టికెట్ రేట్లు పెంచడం వల్లే రికార్డులు బ్రేక్.. `పుష్ప 2` కలెక్షన్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సంచలన విజయం సాధించింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ క్రమంలో దీనిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా ఆయన ఎట్టకేలకు ఈ విషయంపై తన అభిప్రాయం వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ఇష్యూని అడ్రెస్ చేశారు. అల్లు అర్జున్‌ని సపోర్ట్ గా ఆయన మాట్లాడటం విశేషం.
అదే సమయంలో సీఎంగా రేవంత్ రెడ్డి చేసింది కూడా కరెక్టే అని, ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారని, ఆ పొజీషియన్ రెండు వైపు పదును ఉన్న కత్తిలాంటిది అన్నారు పవన్. పేరు మర్చిపోవడం వల్లే ఇలా చేశారనేది నిజం కాదు, దాన్ని దాటి వచ్చారు ఆయన, అలా చిన్నగా ఎవరూ ఆలోచించరు అని తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలో అల్లు అర్జున్ టీమ్‌కి చురకలు అంటించారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బాధిత ఫ్యామిలీని పరామర్శించి భరోసా ఇవ్వాల్సింది, వారి పెయిన్‌ని షేర్ చేసుకోవాల్సింది. గోరుతో పోయేది గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అని తెలిపారు. అల్లు అర్జున్ కాకపోయిన టీమ్ అయినా, నిర్మాతలైనా ఆ ఫ్యామిలీని కలిసి ఆదుకుంటామని సానుభూతి తెలిపితే బాగుండేదన్నారు. ఈ ఘటనపై అందరు బాధ్యులే అని, ఎవరినీ తప్పుపట్టడానికి లేదు అని, కానీ అల్లు అర్జున్ ని ఒంటరి చేశారని తెలిపారు.
రేవంత్ రెడ్డి సర్కార్ కూడా `పుష్ప 2` సినిమాకి ఎంతో చేసిందని, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చారు, హైయ్యెస్ట్ టికెట్ రేట్లు పెంచారని తెలిపారు. `పుష్ప 2` సినిమా కలెక్షన్లలో రికార్డులు బ్రేక్ చేస్తుందని ఓ రిపోర్టర్ చెప్పినప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్లే సాధ్యమైందని, టికెట్ రేట్లు పెంచితేనే రికార్డులు బ్రేక్ అవుతాయని, పెంచకపోతే అన్ని కలెక్షన్లు ఎలా వస్తాయని తెలిపారు. జరిగిన ఘటనని మానవతాదృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని, ఆ లోటు కనిపిస్తుందన్నారు పవన్.
రేవంత్ రెడ్డ కూడా చిన్న స్థాయి నుంచే వచ్చారు. ఆయనకు అన్నీ తెలుసు. రామ్ చరణ్, బన్నీ వంటి వారంతా జూబ్లీహిల్స్ లో తిరిగే క్రమంలో వాళ్లకి రేవంత్ రెడ్డి ఒక సూపర్ సీనియర్‌లా ఉండేవారంటూ ఛలోక్తులు విసిరారు. ఒక్కసారి కేసు అయ్యాక, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చాక దాన్ని అదే రూట్‌లోనే డీల్ చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన తాను కేసుని డీల్ చేయలేమని, కేసుని క్లోజ్ చేయడం కుదరదు అని తెలిపారు పవన్. అల్లు అర్జున్ కేసు కూడా లీగల్‌గానే పరిష్కరించుకోవాలనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. మరోవైపు తాను నటించాల్సిన సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. ఫ్రీ టైమ్‌లో ఆయన షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం `హరిహర వీరమల్లు` సినిమా చిత్రీకరణ దశలో ఉంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఔరంగా జేబుకి వ్యతిరేకంగా పోరాడని బందిపోటు వీరమల్లు పాత్ర ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుంది. కొహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. దీంతోపాటు `ఓజీ` చిత్రంలో నటించాల్సి ఉంది పవన్. `హరి హర వీరమల్లు` సినిమా షూటింగ్ పూర్తయ్యాక `ఓజీ`లో పాల్గొనే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప 2` చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. 4న బెనిఫిట్ షోస్ ప్రదర్శించారు. ఆడియెన్స్ మధ్య సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కి వెళ్లారు అల్లు అర్జున్. భారీగా ఫ్యాన్స్ తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది.
శ్రీతేజ గాయలపాలయ్యారు. ఈ కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనిపైనే పవన్ తాజాగా స్పందించారు. అయితే `పుష్ప 2` సినిమా మాత్రం భారీగా వసూళ్లని రాబడుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.1700కోట్లు దాటింది. కలెక్షన్ల సరికొత్త రికార్డులు క్రియేట్
also read: ‘ఓజీ’: అవి బెదిరింపుల్లా ఉన్నాయంటూ పవన్ కామెంట్
read more: వెంకటేష్ హీరో కాకపోతే ఏం చేసేవాడో తెలుసా? వెంకీమామ అసలు డ్రీమ్ ఇదే!