- Home
- Entertainment
- Ramayana 12 Days Collections: భారీగా పడిపోయిన రామాయణం కలెక్షన్లు.. బాహుబలి 2ని కొట్టడం కష్టమేనా?
Ramayana 12 Days Collections: భారీగా పడిపోయిన రామాయణం కలెక్షన్లు.. బాహుబలి 2ని కొట్టడం కష్టమేనా?
Ramayana 12 Days Collections: యష్, సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన `రామాయణం` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చచేస్తూ వస్తోంది. కానీ సోమవారం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా పడిపోయింది.

సోమవారం పడిపోయిన రామాయణం కలెక్షన్లు
రామాయణం ఆధారంగా చేసుకొని బాలీవుడ్లో `రామాయణం` అనే చిత్రం రూపొందింది. నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్, మండోదరిగా కాజల్, సూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. దాదాపు 4వేల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా దీన్ని రూపొందించారు. మొదటి భాగం నవంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం దుమ్ములేపుతూ వచ్చింది. మొదటి రోజు కంటే మిగిలిన రోజులు ఎక్కువ వసూళ్లని సాధించింది. ఆదివారం వరకు బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా ఉన్న ఈ మూవీ ఇప్పుడు సోమవారం మాత్రం భారీగా పడిపోయింది. ఏకంగా 57శాతం పడిపోవడం షాకిస్తోంది.
రామాయణం కలెక్షన్లు
ఇక సోమవారం(12వ రోజు) కలెక్షన్లు చూస్తే, ఇది ఇండియాలో రూ.38.25కోట్ల గ్రాస్, రూ.32కోట్ల నెట్ వసూళ్లని సాధించింది. ఓవర్సీస్లో పది కోట్లు వచ్చాయి. అదే 11వ రోజు ఇండియాలో ఇది రూ.89.50కోట్లు రాబట్టింది. దానితో పోల్చితే సగానికిపైగా పడిపోయింది. ఇదే ఇప్పుడు షాకిస్తోంది. ఒకేసారి ఈ స్థాయిలో పడిపోవడం చిత్ర వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీ టార్గెట్ చాలా పెద్దది. కానీ ఇప్పుడు సగంలో ఆగిపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవరాల్‌గా ఈ మూవీ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.1435.25కోట్లు రాబట్టింది. ఇది మామూలు విషయం కాదు. అయితే ఈ మూవీ హిట్ కేటగిరిలోకి వెళ్లాలంటే, బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.2500కోట్లు వసూలు చేయాలి. ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
బాహుబలి 2ని దాటుతుందా? తెలుగు కలెక్షన్లు
ప్రస్తుతం తగ్గిన కలెక్షన్లని బట్టి చూస్తే, ఇది కనీసం `బాహుబలి 2`ని దాటుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ముందు `బాహుబలి 2`, `పుష్ప 2`, `ధురంధర్ 2`, ఫైనల్‌గా `దంగల్` సినిమాలున్నాయి. వీటిలో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందనేది చూడాలి.
ఇక `రామాయణం` తెలుగు కలెక్షన్లు చూస్తే, 12వ రోజు కోటిన్నర మాత్రమే రాబట్టింది. తెలుగులో ఇప్పటి వరకు రూ.73.40కోట్లు సాధించింది. దిల్‌రాజుకి మంచి లాభాలను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇది ఇండియాలో రూ.947.25కోట్ల గ్రాస్, 792.60కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది.









