MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?

Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?

రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన `పెద్ది` విజయవంతంగా రన్‌ అవుతుంది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబడుతుంది. అయితే సోమవారం ఈ చిత్రానికి ఎంత వచ్చాయనేది చూస్తే ఆశ్చర్యపోతారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 09 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెద్ది బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : Asianet News

పెద్ది బాక్సాఫీసు రిపోర్ట్

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఆల్మోస్ట్ యాభై శాతం కలెక్షన్లని రాబట్టింది. ఆదివారం అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఇక ఇప్పుడు సోమవారం నుంచి ఈ సినిమా ఎలా పర్‌ఫెర్మ్ చేస్తుంది. కలెక్షన్లు ఎలా వస్తాయనే ఆసక్తి నెలకొంది.  తాజాగా మండే వసూళ్ల రిపోర్ట్ వచ్చింది. డ్రాప్‌ మాత్రం గట్టిగానే ఉంది. కానీ డీసెంట్‌ వసూళ్లని రాబట్టింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెద్ది ఐదో రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

పెద్ది ఐదో రోజు కలెక్షన్లు

`పెద్ది` మూవీ ఐదో రోజు రూ.14కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. ఆదివారం రూ.38కోట్లు రాబడితే, సోమవారం అందులో దాదాపు 40శాతం వసూళ్లని రాబట్టింది. ఇది సగానికిపైగానే తగ్గిందని చెప్పొచ్చు.  దీంతో ఐదు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.250కోట్లకు(రూ.248.92) చేరింది.

34
పెద్ది మూవీ డే వైజ్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

పెద్ది మూవీ డే వైజ్‌ కలెక్షన్లు

ఈ సినిమాకి ఇండియాలో రూ.201.92కోట్లు వచ్చాయి. ప్రీమియర్స్ రోజు రూ.21.83కోట్లు, మొదటి రోజు రూ.60.66కోట్లు, రెండో రోజు రూ.32కోట్లు, మూడో రోజు రూ.34.88కోట్లు, నాల్గో రోజు రూ.38.25కోట్లు, ఐదో రోజు రూ.14.30కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రూ.47కోట్లు రాబట్టింది. ఐదు రోజుల్లో దీనికి రూ.248.92కోట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే నాలుగు రోజుల్లో దీనికి రూ.292కోట్లు వచ్చినట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్‌ కావాలంటే రూ.220కోట్ల నెట్‌ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం ఇది హిట్‌ కావాలంటే ఇంకా రెండు వందల కోట్ల గ్రాస్‌ రాబట్టాల్సి ఉంటుంది. అయితే సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే, మున్ముందు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇది సాధ్యమే అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

44
తమ ఊరి గుర్తింపు కోసం పెద్ది పోరాటం
Image Credit : Asianet News

తమ ఊరి గుర్తింపు కోసం పెద్ది పోరాటం

రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన `పెద్ది` సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. అటవి ప్రాంతంలో ఉన్న తమ కొండకిందవూరుకి గుర్తింపు కోసం, అక్కడికి రైల్వే స్టేషన్‌ తేవడం కోసం పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా. తన పోరాటానికి ఆటని ఆయుధంగా మల్చుకోవడం విశేషం. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అదే టాక్‌తో ఇంతటి వసూళ్లని రాబట్టడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image2
Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved