MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?

హీరోలు తమ ఫిట్ నెస్ ను, గ్లామర్ ను కాపాడుకోవడం కోసం కఠినమైన నియమాలు పాటిస్తుంటారు. జిమ్ముల్లో ఎక్కువ గంటలు కష్టపడతారు. కానీ ఇవేమి లేకుండానే ఓ తెలుగు హీరో తన గ్లామర్ ను కాపాడుకుంటున్నాడు. 58 ఏళ్ల వయసులో కుర్రాడిలా మెరిసిపోతున్నాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 16 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోలకు తప్పని తిప్పలు..
Image Credit : Asianet News

హీరోలకు తప్పని తిప్పలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్క్రీన్ పై కనిపించే ప్రతీ ఒక్కడు పిట్ నెస్ , గ్లామర్ కాపాడుకోవాలని చూస్తారు. ముఖ్యంగా హీరోలు.. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నచ్చిన ఫుడ్ ను కూడా కడుపునిండా తినలేరు. ప్రతీ క్షణం తమ ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి చూస్తుంటారు. అటువంటిది 60 ఏళ్లు దగ్గర పడుతున్నా... ఇంకా కుర్రాడిలా కనిపించే ఓ తెలుగు హీరో.. లైఫ్ లోనే డైటింగ్ చేయలేదట. నచ్చిన ఫుడ్ తింటాడట. ఈ విషయాన్ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ స్వయంగా వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డైటింగ్ లేకుండానే ఫిట్ నెస్ కాపాడుకుంటున్న హీరో..
Image Credit : Actor Srikanth\Twitter

డైటింగ్ లేకుండానే ఫిట్ నెస్ కాపాడుకుంటున్న హీరో..

టాలీవుడ్‌లో ముప్పై ఏళ్లకు పైగా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న హీరోల్లో మేకా శ్రీకాంత్ ఒకరు. దాదాపు 130 కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్లామర్, ఫిట్‌నెస్ విషయంలో శ్రీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది. పరిశ్రమలో చాలామంది హీరోలు డైటింగ్స్, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటే, శ్రీకాంత్ మాత్రం ఎలాంటి డైటింగ్ చేయకుండానే తన ఫిట్‌నెస్‌ను, గ్లామర్‌ను దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఈవెంట్ లో డైరెక్టర్ వినాయక్ వెల్లడిస్తూ.. శ్రీకాంత్ ను పొగడ్తలలో ముంచెత్తాడు.

35
శ్రీకాంత్ గ్లామర్ సీక్రెట్ ఏంటంటే?
Image Credit : https://www.facebook.com/ActorSrikanthMeka

శ్రీకాంత్ గ్లామర్ సీక్రెట్ ఏంటంటే?

శ్రీకాంత్ గ్లామర్ సీక్రెట్ ఆయన జీవనశైలిలోనే ఉంది. ఆయనకు ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం అంటే ఇష్టం. బిర్యానీలు, సాంప్రదాయ వంటకాలను ఇష్టంగా తింటూనే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆయన అలవాటు. బ్యాడ్మింటన్ ఆడటం, క్రికెట్ ఆడటం ద్వారా తన శరీరానికి తగినంత శ్రమను ఇస్తారు. అందుకే 58 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ యువ హీరోలకు పోటీనిచ్చేలా ఎంతో హుందాగా, ఫిట్‌గా కనిపిస్తారు.

45
శ్రీకాంత్ మూవీ జర్నీ..
Image Credit : our own

శ్రీకాంత్ మూవీ జర్నీ..

సినిమా ప్రయాణ విషయానికి వస్తే... శ్రీకాంత్ కెరీర్ విలన్ పాత్రలతో ప్రారంభమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆపై హీరోగా మారారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఆయన్ను తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ‘తాజ్ మహల్’, ‘పెళ్ళిసందడి’, ‘వినోదం’, ‘ఆహ్వానం’ వంటి చిత్రాలు శ్రీకాంత్‌ను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి. అలాగే ‘ఖడ్గం’, ‘మహాత్మ’ వంటి సినిమాలు ఆయనలోని నటుడికి సరికొత్త గుర్తింపును తెచ్చాయి. ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ ఇప్పటికీ బిజీగా గడుపుతున్నారు.

55
వివాదాలకు దూరంగ ఉండే నటుడు..
Image Credit : Srikanth

వివాదాలకు దూరంగ ఉండే నటుడు..

శ్రీకాంత్ కేవలం స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఎంతో సాఫ్ట్ పర్సన్. తోటి నటీనటులతో, పరిశ్రమ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుంటూ పోయే తత్వం ఆయనది. ఆహార నియమాలతో శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, నచ్చింది తింటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఆయన గ్లామర్ వెనుక ఉన్న అసలు రహస్యం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీకాంత్ ఒక విలక్షణమైన, ఆదర్శవంతమైన నటుడిగా నిలిచారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Recommended image2
VR Raja: యూట్యూబర్ VR Raja నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved