MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుకు చేతబడి చేశారా ? ఎస్పీబీ కి నరకం చూపించిన పాట ఏదో తెలుసా?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుకు చేతబడి చేశారా ? ఎస్పీబీ కి నరకం చూపించిన పాట ఏదో తెలుసా?

దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుకు చేతబడి చేశారా? స్టార్ సింగర్ గొంతుకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఇంట్లో వాళ్లు ఎందుకు అనుమానించారు? ఎస్పీబీకి నరకం చూపించిన పాట ఏది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 18 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రికార్డులు బ్రేక్ చేసిన స్టార్ సింగర్..
Image Credit : facebook.com/SPB

రికార్డులు బ్రేక్ చేసిన స్టార్ సింగర్..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార.. ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజ్ ను క్రియేట్ చేసుకున్న సింగర్. తన గొంతుతో ఎన్నో అద్భుతాలు చేసిన గాయకుడు. దాదాపు10 భాషల్లో.. 45 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడు. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, ఇండస్ట్రీలు బాలు మావాడంటే.. మా వాడంటూ పోటీ పడుతుంటాయి. మలయాళంతో పాటు.. హిందీలో కూడా వందల, వేల పాటలు పాడిన అమరగాయకుడు.. నేడు మన మధ్య లేకున్నా.. పాట రూపంలో ప్రతీ ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎస్పీ బాలు మల్టీ టాలెంట్..
Image Credit : facebook.com/SPB

ఎస్పీ బాలు మల్టీ టాలెంట్..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడు మాత్రమే కాదు..మల్టీ టాలెంటెడ్ స్టార్. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, నటుడిగా, నిర్మాతగా, హోస్ట్ గా, ఎన్నో రకాలుగా ఆయన ఇండస్ట్రీకి సేవలందించారు. 70 ఏళ్లు దాటినా.. ఏమాత్రం చెక్కు చెదరని గాత్రంతో .. పాటలు పాడుతూ వచ్చిన బాలునీ.. కరోనా మహమ్మారి బలితీసుకుంది. 2020 లో కరోనా కారణంగా బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బాలు మరణించినా.. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు మాత్రం ఈ కాలంలో ఎవరు బ్రేక్ చేయలేరనే చెప్పాలి.

36
బాలసుబ్రహ్మణ్యం కి నరకం చూపించిన పాట..
Image Credit : facebook.com/SPB

బాలసుబ్రహ్మణ్యం కి నరకం చూపించిన పాట..

సాఫీగా సాగిపోయిన బాలు కెరీర్ లో .. ఓ ఇబ్బందికరపరిస్థితి వచ్చింది. గీతాంజలీ సినిమా టైమ్ లో బాలు గొంతు మారిపోయింది. గీతాంజలి తమిళం, మలయాళం డబ్బింగ్, సింగింగ్ టైమ్ లో బాలుకి సమస్య ఏర్పడింది. ఓ పాపా లాలి పాట పాడుతుండగా.. మెలోడీ సాంగ్ మధ్యలో జీరపడటంతో.. సాంగ్ పాడలేకపోయారు బాలసుబ్రహ్మణ్యం. ఆ ఒక్క పాట తన కెరీర్ లో నరకం అంటే ఏంటో చూపించిందని బాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

46
బాలు గొంతుకు ఏమయ్యింది..?
Image Credit : facebook

బాలు గొంతుకు ఏమయ్యింది..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో గొంతు సమస్యతో బాధపడ్డారు. ఒకదశలో ఆయన పాటులు పాడగలనా లేదా అనే సందేహంతో భయపడ్డారు. బాలు గొంతులో చిన్న మొటిమ లాంటిది రావడంతో.. పాటులు పాడే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతో మెలోడియస్ గా ఉండే బాలు స్వరంలో.. అప్పుడప్పుడు జీరపోవడం, ఇబ్బందిపెట్టడం లాంటివి జరిగేవి. దాంతో ఎంతో సాహసం చేసి.. ఆయన గొంతుకు ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకున్నారు.

56
ఎస్పీబి ఫ్యామిలీలో అనుమానాలు?
Image Credit : our own

ఎస్పీబి ఫ్యామిలీలో అనుమానాలు?

ఎస్పీబీ గొంతుకి ఆపరేషన్ చేయిస్తే.. పాడగలడో లేదో తెలియదు. డాక్టర్లు మాత్రం నమ్మకం ఇవ్వడంలేదు. ఉన్న గొంతు కూడా పాడటానికి వీలు లేకుండా అయిపోతే ఎలా? బాలు బాధను చూసి.. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు. ఆయన గొంతుకు ఎవరో ఏదో చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేయడంతో పాటు.. చేతబడి లాంటివి చేయించారేమో అని అనుమానంతో పూజలు.. హోమాలు, వ్రతాలు కూడా చేయించారట. ఈ విషయాన్ని స్వయంగా బాలు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. కానీ ఆయన ఇవన్నీ నమ్మలేదు. ఏది ఏమైన ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

66
బాలుకి లతా మంగేష్కర్.. ఇచ్చిన సలహా ఏంటి?
Image Credit : Getty

బాలుకి లతా మంగేష్కర్.. ఇచ్చిన సలహా ఏంటి?

బాలసుబ్రహ్మణ్యం ఆపరేషన్ చేయించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చాలా మంది ఆయనకు సలహాలు ఇస్తూ వచ్చారు. ఇండియన్ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కూడా.. బాలుకి ఫోన్ చేసి.. '' నిజమేనా.. సర్జరీకి వెళ్తున్నావట.. వద్దు అలా చేయొద్దు.. ఉన్న గొంతు పోగోట్టుకోవద్దు '' అని సలహా ఇచ్చారట. కానీ బాలు మాత్రం ఆపరేషన్ చేయించుకుని.. సాహసం చేశారు. తన గొంతుని మళ్లీ కాపాడుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Recommended image2
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
Recommended image3
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Related Stories
Recommended image1
రామ్ చరణ్ పెద్ది సినిమాను మిస్ అయిన ముగ్గరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved