- Home
- Entertainment
- బ్యూటిఫుల్ పోస్టర్ తో ఓజి సెకండ్ సింగిల్ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ని ఇలా చూడడం చాలా రేర్
బ్యూటిఫుల్ పోస్టర్ తో ఓజి సెకండ్ సింగిల్ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ని ఇలా చూడడం చాలా రేర్
పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ నుంచి ఇప్పటికే ఫైర్ స్టార్మ్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

రిలీజ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజి స్లొగన్స్ వినిపిస్తున్నాయి.
టీజర్, ఫస్ట్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్
పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ కథాంశంతో నటిస్తుండడం కూడా ఓజిపై క్రేజ్ పెంచేసింది. టీజర్, ఫస్ట్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
ఓజి సెకండ్ సింగిల్ అప్డేట్
ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి జోడీగా తొలిసారి ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఫైర్ స్టార్మ్ సాంగ్ తో మాస్ ఆడియన్స్ ని ఊపేసిన చిత్ర యూనిట్ ఈసారి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని తీసుకురాబోతున్నారు. ఓజి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 27న ఉదయం 10.08 గంటలకు సువ్వి సువ్వి అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
బ్యూటిఫుల్ పోస్టర్ వైరల్
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చాలా అందంగా ఉంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక ఇద్దరూ ఈ పోస్టర్ లో క్యూట్ గా కనిపిస్తున్నారు. ఇద్దరూ దీపాలు పెడుతున్న ఫోజు చూడముచ్చటగా ఉంది.
పవన్ ని ఇలా చూడడం రేర్
పవన్ కళ్యాణ్ ని ఇలా హీరోయిన్ తో కలిసి బ్యూటిఫుల్ లుక్ లో చూడడం చాలా అరుదు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూస్తూ ఫ్యాన్స్ తొలిప్రేమ, ఖుషి లాంటి చిత్రాల్లో హీరోయిన్లతో పవన్ కెమిస్ట్రీని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఆగస్టు 27న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది కాబట్టి సెకండ్ సింగిల్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
You have heard how FIRE sounds.
Now feel how love and emotion sing. #SuvviSuvvi will win you over from August 27th, 10:08 AM. ❤️#OG#OGSecondSingle#TheyCallHimOGpic.twitter.com/IXISHMDSYs— DVV Entertainment (@DVVMovies) August 24, 2025