MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్

Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ కవల పిల్లలైన శివరామ్ కొణిదెల, అన్విరా దేవి కొణిదెలల చిరుచేతులు కనిపించేలా ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 14 2026, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి రోజు సర్ప్రైజ్ ఇచ్చిన చరణ్, ఉపాసన
Image Credit : Asianet News

పెళ్లి రోజు సర్ప్రైజ్ ఇచ్చిన చరణ్, ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న క్రేజీ కపుల్. వీరిద్దరూ జూన్ 14, 2012న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తమ పెళ్లి రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ జంట, ఈసారి తమ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వారు పంచుకున్న ఒక మధురమైన చిత్రం ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కవల పిల్లల ఫస్ట్ గ్లింప్స్
Image Credit : Asianet News

కవల పిల్లల ఫస్ట్ గ్లింప్స్

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఈ ఏడాది జనవరి 31న కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. కాగా, తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఉపాసన మొదటిసారిగా కవల పిల్లల మొదటి సంచలన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెద్ద కుమార్తె క్లింకార చేతితో పాటు, కవలలైన శివరామ్ కొణిదెల, అన్విరా దేవి కొణిదెల చిరుచేతులు కలిసి ఉన్న ఒక అందమైన హార్ట్ టచింగ్ ఫోటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోకు "హార్ట్ ఈజ్ ఫుల్" (Heart is full) అంటూ ఎంతో ఎమోషనల్ క్యాప్షన్‌ను కూడా జోడించారు.

Related Articles

Related image1
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Related image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
35
పవన్ భార్య అన్న లెజినోవా రియాక్షన్
Image Credit : others

పవన్ భార్య అన్న లెజినోవా రియాక్షన్

ఈ అపురూపమైన పోస్ట్‌పై మెగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) రియాక్షన్. అన్నా లెజినోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఉపాసన పెట్టిన ఫోటో కింద రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్‌గా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రేమపూర్వక రియాక్షన్ చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు.

45
పెద్ది గ్రాండ్ సక్సెస్
Image Credit : Asianet News

పెద్ది గ్రాండ్ సక్సెస్

రాంచరణ్ ఇటీవల కెరీర్ పరంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవలే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. అటు కెరీర్ పరంగా బ్లాక్‌బస్టర్ హిట్, ఇటు వ్యక్తిగత జీవితంలో ముగ్గురు పిల్లల తండ్రిగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్‌కు ఈ పెళ్లి రోజు నిజంగానే ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

55
అభిమానుల రియాక్షన్
Image Credit : X/Upasana

అభిమానుల రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవడు, మనవరాళ్లకు శివరామ్, అన్విరా దేవి అనే పేర్లు పెట్టడంపై ఇదివరకే ప్రశంసలు దక్కాయి. భక్తి, ధైర్యం కలగలిసిన సంప్రదాయబద్ధమైన పేర్లను చరణ్ దంపతులు ఎంచుకున్నారు. తమ ముగ్గురు బిడ్డల చేతులు ఒకరినొకరు తాకుతూ ఉన్న ఈ అద్భుతమైన దృశ్యం కేవలం ఒక ఫోటో మాత్రమే కాదని, మెగా లెగసీకి ఇది నిదర్శనమని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అన్న, వదిన’ అంటూ నెటిజన్లు ఈ జంటపై ఆశీస్సులు, ప్రేమాభిమానాలను కురిపిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Recommended image2
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Recommended image3
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Related Stories
Recommended image1
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Recommended image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved