MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు

Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల మొదటి వారంలో విడుదలైంది. ఈ చిత్రం రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా ఇది రేర్‌ మైల్‌ స్టోన్‌ని రీచ్‌ అయ్యింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 15 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్దిలో అద్భుతమైన నటనతో ప్రశంసలందుకున్న పెద్ది
Image Credit : X/@vriddhicinemas

పెద్దిలో అద్భుతమైన నటనతో ప్రశంసలందుకున్న పెద్ది

రామ్‌ చరణ్‌ తన కెరీర్‌లో క్రీడాకారుడిగా చేసిన తొలి చిత్రం `పెద్ది`. తన ఊరు గుర్తింపు కోసం ఆట ద్వారా హీరో చేసిన పోరాటమే ఈ మూవీ. ఇందులో రామ్‌ చరణ్‌.. ఒక క్రికెటర్‌గా, ఒక కుస్తీ వీరుడిగా, మరోవైపు రన్నర్‌గా కనిపించాడు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. ఓ వైపు బాధ, మరోవైపు ఆవేదన, ఇంకోవైపు గెలవాలనే కసి ఆయనలో కనిపించాయి. హవభావాలతోనే ఎమోషన్స్ ని పలికించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వీకెండ్‌లో పుంజుకున్న పెద్ది
Image Credit : X/@vriddhicinemas

వీకెండ్‌లో పుంజుకున్న పెద్ది

ఇదిలా ఉంటే `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. ఇక రెండో వారం కొంత డ్రాప్‌ ఉంది. సింగిల్‌ డిజిట్‌ నెంబర్లతో సత్తా చాటుతోంది. అయితే రెండో వారం వీక్‌ డేస్‌లో సినిమాకి వసూళ్లు తగ్గాయి. కానీ వీకెండ్‌లో పుంజుకోవడం విశేషం. ఇది టీమ్‌కి కొంత ఊపిరిపోసిన ఫీలింగ్‌ అని చెప్పొచ్చు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచాలను అందుకోవడం పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. కొంత డ్రై సినిమాగా నిలిచింది. ఇదే ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. హీరో పాత్రలో స్ట్రగుల్‌ ఉంది, కానీ ఎమోషన్స్ క్యారీ కాలేదని అనే టాక్‌ వినిపించింది.

Related Articles

Related image1
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Related image2
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
35
పెద్ది మూవీ 11 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@vriddhicinemas

పెద్ది మూవీ 11 రోజుల కలెక్షన్లు

అదే సమయంలో సినిమా అదిరిపోయిందని మెగా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇలాంటి మిశ్రమ స్పందనతో రన్‌ అవుతున్న `పెద్ది` సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మరి 11 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, రెండు వారాల్లో ఈ మూవీ మూడు వందల కోట్ల మైల్‌ స్టోన్‌ని దాటేసింది. ఇప్పటి వరకు దీనికి రూ.307.98(308)కోట్లు వసూలు చేసింది. ఈ శనివారానికి ఈ మూవీ రూ.8.10కోట్లు రాబడితే, ఆదివారం 9.20కోట్లు సాధించింది. ఇది కేవలం ఇండియాలో మాత్రమే. ఇది సినిమాకి పెరిగిన ఆదరణకి నిదర్శనంగా చెప్పొచ్చు.

45
పెద్దిని కలవరపెట్టే అంశం ఇదే
Image Credit : X/@vriddhicinemas

పెద్దిని కలవరపెట్టే అంశం ఇదే

`పెద్ది` మూవీకి ఇండియాలో రూ.256కోట్ల గ్రాస్‌, రూ.216కోట్ల నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో సుమారు రూ.52కోట్లు రాబట్టింది. అయితే ఓవర్సీస్‌లో భారీగా డ్రాప్‌ అయ్యింది. ఇదే టీమ్‌ని కలవరపెడుతుంది. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కావడం విశేషం. అయితే ఈ సినిమాకి 500-1000కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయని భావించారు. కానీ లాంగ్‌ రన్‌లో ఇది కనీసం రూ.400కోట్లు కూడా రీచ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం మాత్రమే ఈసినిమా ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర సినిమాలుండటంతో `పెద్ది` పూర్తి స్థాయిలో డ్రాప్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా క్లోజింగ్‌ వసూళ్లు నాలుగు వందలకు చేరితో గొప్పగా చెప్పొచ్చు.

55
పెద్ది మూవీ సక్సెస్‌ టార్గెట్ ఇదే
Image Credit : Mythri Movie Makers

పెద్ది మూవీ సక్సెస్‌ టార్గెట్ ఇదే

పెద్ది సినిమా హిట్‌ కావాలంటే సుమారు రూ.220కోట్ల షేర్‌ రావాలి. ఇప్పటి వరకు సుమారు రూ.180కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. హిట్‌ కావాలంటే ఇంకా రూ.40కోట్ల వరకు షేర్‌ రావాలి. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ పది రోజుల్లో రూ.378కోట్లు రాబట్టినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
Recommended image2
Ikka OTT Release: మళ్లీ కలిసిన 'బార్డర్' హీరోలు.. సన్నీ, అక్షయ్ 'ఇక్కా' వచ్చేది అప్పుడే!
Recommended image3
Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Related Stories
Recommended image1
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image2
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved