- Home
- Entertainment
- Guppedantha Manasu: మహేంద్ర దంపతులను నిలదీసిన ఫణీంద్ర.. కొడుకుకు పట్టాభిషేకం చేయాలంటున్న జగతి?
Guppedantha Manasu: మహేంద్ర దంపతులను నిలదీసిన ఫణీంద్ర.. కొడుకుకు పట్టాభిషేకం చేయాలంటున్న జగతి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. అయినవాళ్ళ మోసం భరించలేక ఇంట్లోంచి బయటికి వచ్చేసిన ఓ దంపతుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వాటర్ బాటిల్ అందుకోబోతూ కింద పడిపోతుంది వసుధార. ఆ శబ్దానికి ఆమె దగ్గరికి వస్తాడు రిషి. కావాలనే పడిపోయింది ఏమో అనుకుంటాడు. ఆ ఫీలింగ్స్ అర్ధం చేసుకున్న వసుధార నేనేమీ కావాలని పడిపోలేదు అంటుంది. లేవచ్చు కదా అంటాడు రిషి. లేచే ఓపిక ఉంటే పడిపోయే దాన్నే కాదు అంటుంది వసుధార.
ఆమెని జాగ్రత్తగా లేపి పైన కూర్చోబెడతాడు రిషి. థాంక్స్ చెప్తుంది వసుధార. మీరేమీ నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు నేను మీకోసం చేయలేదు నా ప్రాణాలు కాపాడిన ఈ ఇంట్లో వాళ్ళు చల్లగా ఉండాలి అందుకే వాళ్ళ కోసమే చేశాను. నా పని అయిపోయింది ఏమైనా అవసరం అయితే పిలువు అంటాడు రిషి. పిలిస్తే పలికే అంత దగ్గరలోనే ఉండండి సార్ అంటుంది వసు.
వాటర్ బాటిల్, ఫ్రూట్స్ వున్న టీపాయి వసుధార పక్కకి జరిపి అన్ని దగ్గర గాని ఉన్నాయి ఇకమీదట నా అవసరం కాకుండా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు మనం ఇంట్లోంచి వచ్చేసాము అని తెలిస్తే అన్నయ్య భరించలేడు ఎక్కడికి వస్తాడు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు జగతి దంపతులు.
అంతలోనే ఫణింద్ర వస్తాడు. ఏం జరిగింది ఇంట్లోంచి వచ్చే వలసిన అవసరం ఏముంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దేవయాని వాళ్లు ఏమైనా అన్నారా.. మీ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నారా చెప్పండి అసలు అక్కడ మీకు వచ్చిన డిస్టబెన్స్ ఏంటి అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అన్నయ్య మేము ఇక్కడ వర్కర్స్ కి హెల్ప్ గా ఉండటం కోసమే వచ్చేసాము అంటాడు మహేంద్ర.
అలా అయితే నేను కూడా ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తాను పని పూర్తయ్యాక అందరం కలిపి ఇంటికి వెళ్దాం అంటాడు ఫణీంద్ర. వద్దు బావ గారు మీరు ఇక్కడ ఉండలేరు అంటుంది జగతి. అయితే పదండి నాతో పాటు ఇంటికి వెళ్దాము కలిసి వర్క్ చేద్దాము అయితే అక్కడో లేకపోతే ఇక్కడో మీరే డిసైడ్ చేసుకోండి అంటాడు ఫణీంద్ర. సరే అన్నయ్య ఇక్కడే ఉందాము అంటాడు మహేంద్ర.
సరే అయితే నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బావగారు ని ఇక్కడ ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నావు అంటుంది జగతి. తప్పదు జగతి అన్నయ్య నన్ను వదిలేసి ఉండలేడు. అన్నయ్యకి అబద్ధం చెప్తున్నందుకు నాకు చాలా గిల్టీగా ఉంది ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఊహించలేదు అని బాధపడతాడు మహేంద్ర.
మరోవైపు ఏంజెల్ రిషి కి ఫోన్ చేసి నేను రావటం లేట్ అవుతుంది. ఇది వసుధారకి టాబ్లెట్స్ వేసే టైం వెళ్లి టాబ్లెట్ ఇచ్చి రా లేదంటే మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది అంటుంది ఏంజెల్. సరే అని ఫోన్ పెట్టేసిన రిషి వసుధార దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి అని అడిగి ఆమెకి ఆ టాబ్లెట్స్ ఇస్తాడు. ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. బోర్ కొడుతుంది కంపెనీ కావాలి అంటుంది వసుధార.
కంపెనీలు, కాఫీలు ఇవ్వటానికి నేను పాత రిషి ని కాదు అంటాడు రిషి. గతం నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు మరి ఆ బ్రేస్లెట్ మీకు అడ్డు రావటం లేదా అని తన గిఫ్ట్ గా ఇచ్చిన బ్రాస్లెట్ గురించి అడుగుతుంది వసుధార. ఇది ఉంటేనే కదా నాకు జరిగిన వెన్నుపోటు గుర్తొస్తుంది. అయినా ఇది గిఫ్ట్ గా ఇచ్చినవాళ్లు ఇదే నా చేతికి ఉండాలి అని ఆశపడ్డారు అందుకే ఉంచుకున్నాను.
నేను మనుషులకు దూరంగా ఉండాలనుకున్నాను కానీ జ్ఞాపకాలకి కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అంతలోనే ఏంజెల్ వాళ్ళు వస్తారు. నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అంటుంది ఏంజెల్. ముందు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పడంతో లోపలికి వెళ్ళిపోతుంది ఏంజెల్. మరోవైపు మహేంద్ర దంపతులు మాట్లాడుకుంటూ శైలేంద్ర ఇంత పనిచేస్తాడు అనుకోలేదు.
ఎలాగైనా మన కొడుకుని తీసుకొచ్చి ఎండి సీటు వాడికి ఇవ్వని తల్లిదండ్రులుగా మనం వాడికి ఇచ్చే గిఫ్ట్ ఇదే అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర తను ఎక్కడైతే అవమానాల పాలయ్యాడు అక్కడే గౌరవంగా అతనికి పట్టాభిషేకం చేయాలి అని ఎమోషనల్ అవుతుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.