MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?

Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?

Pavitra Lokesh:  నటి పవిత్రా లోకేష్ తల్లి పార్వతి లోకేష్, తన కూతురి మొదటి పెళ్లి గురించి సంచలన విషయాలు చెప్పారు. మొదట ఒ సాఫ్ట్ వేర్‌తో పెళ్లి జరిగిందని, అది రెండు నెలల్లోనే పెటాకులైందని తెలిపింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు రట్టు
Image Credit : Asianet News

పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు రట్టు

నటి పవిత్రా లోకేష్ ఇప్పుడు నరేష్‌తో హ్యాపీగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సుచేంద్ర ప్రసాద్‌తో విడిపోయాక, 2023లో వీకే నరేష్‌ను అనాధికారికంగా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది పవిత్రకు మూడో బంధం. సుచేంద్ర ప్రసాద్‌తో రిలేషన్‌షిప్‌కు ముందు, 2007లోనే ఆమెకు పెళ్లయింది. హైదరాబాద్‌కు చెందిన సూర్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పవిత్ర పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి రెండు నెలలు కూడా నిలవలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పవిత్ర ఫస్ట్ పెళ్లిలో నరకం చూసింది
Image Credit : YT

పవిత్ర ఫస్ట్ పెళ్లిలో నరకం చూసింది

ఈ విషయాలన్నింటినీ పవిత్రా లోకేష్ తల్లి, దివంగత నటుడు మైసూర్ లోకేష్ భార్య అయిన పార్వతి లోకేష్, 'చిత్రలోక డాట్‌కామ్' పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. కూతురి జీవితంలో ఎదురైన కష్టాలను తలుచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. `పవిత్ర మొదటి పెళ్లి జరిగింది ఆంధ్రాలోని హైదరాబాద్‌లో. అబ్బాయి పేరు సూర్య. అక్కడి ఓ గుడిలో పవిత్ర పెళ్లి జరిగింది. అక్కడ రాత్రి, తెల్లవారుజామున సంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లికి మా అత్తగారి వాళ్లతోపాటు అంతా వచ్చారు. అది లవ్ మ్యారేజ్ కాదు. బెంగళూరులో మా పక్కింటి వాళ్లు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను చూపించారు. అతనికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు` అని పార్వతి వివరించారు.

36
పవిత్ర పెళ్లికి కట్నం గట్టిగానే ఇచ్చాం
Image Credit : our own

పవిత్ర పెళ్లికి కట్నం గట్టిగానే ఇచ్చాం

'పెళ్లికి చాలా ఖర్చు పెట్టాం. వాళ్లు కట్నం కూడా తీసుకున్నారు. వెండి, బంగారు సామాన్ల లిస్ట్ ఇచ్చారు. ఇప్పటి లెక్కల్లో చూస్తే అది చాలా ఎక్కువే అవుతుంది. వెండి సామాన్లు, అబ్బాయికి చైను, పెళ్లి ఖర్చులు, రిసెప్షన్ ఖర్చులు అన్నీ మేమే భరించాం, వాళ్లు అడిగినంత ఇచ్చాం' అని పార్వతి లోకేష్ చెప్పారు.

46
భర్త చిత్ర హింసలు పెట్టాడు, అందుకే సుచేంద్రకి దగ్గరైంది
Image Credit : Asianet News

భర్త చిత్ర హింసలు పెట్టాడు, అందుకే సుచేంద్రకి దగ్గరైంది

'దాస్ ప్రకాశ్ ప్యారడైజ్‌లో రిసెప్షన్ జరిగింది. కానీ ఆమె జీవితంలో ఏవేవో జరిగిపోయాయి. రెండు నెలలు కూడా కాపురం చేయలేకపోయింది. అతను ఆమె దగ్గరున్న డబ్బంతా లాక్కున్నాడు. అప్పుడు పవిత్ర ఒక తెలుగు సీరియల్ చేస్తోంది. సినిమాల నుంచి ఆమెకే డబ్బంతా వస్తుందని అనుకుని, ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. మొదటి భర్త నరకం చూపించాడు. ఆ తర్వాతే ఆమె జీవితంలోకి సుచేంద్ర ప్రసాద్ వచ్చారు.  ఒక సీరియల్ టైంలో వాళ్లిద్దరూ పరిచయం అయ్యారు' అని తెలిపారు పార్వతి.

56
పవిత్ర లోకేష్‌ ఫస్ట్ మ్యారేజ్‌  కష్టాలు
Image Credit : our own

పవిత్ర లోకేష్‌ ఫస్ట్ మ్యారేజ్‌ కష్టాలు

'పవిత్రను అతను చాలా అనుమానించేవాడు. సినిమాల్లో పవిత్ర చేసే సీన్లు చూసి అనుమానపడేవాడు. పెళ్లయిన రెండు నెలలకే టార్చర్ మొదలైంది. మైసూర్‌కు వచ్చి నాతో చెప్పుకుంది. షూటింగ్ సెట్‌కు వచ్చి తిట్టేవాడు. ఈ సీన్ ఎందుకు చేశావ్ అంటూ గొడవపడేవాడు. దీంతో ఆమెకు నరకం కనిపించింది. ఆమె దగ్గర ఒక కారు ఉండేది. దాన్ని అమ్మేయమని చెప్పి అమ్మించేశాడు. ఇదంతా హైదరాబాద్‌లోనే జరిగింది. పెళ్లికి వచ్చిన వస్తువులన్నీ వాళ్లే తీసుకున్నారు. ఆమె పేరు మీద ఉన్న బాండ్లను కూడా వాళ్లే క్యాష్ చేసుకున్నారు. ఇన్ని కష్టాలు పడ్డాక ఆమె జీవితంలోకి సుచేంద్ర ప్రసాద్ వచ్చారు' అని తల్లి పార్వతి ఆవేదనతో చెప్పుకొచ్చారు.

66
నరేష్‌తో కలిసి ఉంటున్న పవిత్ర లోకేష్‌
Image Credit : Asianet News

నరేష్‌తో కలిసి ఉంటున్న పవిత్ర లోకేష్‌

సుచేంద్రతో కొంత కాలం హ్యాపీగా ఉంది పవిత్ర లోకేష్‌. కానీ కొన్నాళ్ల తర్వాత అక్కడ కూడా ఇలాంటిదే స్టార్ట్ అయ్యింది. పవిత్రని తక్కువ చేసి చూడటం, అవమానించడం వంటి కారణాలతో వీరిద్దరు దూరమయ్యారు. చాలా కాలంగా దూరంగా ఉన్నారు. అలాంటి సమయంలోనే పవిత్రకి నరేష్‌ పరిచయం అయ్యాడు. వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు కలిసి ఉంటున్నారు. నరేష్‌ తన మూడో భార్యకి విడాకులు ఇచ్చాడు. పవిత్ర తన రెండో భర్తకి విడాకులు ఇచ్చింది. అయితే ఈ కేసు ఇంకా కోర్ట్ లో ఉంది. కోర్ట్ నుంచి అధికారికంగా విడాకులు వస్తే, ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకుంటారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Upasana Networth: సినిమాలకు సంబంధం లేకుండా వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన ఉపాసన.. ఆమె ఆస్తులెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved