- Home
- Entertainment
- Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..
బిగ్ బాస్ తెలుగు 9 షో గ్రాండ్ ఫినాలేకి చేరువయ్యే కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా నాగార్జున బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్ కి దక్కే ప్రైజ్ మనీ ఎంతో రివీల్ చేశారు. ఈ వివరాలు ఈ కథనంలో..

ఇక మిగిలింది ఆరుగురే
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. భరణి శంకర్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, సంజన ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. వీకెండ్ సందర్భంగా నాగార్జున సండే రోజు బిగ్ బాస్ డయాస్ పై సందడి చేయబోతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 9 విజేతకు దక్కే ప్రైజ్ మనీ ఎంతంటే
దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ కి సంబంధించి ఒక బిగ్ రివీల్ చేశారు. బిగ్ బాస్ తెలుగు 9 విజేత కి ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో నాగార్జున బయటపెట్టారు. టైటిల్ గెలిచిన వాళ్లకు రూ 50 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది అని నాగార్జున తెలిపారు. ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలోనే ఈ వివరాలు ఉన్నాయి. ప్రైజ్ మనీకి సంబంధించిన ఫుల్ డీటైల్స్ కంప్లీట్ ఎపిసోడ్ లో చూడవచ్చు.
భరణి టైటిల్ గెలిస్తే..
నాగార్జున ఈ సందర్భంగా ఇంటి సభ్యలు ఒక్కొక్కరినీ పిలిచి ఆసక్తికర ప్రశ్న అడిగారు. ముందుగా భరణిని పిలిచి.. ఒకవేళ నీవు టైటిల్ గెలిస్తే.. మిగిలిన ఐదుగురికి ఎంత డబ్బు ఇచ్చి పంపిస్తావు అని అడిగారు. భరణి సమాధానం ఇస్తూ.. డబ్బే ఇవ్వాల్సి వస్తే ఇమ్మాన్యుయేల్, పవన్ లకు మాత్రమే ఇస్తానని.. అది కూడా ఇమ్మాన్యుయేల్ కి ఇంకాస్త ఎక్కువగా రూ 20 లక్షలు వరకు ఇస్తానని భరణి అన్నారు.
భరణికి ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటు
కానీ ఇమ్మాన్యుయేల్ మాత్రం తాను భరణిని తొలగిస్తానని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇది కూడా భరణికి ఒక రకంగా వెన్నుపోటు లాంటిదే. అయినా కూడా భరణి రేలంగి మావయ్య లాగా స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున డిమాన్ పవన్ ని పిలిచి.. పెళ్లి కొడుకుని అడుగుదాం అంటూ సెటైర్ వేశారు.
రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్
బిగ్ బాస్ టైటిల్ నువ్వు గెలిస్తే.. రీతూకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత ఖర్చు పెడతావ్ అని నాగార్జున పవన్ ని అడిగారు. పవన్ వెంటనే.. రూ.5 లక్షలు ఖర్చు చేస్తా అని చెప్పాడు. దీనితో మిగిలినవాళ్లంతా షాక్ అయ్యారు. అంతే కాదు నాగార్జునకి మైండ్ బ్లాక్ అయింది. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ రూ. 5 లక్షల గిఫ్ట్ ఇస్తావా రా అని ఆశ్చర్యంగా అడిగారు.

