నన్ను పనిచేసుకోనివ్వండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్..
సినిమాల సంగతి తరువాత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. మరి సినిమాల విషయం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. దానికి పవన్ సమాధానం ఏంటో తెలుసా..?
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం కావడంతో..ప్రభుత్వం మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నంచేస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. అంతే కాదు ఆయన పెండింగ్ లో ఉంచిన మూడు సినిమాలు కంప్లీట్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. మరి ఆయన ఎప్పుడు సినిమాల వైపు దృష్టి పెడతారో తెలియడంలేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా బాధ మాత్రం తప్పడంలేదు.
Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, డేంజర్ లో గేమ్ ఛేంజర్, రంగంలోకి మెగాస్టార్..?
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ కనిపించగానే .. జై పవర్ స్టార్ అంటూనే.. సినిమల గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడుతున్నారు. చాలా కాలంగా ఈ విషయంలో ఓపిగ్గా ఉన్న పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా ఈ విషయంలో స్పందించారు. తన దైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా విశాఖపట్నంలోని గిరిజన పల్లెల్లోకి పర్యటనకువెళ్ళారు.
Also Read: ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?
మరీ ముఖ్యంగా ఆయన అల్లుూరి జిల్లా.. పార్వతీపురంలోని బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లారు. అక్కడి రోడ్లను, అక్కడి పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడున్న కొంతమంది యువత OG అంటూ సినిమా గురించి అరిచారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇరిటేట్ అయ్యారు. అంతే కాదు వారిపై కాస్త సీరియస్ అయ్యారు. గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నన్ను పనిచేసుకోనివ్వండి. నా చుట్టు ముట్టేస్తే నేను పనిచేసుకోలేను. రోడ్లు ఎలా ఉంటాయో చూద్దామంటే మీరంతా చుట్టుముట్టేసి రోడ్లు కనపడట్లేదు. యువతకు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పుడు సినిమాల మోజులో పడి, పోస్టర్లు పెట్టి, OG OG అని, లేదా వేరే హీరోలకు జేజేలు కొడుతున్నారు. ఇవన్నీ చేయొచ్చు కానీ మీరు మీ జీవితంపై ఫోకస్ చేయకపోతే ముందుకు వెళ్ళలేరు. మాట్లాడితే అన్న మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.
నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, నేను ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు, నేను వెళ్లి సీఎం, పీఎంలను అడిగితే రోడ్లు పడతాయి. అందుకే నేను మీసాలు తిప్పడాలు, ఛాతులు కొట్టుకోడాలు చేయను. నన్ను పని చేసుకోనివ్వండి అని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దాంతో పవన్ కళ్యాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఈవిషయంలో కూడా ప్యాన్స్ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అది మా హీరో అంటే అంటూ తెగ పొగిడేస్తున్నారు. పొలిటికల్ గా చాలా స్ట్రగుల్ అయ్యారు పవన్. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ చేయాల్సినవి యూడు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో సర్ధార్ భగత్ సింగ్ తో పాటు, హరీహర వీరమల్ల సినిమాలు చాలా కాలంగా వెయింటింగ్. ఇక సుజిత్ డైరెక్షన్ లో ఒజీ మూవీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్.