MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anna Lezhneva: విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ కోసం అన్నా లెజినోవా చేసిన పనికి అభిమానులు ఫిదా..

Anna Lezhneva: విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ కోసం అన్నా లెజినోవా చేసిన పనికి అభిమానులు ఫిదా..

Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విదేశాల్లో పెరిగినా మన సంప్రదాయాలు పాటిస్తూ.. మొక్కులు చెల్లించుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. రీసెంట్ గా పవన్ కోసం ఆమె ఏం చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 18 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న పవన్ సతీమణి
Image Credit : Asianet News

శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న పవన్ సతీమణి

భర్త క్షేమం, కుటుంబ సౌఖ్యం కోసం భారతీయ సంప్రదాయంలో మహిళలు చేసే పూజలు, వ్రతాలకు ఎంతో ఇంపార్టెన్స్  ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా సైతం తన భర్త ఆరోగ్యం కోసం శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అన్నా లెజ్‌నేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విఐపి సౌకర్యాలు ఉన్నా తీసుకోలేదు..
Image Credit : instagram

విఐపి సౌకర్యాలు ఉన్నా తీసుకోలేదు..

ఈ పర్యటనలో ఆమె భక్తిశ్రద్ధలు అందరినీ ఆకట్టుకున్నాయి. విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆమె సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నారు. కాలినడకన కొండపైకి చేరుకునేందుకు అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్లారు. భక్తితో, ఓపికతో మెట్లు ఎక్కుతూ శ్రీవారి చెంతకు చేరుకున్నారు. తిరుమల కొండపైకి చేరుకున్న అనంతరం, సాంప్రదాయం ప్రకారం చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆమె నేరుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ, దానిని ఆమె నిష్ఠగా పాటించారు.

Related Articles

Related image1
Uma Telugu Traveller: ఇంట్లోనే శవాలు, వాటితోనే కలిసి జీవనం, ఉమ తెలుగు ట్రావెలర్ చూపించిన వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Related image2
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?
34
కుటుంబం కోసం రెండో సారి..
Image Credit : Anna Lezhneva

కుటుంబం కోసం రెండో సారి..

అన్నా లెజ్‌నేవాకు శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో వారి కుమారుడు చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుండి వారి కుమారుడు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో కొడుకు ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా అన్నా లెజ్‌నేవా అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి, శ్రీవారికి తన తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

44
విదేశీ సంస్కృతిలో పెరిగినప్పటికీ
Image Credit : Instagram

విదేశీ సంస్కృతిలో పెరిగినప్పటికీ

విదేశీ సంస్కృతిలో పెరిగినప్పటికీ, అన్నా లెజ్‌నేవా భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, ఇక్కడి పూజా విధానాలను ఎంతగానో గౌరవిస్తారు. తాజాగా భర్త పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆమె చేసిన ఈ కాలినడక ప్రయాణం ,తిరుమల యాత్ర సోషల్ మీడియాలో , అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది. భర్తపై ఆమెకున్న ప్రేమకు, తపనకు ఈ యాత్ర నిదర్శనంగా నిలిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pavitra Lokesh: సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ఐటెం సాంగ్, అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే హీరో టార్గెట్
Recommended image2
Rakul Preet Singh: బాలీవుడ్ లో కుట్రలు ఉంటాయి, టాలీవుడ్ లో ఐక్యత ఉంటుంది.. మంటలు రేపుతున్న రకుల్ కామెంట్స్
Recommended image3
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: ఇంట్లోనే శవాలు, వాటితోనే కలిసి జీవనం, ఉమ తెలుగు ట్రావెలర్ చూపించిన వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Recommended image2
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved