రాజమౌళి క్లీయర్‌గా చెప్పేశాడు, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రియాంక చోప్రానే
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలుగు సినిమాలో ఫైనల్ అయినట్టే. రాజమౌళి క్లీయర్‌గా ఆమెకి చెప్పేశాడట. కానీ ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమెనే అని టాక్.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయాల్సిన `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపిక జరుగుతుందట. హీరోయిన్ ఎంపికకి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి.
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని ఎంపిక చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అలా న్యూస్ బయటకు వచ్చిందో లేదు, ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్‌లో వాలిపోయింది.
ఇటీవల చిలుకూరి బాలాజీ టెంపుల్‌ని సందర్శించింది ప్రియాంక చోప్రా. అలాగే రామ్ చరణ్ అత్తగారి ఊరిలోనూ సందడి చేసింది. ఇప్పుడు ఆమె మన తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టడం వెనక రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ ఉందనేది అందరికి అర్థమయ్యే విషయమే.
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి, ప్రియాంక చోప్రాకి సంబంధించి ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. `ఎస్‌ఎస్‌ఎంబీ29`కి సంబంధించిన లుక్ టెస్ట్ జరిగిందట. ఇందులో ఎలా కనిపించాలనేదానిపై ప్రియాంక చోప్రాని టెస్ట్ చేశారట రాజమౌళి.
అయితే డిఫరెంట్స్ లుక్స్ ట్రై చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రియాంక చోప్రాని ఫైనల్ చేశారట రాజమౌళి. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. బల్క్ డేట్స్ అవసరం ఉంటుందన్నారట. రాజమౌళి వైపు నుంచి క్లీయర్‌గా చెప్పేశాడు.
సినిమాకి చాలా బల్క్ డేట్స్ కావాలి, మధ్యలో ఇబ్బంది రాకూడదని. ఒక్క సారి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాక అప్పటి వరకు మరో సినిమా చేయడానికి లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దానికి ఓకే అయితే ఈ మూవీలో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది.
ఇదే విషయం ప్రియాంక చోప్రాకి చెప్పాడట జక్కన్న. దీనిపై ఆమె నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజమౌళి సినిమాలో పాత్ర అంటే ఎవరూ నో చెప్పరు. పైగా హీరోయిన్ రోల్ అంటే కచ్చితంగా ఆ పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. హీరో పాత్రకి సమానంగా ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోరు. మరి ప్రియాంక మిస్ చేసుకుంటుందా? ఓకే చెబుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఆమె హాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రాజమౌళి, మహేష్ సినిమా కోసం ఆ ఆఫర్స్ ని వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆమె సిద్ధమేనా? అనేది సస్పెన్స్. అన్నింటికి సిద్దమై ఆమె వచ్చినట్టు సమాచారం. ఇదే జరిగితే, ఆల్మోస్ట్ ప్రియాంక మహేష్ సరసన హీరోయిన్‌గా ఫైనల్ అయినట్టే అని తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
read more: జాన్వీ కపూర్ ముగ్గురు పిల్లల ఫాంటసీ, భర్తకి ఆయిల్ మసాజ్ చేస్తూ గోవింద నామస్మరణం
also read: `స్పిరిట్` స్టోరీ బ్యాక్ డ్రాప్ లీక్.. ప్రభాస్ చేయబోయే ఫైట్ దానిపైనే ?