MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi New Release Date: రామ్‌ చరణ్‌ `పెద్ది` రిలీజ్‌ డేట్‌ మారింది, కొత్త తేదీ ఇదే.. కారణం ఏంటంటే?

Peddi New Release Date: రామ్‌ చరణ్‌ `పెద్ది` రిలీజ్‌ డేట్‌ మారింది, కొత్త తేదీ ఇదే.. కారణం ఏంటంటే?

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమా రిలీజ్‌ డేట్‌ మారింది. తాజాగా కొత్త తేదీని ప్రకటించారు. సమ్మర్‌ స్పెషల్‌గా ఈ మూవీ రాబోతుంది. పవన్‌ వచ్చిన నెల రోజులకు రామ్‌ చరణ్‌ ఆడియెన్స్ముందుకు రాబోతున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 04 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది మూవీ రిలీజ్‌ డేట్‌ మారింది
Image Credit : Asianet News

పెద్ది మూవీ రిలీజ్‌ డేట్‌ మారింది

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చి 27న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ మారింది. తాజాగా కొత్త తేదీని ప్రకటించారు.

25
పెద్ది కొత్త రిలీజ్‌ డేట్‌
Image Credit : X/@MythriOfficial

పెద్ది కొత్త రిలీజ్‌ డేట్‌

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీని `పెద్ది` డేట్‌కి ఫిక్స్ చేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అనంతరం ఇప్పుడు `పెద్ది` మూవీకి సంబంధించి కూడా కొత్త డేట్‌ని ప్రకటించారు. ఈ మూవీని ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్‌ 30న రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

Related Articles

Related image1
MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌
Related image2
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
35
`పెద్ది` వాయిదా వల్లే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఎంట్రీ
Image Credit : MythriMovieMakers\Twitter

`పెద్ది` వాయిదా వల్లే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఎంట్రీ

`పెద్ది` సినిమా వాయిదా పడటానికి కారణం ఏంటనేది చూస్తే, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అంతా పవన్‌ కళ్యాణ్‌ కోసం అనుకుంటున్నారు. పవన్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం వాయిదా పడిందనే టాక్‌ నడుస్తుంది. కానీ నిజం ఏంటేంటే `పెద్ది` వాయిదా పడటం వల్లే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని ఆ డేట్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. మార్చి 26న మంచి స్లాట్‌గా భావించి పవన్‌ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు.

45
`పెద్ది` వాయిదాకి కారణం ఇదే
Image Credit : Asianet News

`పెద్ది` వాయిదాకి కారణం ఇదే

ఇక `పెద్ది` సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చాలా వర్క్ ఉందట. కొంత ప్యాచ్‌ వర్క్, సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ పూర్తి కాలేదట. దానికి ఇంకా టైమ్‌ పడుతుంది. నెల రోజులు ఆ వర్కే అవుతుందని, అందుకే మార్చి 26న రిలీజ్‌ చేయడం కష్టమని భావించిన మేకర్స్ నెల రోజులు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 30న ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా నెల రోజుల గ్యాప్‌తోనే అటు పవన్‌ కళ్యాణ్‌, ఇటు రామ్‌ చరణ్‌ థియేటర్లలో సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.

55
రిలీజ్‌ కి ముందే అంచనాలు పెంచిన `పెద్ది`
Image Credit : Asianet News

రిలీజ్‌ కి ముందే అంచనాలు పెంచిన `పెద్ది`

`పెద్ది` మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రామ్‌ చరణ్‌ క్రికెటర్‌ అంటే ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడట. రామ్‌ చరణ్‌ లుక్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఊరమాస్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. ఇది సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. `పుష్ప` సినిమాని తలపిస్తుంది. కథ కూడా అదే రేంజ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, `చికిరి` సాంగ్‌ ఆద్యంతం ఆకట్టుకుని వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్, బాక్సాఫీస్ కి రెడ్ అలెర్ట్.. ధురంధర్ కి ఎదురెళుతున్న ఒకే ఒక్కడు
Recommended image2
చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన కమెడియన్ ఎవరో తెలుసా ? మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి నన్ను తిట్టకు అంటూ..
Recommended image3
మహేష్ బాబు విషయంలో కృష్ణ నే ఎదిరించాడు, చరిత్రలో నిలిచిపోయే పాట ఇచ్చిన డైరెక్టర్ ఎవరు?
Related Stories
Recommended image1
MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌
Recommended image2
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved