MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ.. సినిమా ఫ్లాప్ కి అసలైన కారణం ఇదే, హృతిక్ సీన్ పై విమర్శలు

వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ.. సినిమా ఫ్లాప్ కి అసలైన కారణం ఇదే, హృతిక్ సీన్ పై విమర్శలు

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ చిత్రంలో లాజిక్ లేని సీన్ల గురించి వర్మ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ అంచనాలతో విడుదలైన వార్ 2
Image Credit : Instagram/Ram Gopal Varma

భారీ అంచనాలతో విడుదలైన వార్ 2

 యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే వార్ 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. రిలీజ్ కి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వార్ చిత్రం ఘనవిజయం కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న వార్ 2 అంతకి మించేలా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ
Image Credit : instagram

వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ

కానీ ఈ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. మరోవైపు కూలీ చిత్రం నుంచి పోటీ ఉండడం వల్ల వార్ 2 కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ చిత్రం నష్టాల బాటలో పయనిస్తోంది. వార్ 2 పరాజయం చెందడానికి కారణం వివరిస్తూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 

Related Articles

Related image1
పొలిటికల్ గా టార్గెట్ అయిన చిరంజీవి మూవీ, వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు.. నిర్మాత సంచలనం, అసలేం జరిగింది ?
Related image2
రాజ్ తరుణ్ లాంటి హీరో చేయాల్సిన మూవీ ప్రభాస్ చేస్తే అంతే.. ఫ్లాప్ సినిమాపై స్టార్ డైరెక్టర్ సెటైర్లు
35
జపాన్ వాళ్ళతో ఫైట్ ఏంటి ?
Image Credit : X/YRF

జపాన్ వాళ్ళతో ఫైట్ ఏంటి ?

 వార్ 2 మూవీ తాను చూశానని లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయని వర్మ అన్నారు. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్పై యూనివర్స్ మూవీ అంటే ఇండియా ఏజెంట్ గా ఉన్న హీరో మన దేశానికి శత్రు దేశాలతో పోరాడాలి. కానీ హృతిక్ ఎంట్రీ సీన్ లో జపాన్ వాళ్ళతో భారీ ఫైట్ పెట్టారు. అసలు ఇండియాకి జపాన్ ఎప్పుడు శత్రు దేశంగా మారిందో నాకు అర్థం కాలేదు. కనీసం ఆ ఫైట్ ఎందుకు పెట్టారో అనేదానిపై సరైన వివరణ ఉండాల్సింది. అది కూడా జరగలేదు. 

45
లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయి
Image Credit : Instagram

లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయి

ఇలాంటి లాజిక్ లేని సీన్లు వార్ 2లో చాలా ఉన్నాయి. అందుకే సినిమా ఎంత భారీగా ఉన్న ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు అని వర్మ అన్నారు. వార్ 2  మాత్రమే కాదు.. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు అలాగే ఉన్నాయి. అందరికీ పాన్ ఇండియా అనే జబ్బు పట్టింది అని వర్మ విమర్శించారు. వార్ 2లో హృతిక్ రోషన్ కి జపాన్ వాళ్ళతో ఫైట్ ఎందుకు పెట్టారు అని నేను కొంతమందిని అడిగాను. 

55
యానిమల్ బాగా నచ్చింది
Image Credit : our own

యానిమల్ బాగా నచ్చింది

నేను ఎవరితో మాట్లాడాను అనేది అనవసరం.. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే జపాన్ వాళ్ళతో ఫైట్ అంటే వెరైటీగా ఉంటుంది అని పెట్టినట్లు చెప్పారు. కానీ సరైన లాజిక్ మాత్రం చెప్పలేకపోయారు. ఇటీవల కాలంలో తనకి యానిమల్ చిత్రం బాగా నచ్చింది అని వర్మ అన్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడు. దేవర కూడా చూశాను. అది మంచి కథే కానీ ఏదో చేయాలని ఇంకేదో చేశారు అంటూ వర్మ అభిప్రాయ పడ్డారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
పొలిటికల్ గా టార్గెట్ అయిన చిరంజీవి మూవీ, వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు.. నిర్మాత సంచలనం, అసలేం జరిగింది ?
Recommended image2
రాజ్ తరుణ్ లాంటి హీరో చేయాల్సిన మూవీ ప్రభాస్ చేస్తే అంతే.. ఫ్లాప్ సినిమాపై స్టార్ డైరెక్టర్ సెటైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved