MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి

రామ్‌ చరణ్‌ నటిస్తోన్న `పెద్ది` సినిమా వాయిదా పడబోతుందట. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ కోసం రామ్‌ చరణ్‌ వెనక్కి తగ్గాలని చూస్తున్నారట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 24 2026, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెద్దితో రాబోతున్న రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

పెద్దితో రాబోతున్న రామ్‌ చరణ్‌

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. ఆయన చివరగా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు `పెద్ది` సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఔట్‌పుట్‌ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారట. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మార్చి 27న పెద్ది రిలీజ్‌
Image Credit : X/@vriddhicinemas

మార్చి 27న పెద్ది రిలీజ్‌

`పెద్ది` సినిమా నుంచి విడుదలైన `చికిరి` సాంగ్‌ ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. అత్యధికంగా వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. ఇదే సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీని మార్చి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కుర్రాళ్లు థియేటర్లకి క్యూ కడుతుంటారు. ఆ సమయంలో సినిమా వస్తే మంచి ఆదరణ దక్కుతుందని టీమ్ భావించి ఈ డేట్‌ని ఫిక్స్ చేసింది. 

Related Articles

Related image1
Allu Arjun: మరో తమిళ దర్శకుడికి బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌?.. త్రివిక్రమ్‌తోపాటు తెలుగు డైరెక్టర్లకి షాక్‌
Related image2
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
36
పెద్ది సినిమా వాయిదా?
Image Credit : X/@MythriOfficial

పెద్ది సినిమా వాయిదా?

ఇదిలా ఉంటే ఇప్పుడీ మూవీ వాయిదా పడుతుందట. `పెద్ది` మూవీ మార్చి 27న కాకుండా వెనక్కి వెళ్తుందట. మేలోగానీ, జూన్‌లోగానీ విడుదలయ్యే అవకాశం ఉందట. మరి ఉన్నట్టుండి ఈ వాయిదా ఏంటనేది ఆశ్చర్యంగా మారింది. దానికి కారణం పవన్‌ కళ్యాణ్‌ అని సమాచారం. ఆయన హీరోగా నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారట. `పెద్ది` డేట్‌ కే దాన్ని థియేటర్లోకి తీసుకురావాలనుకుంటున్నారట. దీంతో బాబాయ్‌ కోసం రామ్‌ చరణ్‌ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

46
పెద్ది డేట్ కి ఉస్తాద్‌ భగత్ సింగ్‌ ?
Image Credit : youtube/@SonyMusicSouthOfficial

పెద్ది డేట్ కి ఉస్తాద్‌ భగత్ సింగ్‌ ?

అయితే `పెద్ది` సినిమా నిర్మాతలు, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` నిర్మాతలు ఒక్కరే. మైత్రీ మూవీ మేకర్స్ వీటిని నిర్మిస్తున్నారు. హీరో, దర్శకుల అభిప్రాయం మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. బాబాయ్‌ వస్తానంటే అబ్బాయి కాదంటాడా? అందుకే `ఉస్తాద్‌` కోసం చరణ్‌ `పెద్ది` వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. 

56
పెద్ది వాయిదాకి అసలు కారణం ఇదేనా?
Image Credit : MythriMovieMakers\Twitter

పెద్ది వాయిదాకి అసలు కారణం ఇదేనా?

ఇదిలా ఉంటే `పెద్ది` వాయిదాకి మరో కారణం ఉందట. ఈ మూవీ షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదట. కొంత షూటింగ్‌ పెండింగ్‌ ఉందట. దీంతోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరగాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ రిలీజ్‌ కి సంబంధించిన థియేటర్‌ నిబంధనలు ఉంటాయి. ప్రమోషన్స్ ఉంటాయి. దీంతో అనుకున్న డేట్‌ కి ఇవన్నీ పూర్తి చేయడం కష్టమని భావించి టీమ్‌ వెనక్కి తగ్గే అవకాశం ఉందని, దీంతో ఆ తేదీన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని దించాలని అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

66
ఓజీతో పవన్‌ కళ్యాణ్‌ బౌన్స్ బ్యాక్‌
Image Credit : X/@MythriOfficial

ఓజీతో పవన్‌ కళ్యాణ్‌ బౌన్స్ బ్యాక్‌

ఇక `ఉస్తాద్ భగత్‌ సింగ్‌` చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించగా, హరీష్‌ శంకర్‌ దర్శకుడు. `గబ్బర్‌ సింగ్‌` తర్వాత ఈ కాంబో కలిసి పనిచేస్తోంది. ఇందులో శ్రీలీలా హీరోయిన్‌. ఇటీవల విడుదల చేసిన `దేఖ్‌ లేంగే సాలా` పాట ఆద్యంతం యువతని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ చివరగా `ఓజీ` చిత్రంతో అలరించారు. ఆయన కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సుమారు మూడు వందల కోట్ల కలెక్షన్ల వరకు వెళ్లిందని సమాచారం. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించారు. ముంబాయి గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందింది. పవన్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ మూవీ సక్సెస్‌ తో పవన్‌ బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఆయనకు మార్కెట్ విస్తరించింది. ఇది `ఉస్తాద్‌`కి హెల్ప్ కాబోతుందని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్‌ కి డిప్యూటీ సీఎం అనే విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Related Stories
Recommended image1
Allu Arjun: మరో తమిళ దర్శకుడికి బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌?.. త్రివిక్రమ్‌తోపాటు తెలుగు డైరెక్టర్లకి షాక్‌
Recommended image2
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved