MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Donga Naa Koduku 4 Days Collections: దొంగ నా కొడుకు 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీసు వద్ద మౌళి ర్యాంపేజ్‌

Donga Naa Koduku 4 Days Collections: దొంగ నా కొడుకు 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీసు వద్ద మౌళి ర్యాంపేజ్‌

యంగ్‌ హీరో మౌళి లేటెస్ట్ గా `దొంగ నా కొడుకు` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి ఫెయిల్యూర్‌ టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. 4 రోజుల్లో ఎంత చేసిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 17 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దొంగ నా కొడుకు మూవీకి నెగటివ్‌ టాక్‌
Image Credit : X/@Mouli_Talks

దొంగ నా కొడుకు మూవీకి నెగటివ్‌ టాక్‌

మౌళి `90 ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌`, `లిటిల్‌ హార్ట్స్`తో ఆకట్టుకున్నాడు. `లిటిల్‌ హార్ట్స్`తో థియేట్రికల్‌గా పెద్ద హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు `దొంగ నా కొడుకు` అనే వెరైటీ టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం గత శుక్రవారం(నవంబర్‌ 13న)విడుదలైంది. ఇందులో సుష్మిత శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్‌, ప్రియా కీలక పాత్రలు పోషించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరించారు. క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కామెడీ ఆశించిన స్థాయిలో లేదని, ఇరికించినట్టుగా ఉందనే టాక్‌ వినిపించింది. కానీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దొంగ నా కొడుకు కలెక్షన్లు
Image Credit : X/@Mouli_Talks

దొంగ నా కొడుకు కలెక్షన్లు

`దొంగ నా కొడుకు` కలెక్షన్లు చూస్తే మాత్రం షాకిస్తోంది. ఈ చిత్రానికి నాల్గో రోజు రూ.78లక్షల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో నాలుగు రోజుల్లో రూ.7.60కోట్ల గ్రాస్‌, రూ.6.58కోట్ల నెట్‌ వచ్చిందని సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. ఓవర్సీస్‌ కలెక్షన్ల వివరాలు తెలపలేదు. ఇతర స్టేట్స్, ఓవర్సీస్‌ కలెక్షన్లు కలుపుకొని ఇది సుమారు పది కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ఈ రేంజ్‌ వసూళ్లు రావడం విశేషమని చెప్పాలి. ఇది పూర్తిగా మౌళి క్రేజ్‌ వల్లే సాధ్యమని చెప్పొచ్చు.

33
లాభాల్లోకి దొంగ నా కొడుకు?
Image Credit : X/@Mouli_Talks

లాభాల్లోకి దొంగ నా కొడుకు?

`దొంగ నా కొడుకు` మూవీకి అయిన బడ్జెట్‌ మూడు కోట్లు. ప్రమోషన్స్ కోటిన్నర. మౌళి పారితోషికం కోటి రూపాయలు. మొత్తంగా ఐదున్నర కోట్ల వరకు అయ్యిందని చెప్పొచ్చు. అయితే సినిమాకి 8 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యిందట. అంటే బాక్సాఫీసు వద్ద సినిమా హిట్‌ కావాలంటే సుమారు రూ.16కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పుడు పది కోట్లు వచ్చింది. ఇంకా ఆరుకోట్ల గ్రాస్‌, మూడు కోట్ల షేర్‌ రావాలని సమాచారం. అయితే మూడు రోజుల్లోనే ఇది పది కోట్లు వసూలు చేసిందని, సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని చిత్ర బృందం చెబుతోంది. మరి ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana 12 Days Collections: భారీగా పడిపోయిన రామాయణం కలెక్షన్లు.. బాహుబలి 2ని కొట్టడం కష్టమేనా?
Recommended image2
Top 10 Female Stars: ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆసియా టాప్ 10 మహిళా సెలబ్రిటీలు, ఇండియాదే హవా
Recommended image3
Chiranjeevi: చిరంజీవి, విజయశాంతి పోటాపోటీగా నటించిన టాప్ 7 మూవీస్.. అన్ని ఇండస్ట్రీ హిట్లు ఎలా సాధ్యం ?
Related Stories
Recommended image1
Mirnalini Ravi Wedding: లంకావి దీవిలో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్ లవ్‌ మ్యారేజ్‌.. పెళ్లికొడుకు ఎవరంటే?
Recommended image2
Ramayana 12 Days Collections: భారీగా పడిపోయిన రామాయణం కలెక్షన్లు.. బాహుబలి 2ని కొట్టడం కష్టమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved