచ్చి నా యాక్టింగ్ ఎలా ఉంది అంటూ అడుగుతాడు.
మహేంద్ర మాత్రం యాక్టింగ్ లాగానే ఉంది అంటూ కామెడీ చేస్తాడు. ఇక జగతి లంచ్ క్యారియర్ ను తీస్తూ మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇది గమనించిన రిషి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఇక మహేంద్ర జగతి దగ్గరకు వెళ్తాడు.
జగతి మాత్రం రిషికి ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తావు మహేంద్ర అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వసుధారా కూడా మేడతో కలిసి భోజనం చేయాలా లేక వెరెగా కూర్చుని భోజనం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
గౌతమ్ సరిగా నటించకపోవడంతో రిషి మధ్యలోకి వచ్చి నన్ను చూసి నేర్చుకో అంటాడు. వసుధారా మాత్రం రిషితో కలసి నటించడానికి భయపడుతూ ఉంటుంది. ఇక ధైర్యం తెచ్చుకుని "ఏవండోయ్ శ్రీవారు కాఫీ తీసుకోండి ఆదివారం ఫ్యామిలీకి ఇవ్వండి" అంటుంది.
ఇక రిషి కూడా అలాగే పంతులమ్మ అంటూ వసుధారా ని దగ్గరగా లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న గౌతమ్ షాక్ అవుతాడు. జగతి, మహేంద్ర మాత్రం సంతోషంతో అలానే చూస్తూ ఉంటారు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో చూడాలి..