హరీష్ శంకర్‌కి పవన్ చురకలు.. డేట్స్ ఇస్తే కథ కూడా రెడీ చేయలే, `హరిహర వీరమల్లు`,`ఓజీ` రిలీజ్‌పై క్లారిటీ
పవన్ కళ్యాణ్ తాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి తన సినిమాలపై స్పందించారు. `హరిహర వీరమల్లు`, `ఓజీ` చిత్రాల అప్ డేట్ ఇచ్చారు. హరీష్ శంకర్‌కి చురకలు అంటిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలు చేయాల్సి ఉంది. ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సినిమాలు ఇవి. ఈ మూడు షూటింగ్‌లు పూర్తి చేసుకుని ఎన్నికల్లోకి వెళ్లాలనుకున్నారు పవన్. కానీ కుదరలేదు. మూడు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు అడపాదడపా తనకు టైమ్ దొరికినదాన్ని బట్టి షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు పవన్.
కానీ ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? ఏ సినిమా ముందు పూర్తవుతుంది. ఏది ముందు రిలీజ్ అవుతుంది. మూడు సినిమాలు వస్తాయా? ఆగిపోతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైమ్ తన సినిమాలపై స్పందించారు పవన్ కళ్యాణ్. సినిమాలు ఎందుకు డిలే అవుతున్నాయి? ఎప్పుడు వస్తాయనేది ఆయన వెల్లడించారు. క్లారిటీ ఇచ్చారు. తాను మూడు సినిమాలకు డేట్స్ ఇచ్చినట్టు చెప్పారు, కానీ ఇచ్చిన డేట్స్ కి సినిమాలు చేయలేకపోయారని, అది దర్శక, నిర్మాతలదే తప్పు అని వెల్లడించారు. డేట్స్ ఇచ్చినా చేయలేకపోయారని చెప్పారు పవన్.
సినిమాలు ఒప్పుకోవడానికి ముందే తాను స్పష్టంగా చెప్పాడట. తనకు ఇంత వరకు టైమ్ ఉంటుంది? ఈ లోపు సినిమాలు కంప్లీట్ చేసుకోవాలని చెప్పాడట. అనుకున్నదానికంటే ఎక్కువ డేట్స్ లో షూటింగ్‌లో పాల్గొన్నాడట, అయినా కంప్లీట్ కాలేదన్నారు. `ఉస్తాద్ భగత్ సింగ్` ఇంకా స్క్రిప్ట్ రెడీ చేసుకోలేదని దర్శకుడు హరీష్ శంకర్‌కి చురకలు అంటించారు పవన్. ముందు అనుకున్న కథనే మళ్లీ తీసుకున్నారు అని వెల్లడించారు. స్క్రిప్ట్ ఫైనల్ చేయడంలోనే డిలే అయ్యిందని ఆయన వెల్లడించారు.
also read: చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా తప్పుకోవడానికి కారణం ఏంటి? సీనియర్ నటుడు చెప్పిన పచ్చి నిజాలు
`ఓజీ` సినిమా కూడా తన ఒత్తిడి వల్లే ఫాస్ట్ గా అయ్యిందని, అయితే తాను లేని సీన్లని షూట్ చేయాలని చెప్పాడట. అలా మేజర్ పార్ట్ ని పూర్తి చేశారని తెలిపారు. ఆ తర్వాత తనపై సీన్లు తీసి అందులో కలపొచ్చు అని తెలిపారట. ఈ మూవీ షూటింగ్‌లో తాను పాల్గొనాల్సి ఉందని తెలిపారు. ఇది 1970-80 బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ అని, ముంబయి బేస్డ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్(ఓజీ) ప్రధానంగా సాగుతుందన్నారు పవన్.
ఇక `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యిందని, మరో 8,9 రోజుల షూటింగ్‌లో పాల్గొంటే సినిమా కంప్లీట్ అవుతుందన్నారు. ఇది విజువల్ ప్రయారిటీ ఉన్న చిత్రమని, చాలా గ్రాండియర్‌గా ఉంటుందన్నారు. ఇదే మొదటగా రిలీజ్ అవుతుందన్నారు పవన్.
వీటిని తాను కంప్లీట్ చేస్తానని తెలిపారు. కాకపోతే టైమ్ పడుతుందనేది వెల్లడించారు. అయితే ఇప్పుడు అసలు సమస్య `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా ఉంటుందా? లేదా? అనేది. పవన్ క్లారిటీగా వాళ్లే రెడీగా లేరని తెలిపారు. మరి హరీష్ రెడీగా ఉన్నాడా? కథ రెడీగా ఉందా? అనేది పెద్ద ప్రశ్న.