డాక్టర్ గా, మోడల్ గా రాణించిన పవన్ హీరోయిన్.. పర్సనల్ లైఫ్ లో కన్నీటి కష్టాలు, వదిలేసి వెళ్లిపోయిన భర్త
తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ మరుసటి ఏడాది పవన్ మరో హిట్ కొట్టారు. తొలిప్రేమ చిత్రంతో యువతలో పవన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని మరింతగా పెంచిన చిత్రం తమ్ముడు.
తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ మరుసటి ఏడాది పవన్ మరో హిట్ కొట్టారు. తొలిప్రేమ చిత్రంతో యువతలో పవన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని మరింతగా పెంచిన చిత్రం తమ్ముడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ అందరికీ ఈ చిత్రంతో తెలిశాయి. ఈ చిత్రంలో ప్రీతీ జింగానియా హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా అదితి గోవిత్రికర్ నటించారు.
అదితి గోవిత్రికర్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఇదే.. చివరి చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత ఆమె హిందీలో కొన్ని చిత్రాల్లో నటించారు కానీ తెలుగులో మళ్ళీ కనిపించలేదు. అదితి గోవిత్రికర్ మల్టీట్యాలెంటెడ్ పర్సన్. ఆమె చాలా ఘనతలు సాధించింది. అదితి గోవిత్రికర్ డాక్టర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 1997లో ఆమె ఎంబిబిఎస్ పూర్తి చేసింది. డాక్టర్ వృత్తిలో కొసాగుతూ మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. మోడలింగ్ చేస్తున్న సమయంలో ఆమెకి తమ్ముడు చిత్రంలో నటించే ఛాన్స్ వచింది.
ఆ విధంగా పవన్ కళ్యాణ్ సరసన ఆమె తమ్ముడు చిత్రంలో నటించారు. ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడే ఆమె తన సీనియర్ ముఫ్ఫాజల్ ని ప్రేమించింది. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత పెద్దలని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మతపరమైన కారణాల వల్ల అదితి కుటుంబ సభ్యులు ముఫ్ఫాజల్ తో పెళ్ళికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఆమె ముఫ్ఫాజల్ ని 1998లో పెళ్లి చేసుకుంది.
(Courtesy: Instagram)అదితి గోవిత్రికర్ బుల్లి తెరపై కూడా మెరిసింది.
ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. తన భర్త కోసం ఆమె ముస్లిం గా కన్వెర్ట్ అయింది. తన పేరుని కూడా సారా అని మార్చుకుంది. వీరికి ఒక కూతురు, కుమార్తె సంతానం జన్మించారు. పెళ్లి తర్వాత కూడా అదితి మోడలింగ్, డాక్టర్ వృత్తిని కొనసాగించింది. అయితే పిల్లలు పుట్టాక వీరి దాంపత్య జీవితంలో విభేదాలు మొదలయ్యాయి. ఇగో క్లాష్ లు తలెత్తినట్లు సన్నిహితులు చెబుతారు. ఈ విభేదాలు తారా స్థాయికి చేరడంతో ఆమె భర్త ముఫ్ఫాజల్ విడాకులు ఇచ్చి.. భార్య పిల్లలని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు.
భర్త కోసం తాను ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ తన వైవాహిక జీవితం ఇలా అయింది అని ఆమె కుమిలిపోయింది. పిల్లల కోసం మనో ధైర్యం తెచ్చుకుంది తిరిగి డాక్టర్ వృత్తి ప్రారంభించింది. పిల్లలని సొంతంగా పెంచుతోంది. 2001లో అదితి మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ అదితి గోవిత్రికర్.