MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్

Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్

సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు అద్భుతమైన పాత్రల్లో నటించారు. లెజెండ్ నుంచి శ్రీమంతుడు వరకు జగ్గూ భాయ్ పోషించిన టాప్ 5 పాత్రల గురించి, పెద్దిలో అప్పలసూరి పాత్ర గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 27 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jagapathi Babu
Image Credit : Asianet News

Jagapathi Babu

ఒకప్పుడు జగపతిబాబు ఫ్యామిలీ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే సినిమాలు చేశారు. శుభాకాంక్షలు, శుభలగ్నం, మావి చిగురు, హనుమాన్ జంక్షన్, పెళ్లి పందిరి లాంటి అద్భుతమైన చిత్రాలు జగపతిబాబు కెరీర్ లో ఉన్నాయి. అయితే లెజెండ్ మూవీనుంచి జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ప్రారంభించారు. ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. లెజెండ్ మూవీ సూపర్ హిట్ కావడంతో జగపతి బాబుకి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు నుంచి వచ్చిన టాప్ 5 క్రేజీ సినిమాలు, పవర్ ఫుల్ పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
లెజెండ్ - జితేంద్ర
Image Credit : Asianet News

లెజెండ్ - జితేంద్ర

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ కి ప్రాణం పోసిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో జగపతి బాబు గారు చూపించిన క్రూరత్వం, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లుక్ టాలీవుడ్‌ను షేక్ చేసింది. బాలకృష్ణ లాంటి పవర్‌ఫుల్ హీరోకి దీటైన విలనిజం పండించారు.

37
నాన్నకు ప్రేమతో - కృష్ణమూర్తి
Image Credit : Asianet News

నాన్నకు ప్రేమతో - కృష్ణమూర్తి

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జగపతి బాబు మైండ్ గేమ్స్ ఆడే ఒక కార్పొరేట్ విలన్ (కృష్ణమూర్తి) గా కనిపించారు. లౌక్యం, ఇంటెలిజెన్స్, లోపల ఎంత కుతంత్రం ఉన్నా పైకి నవ్వుతూ కనిపించే ఒక స్టైలిష్ విలనిజాన్ని ఆయన ఈ సినిమాలో అద్భుతంగా పండించారు.

47
రంగస్థలం - ఫణీంద్ర భూపతి
Image Credit : Asianet News

రంగస్థలం - ఫణీంద్ర భూపతి

జగపతిబాబు విలక్షణ నటనకు అద్దం పట్టిన చిత్రం రంగస్థలం. జగపతి బాబు ఇలా కూడా నటించగలరు అని ఎవ్వరూ ఊహించలేదు. ఊరి ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతిగా ఆయన చూపించిన గాంభీర్యం, క్రూరత్వం అంతా ఇంతా కాదు. అగ్రవర్ణ అహంకారం, నోట మాట రాకుండా కళ్ళతోనే ఊరిని శాసించే పాత్రలో ఆయన జీవించేశారు.

57
అరవింద సమేత వీర రాఘవ - బసి రెడ్డి
Image Credit : Asianet News

అరవింద సమేత వీర రాఘవ - బసి రెడ్డి

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో 'బసి రెడ్డి' పాత్ర జగపతి బాబు గారిలోని రౌద్ర రసాన్ని పీక్స్‌లో చూపించింది. పగే పరమావధిగా బతికే ఫ్యాక్షన్ లీడర్‌గా ఆయన లుక్, వాయిస్ బేస్, నటన థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఎన్టీఆర్‌తో వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.

67
శ్రీమంతుడు - రవికాంత్
Image Credit : Asianet News

శ్రీమంతుడు - రవికాంత్

కేవలం విలన్ పాత్రలే కాదు, క్లాస్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా తనే చేయగలనని మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాతో ప్రూవ్ చేశారు. కోటీశ్వరుడైన తండ్రిగా, కొడుకు ఆశయాలను అర్థం చేసుకోలేక మొదట బాధపడి, తర్వాత అతన్ని చూసి గర్వపడే తండ్రి పాత్రలో చాలా సెటిల్డ్ అండ్ డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

77
పెద్ది - అప్పలసూరి
Image Credit : Asianet News

పెద్ది - అప్పలసూరి

పైవన్నీ జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ 5 పాత్రలుగా నిలిచాయి. రాంచరణ్ పెద్ది చిత్రంలో జగపతి బాబు అప్పలసూరి అనే పాత్రలో నటించారు. ఈ పాత్ర తప్పకుండా తన కెరీర్ లో నెంబర్ 1 రోల్ అవుతుంది అని జగ్గూభాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పలసూరి పాత్ర గురించి చాలా క్రేజీ విషయాలు వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు ఫణీంద్ర భూపతి, బసి రెడ్డి లాంటి పాత్రలు అప్పలసూరి ముందు జుజుబీ అనే టాక్ వినిపిస్తోంది. పెద్ది చిత్రం జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved