రివేంజ్ స్టోరీతో పాయల్ రాజ్‌పుత్.. ఇండియన్ సినిమా షేక్ అయ్యే మ్యాటర్
`ఆర్‌ఎక్స్ 100` సినిమాతో పాపులర్ అయిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరో బలమైన సబ్జెక్ట్ తో వస్తుంది. `వెంకటలచ్చిమి`గా అలరించేందుకు రాబోతుంది.

`ఆర్ఎక్స్ 100` సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్. కుర్రకారు గుండెల్లో నిలచిపోయింది. ఆ మూవీతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది, డ్రీమ్ గర్ల్ గా మారింది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. వరుస పరాజయాల అనంతరం ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. `వెంకటలచ్చిమి` అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీతో ఆమె ఆరు భాషల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
పాయల్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ, `వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం` అని తెలిపారు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, `మంగళవారం` సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉందని చెప్పింది పాయల్.
యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
read more:రాజమౌళి క్లీయర్‌గా చెప్పేశాడు, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రియాంక చోప్రానే
also read: జాన్వీ కపూర్ ముగ్గురు పిల్లల ఫాంటసీ, భర్తకి ఆయిల్ మసాజ్ చేస్తూ గోవింద నామస్మరణం