MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Peddi 4 Days Collections: పెద్ది మూవీ విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. మొదటి వారం ముగిసింది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలనే లెక్కలు చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెద్ది మూవీ బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X/@vriddhicinemas

పెద్ది మూవీ బాక్సాఫీసు రిపోర్ట్

రామ్‌ చరణ్‌ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `పెద్ది` ఇప్పుడు థియేటర్లలో జోరు చూపిస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా, వసూళ్లని పరంగా మాత్రం జోరు చూపిస్తోంది. స్టడీగా కలెక్షన్లు ఉన్నాయి. మూడు రోజులుగా ఒకే తరహా కలెక్షన్లని రాబడుతుంది. ఇది సినిమాకి పాజిటివ్‌ సైన్‌గా భావించవచ్చు. అయితే `పెద్ది` విడుదలై నాలుగు రోజులు పూర్తయ్యింది. మొదటి వారం ముగిసింది. మరి ఇప్పటి వరకు ఎంత రాబట్టింది. సినిమా హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెద్ది 4 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@vriddhicinemas

పెద్ది 4 రోజుల కలెక్షన్లు

పెద్ది మూవీ నాలుగు రోజుల్లో సుమారు రూ.233కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. టికెట్‌ సేల్స్ ని బట్టి ఈ లెక్కలు తీశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నాల్గో రోజు సుమారు రూ.32కోట్ల వరకు రాబట్టిన సమాచారం. మూడో రోజు రూ.28కోట్లు వసూలు చేస్తే, నాల్గో రోజు ఆదివారం కలెక్షన్లు పెరగడం విశేషం. వీకెండ్‌ కావడంతో ఆదివారం సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో సినిమాకి కలిసి వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.135కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇది అధికారిక లెక్క. కానీ అనాధికారికంగా 110కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు టాక్‌. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా మంచి కలెక్షన్లే రాబట్టిందని చెప్పొచ్చు.

34
పెద్ది హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలి?
Image Credit : X/@vriddhicinemas

పెద్ది హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలి?

 `పెద్ది` సినిమాకి అయిన బిజినెస్‌ రూ.220కోట్లు. సినిమా హిట్‌ కావాలంటే రూ.450కోట్ల వరకు గ్రాస్‌ వసూలు చేయాలి. ఇప్పటి వరకు సగం వచ్చాయి. మొదటి వారంలో 50శాతం రాబట్టింది. ఇక అసలు పరీక్ష ఈ సోమవారం నుంచే ఉందని చెప్పొచ్చు. సాధారణంగా సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోతాయి. సినిమా టాక్‌ని బట్టి పడిపోతుంటాయి. బాగుంటే ఆ డ్రాప్ తక్కువగానే ఉంటుంది, లేదంటే సగానికి సగం పడిపోతుంటాయి. మరి సోమవారం `పెద్ది`కి వచ్చే కలెక్షన్లని బట్టి, దీని భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే నార్త్ లో ఈ సినిమాకి నాల్గో రోజు వసూళ్లు పెరిగాయట. ఇది పాజిటివ్‌ టర్న్ గా చెప్పొచ్చు. మరి ఇది ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

44
పెద్ది ఓవర్సీస్‌ వసూళ్లు
Image Credit : X/@vriddhicinemas

పెద్ది ఓవర్సీస్‌ వసూళ్లు

ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీకి  గట్టిగానే వసూలు చేసింది. నార్త్ అమెరికాలోనే 2.8 మిలియన్ డాలర్లు దాటింది. ఓవరాల్‌గా దాదాపురూ.46కోట్ల వరకు ఓవర్సీస్‌లోనే రాబట్టిందని చెప్పొచ్చు. ఇక పెద్ది సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. ఆమె సన్నివేశాలకు సంబంధించి వివాదం స్టార్ట్ అయ్యింది. బాగా ట్రోల్‌ చేశారు. దీంతో ఆయా సీన్లని కట్‌ చేశారు. కాకపోతే ఈ వివాదం కూడా సినిమాకి ప్లస్‌ అయ్యిందని చెప్పొచ్చు. వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌, దివ్యేందు శర్మ, జాన్‌ విజయన్‌ వంటి వారు నటించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. జూన్‌ 4న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రామ్‌ చరణ్‌ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image3
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved