MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `జాని` ఫ్లాప్‌ టాక్‌తో పవన్‌ కళ్యాణ్‌ ఇంటిమీదకొచ్చిన బయ్యర్లు, ఒంటరైపోయిన భావన.. జీవితంలో మర్చిపోలేని ఘటన

`జాని` ఫ్లాప్‌ టాక్‌తో పవన్‌ కళ్యాణ్‌ ఇంటిమీదకొచ్చిన బయ్యర్లు, ఒంటరైపోయిన భావన.. జీవితంలో మర్చిపోలేని ఘటన

పవన్‌ కళ్యాణ్‌ తాను డైరెక్ట్ చేసిన `జాని` సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను ఫేస్‌ చేసిన అనుభవాలను బయటపెట్టారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2025, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`జాని` సినిమా పరాజయంతో పవన్‌ అనుభవాలు
Image Credit : Youtube print shot/@JanaSenaParty

`జాని` సినిమా పరాజయంతో పవన్‌ అనుభవాలు

పవన్‌ కళ్యాణ్‌ తాను తీసిన `జాని` సినిమా పరాజయం చెందినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆ ఘటనతో ఒంటరైపోయినట్టు తెలిపారు. ఇక్కడ డబ్బులే పనిచేస్తాయని తెలిపారు. 

ప్రతి బంధం ఆర్థిక బంధమే అని అప్పుడు అర్థమైందని, అదే సందర్భం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎదురైందన్నారు పవన్‌. తాజాగా మంగళవారం మంగళగిరిలో ఆయన ఏపీ మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

పవన్‌ మాట్లాడుతూ, ``ఖుషి` లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత నేను (డైరెక్ట్) చేసిన `జాని` మూవీ ఆడలేదు. బాగలేదనే టాక్‌ వచ్చిన వెంటనే.. మొదటి రోజు మొదట ఆట పడగానే, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు నా ఇంటి మీదకు వచ్చారు. 

మాకు డబ్బులు రావడం లేదు. ఇప్పుడు ఏంచేస్తావని నిలదీశారు. ఆ సమయంలో నా ప్రశ్న ఏంటంటే మీకు డబ్బులు వచ్చినప్పుడు నాకు ఎక్స్ ట్రా ఏం ఇవ్వలేదు కదా అని, కానీ వారి నుంచి అలాంటిదేమీ ఉండదు. అలా అని ఇప్పుడు వారిపై కంప్లెయింట్‌ చేయడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`జాని` పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చిన పవన్
Image Credit : rotten tomatoes

`జాని` పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చిన పవన్

 నాకు అది ఫస్ట్ టైమ్‌ ఎక్స్ పీరియెన్స్. కారల్‌ మార్క్స్ చెప్పిన.. అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అనేది గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ఒంటరితనం అనుభవించాను. సినిమా ఫ్లాప్‌ అయితే బాధపడమని అంతా నాకు చెప్పినట్టుగా ఉంది. 

నా ఉద్దేశ్యమేంటంటే సినిమా చేశాం, అది బాగాలేదు, ఆడలేదు. దానికి అంతా మునిగిపోయినట్టు మొహాలంతా డల్‌గా పెట్టుకుని ఉంటే ఏం చేస్తాం. 

ఆ సమయంలో ఎంత పోయిందని లెక్క తీసి, నాకు ఇచ్చిన పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చేశాను. ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. పైగా రూ.15 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది` అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

35
2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అదే ఫీలింగ్‌
Image Credit : Youtube print shot/@JanaSenaParty

2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అదే ఫీలింగ్‌

పవన్‌ ఇంకా చెబుతూ, ``జాని` ఫెయిల్యూర్‌ నాకు ఎక్కువగా రాజకీయాల్లో హెల్ప్ చేసింది. ఆ అనుభవం నన్ను బలమైన వ్యక్తిని చేసింది. 2019లో ఓడిపోయినప్పుడు మళ్లీ అదే గుర్తుకు వచ్చింది. ఫెయిల్యూర్స్ జీవితంలో భాగమే అని అర్థమయ్యింది. 

దాన్ని తట్టుకొని నిలబడే శక్తినిచ్చింది. `హరి హర వీరమల్లు` విషయంలో ఏఎం రత్నం లాంటి పాన్‌ ఇండియా సినిమాలు చేసిన నిర్మాత ఇప్పుడు ఈ మూవీ విషయంలో రిలీజ్‌కి ఇబ్బంది పడుతుంటే చాలా బాధగా అనిపించింది. 

అందుకే దగ్గరుండి ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. మామూలుగా ఎలా ఉన్నా, డబ్బుల విషయానికి వస్తే అంతా నువ్వు ఇస్తావా? చస్తావా అనే స్థితికి దిగజారతారు. అందుకే ఈ మూవీకి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను` అని అన్నారు పవన్‌. 

45
`హరి హర వీరమల్లు` క్లైమాక్స్ అందుకే డైరెక్ట్ చేశా
Image Credit : Youtube print shot/@JanaSenaParty

`హరి హర వీరమల్లు` క్లైమాక్స్ అందుకే డైరెక్ట్ చేశా

`హరి హర వీరమల్లు` మూవీ క్లైమాక్స్ డైరెక్ట్ చేయడంపై ఆయన చెబుతూ, ఈ మూవీ బాగా చేయడానికి, క్లైమాక్స్ ని  డైరెక్ట్ చేయడానికి కారణం.. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, సరిగా చేయడేమో అనే కామెంట్లు వస్తాయి. 

అందుకే ప్రత్యేకంగా కేర్‌ తీసుకుని ఈ మూవీ చేశాను. సినిమా క్లైమాక్స్ నా హృదయానికి చాలా దగ్గరయ్యింది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నా, హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలని, ఆ బాధ నాలో ఎక్కడో ఉండిపోయింది. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిందని ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను` అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

55
జులై 24న పాన్‌ ఇండియాలో రిలీజ్‌ కాబోతున్న `హరిహర వీరమల్లు`
Image Credit : Asianet News

జులై 24న పాన్‌ ఇండియాలో రిలీజ్‌ కాబోతున్న `హరిహర వీరమల్లు`

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీని ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు.

ఈ నెల 24న పాన్‌ ఇండియా లెవల్లో భారీగా ఈ సినిమా విడుదల కాబోతుంది. పవన్‌ తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటున్నారు.

 ఎప్పుడూ లేని విధంగా ఆయన మీడియా ఇంటరాక్షన్స్ చేయడం విశేషం. నిర్మాత ఏఎం రత్నం కోసం ఆయన సినిమా ప్రమోషన్స్ కి టైమ్‌ ఇవ్వడం మరో విశేషం. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Recommended image2
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Related Stories
Recommended image1
`బిగ్‌ బాస్‌ తెలుగు 9` హౌజ్‌లోకి ఈసారి ఎంత మంది కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్లు వస్తున్నారో తెలుసా? వారికి పెద్ద దెబ్బే
Recommended image2
నాగబాబు గుండెల్లో నాటుకుపోయే మాట చెప్పిన శోభన్‌ బాబు.. సోగ్గాడి ప్రశంసలకు మెగా బ్రదర్‌ ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved