- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కన్నుమూత.. డిప్యూటీ సీఎం ఎమోషనల్ నోట్.. ట్రైనింగ్ ఇవ్వను అన్నాడా?
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కన్నుమూత.. డిప్యూటీ సీఎం ఎమోషనల్ నోట్.. ట్రైనింగ్ ఇవ్వను అన్నాడా?
పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన గురువు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ సందర్భంగా పవన్ ఒక ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు.

pawan kalyan, shahin hussaini
పవన్ కళ్యాణ్ హీరో కావడానికి ముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయన చెన్నైలో షిహాన్ హుస్సైనీ వద్ద శిక్షణ తీసుకున్నారు. పవన్ కి ఊరికే ఆయన ట్రైనింగ్ ఇవ్వలేదు. దీనికి సెట్ కావని తిరస్కరించాడు.
చాలా రోజులు నో చెప్పాడు. అయినా పవన్ వినలేదు. ఆయన ఆఫీస్‌లో బాయ్‌గా కూడా పనిచేశాడు. అప్పుడు గానీ గురువు షిహాన్ కనికరించలేదు. పవన్ లోని పట్టుదల చూసి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.
shahin hussaini
కఠినమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చాడు. పవన్‌ని బెస్ట్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దారు. పవన్ తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించి ప్రశంసలందుకోవడానికి కారణం ఆయన గురువే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గురువు గురించి కూడా పవన్ చాలా సార్లు చెప్పారు.
ఆయన ఎంత గొప్పవారో తెలిపారు. ఆ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ షిహాన్ హుస్సైనీ ఇక లేరు. ఆయన మంగళవారం కన్నుమూశారని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు.
pawan kalyan, shahin hussaini
ఇందులో పవన్ చెబుతూ, ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, అర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. నేను ఆయన వద్ద కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది.
వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అంతేకాదు ఈ నెల 29న చెన్నై వెళ్లి హుస్సైనీ ని పరామర్శించాలని, నిర్ణయించుకున్నాను. ఇంతలోనే దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Pawan Kalyan
చెన్నైలో హుస్సైనీ కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత కరాటే నేర్పించేందుకు ఒప్పుకోలేదు. `ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు. కుదరదు` అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారు.
తెల్లవారుజామున వెళ్లి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. `తమ్ముడు` సినిమాలో కథానాయక పాత్ర కిక బాక్సింగ్ నేర్చుకునేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి.
హుస్సైనీ శిక్షణలో సుమార మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్‌లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.
pawan kalyan, shahin hussaini
హుస్సైనీ ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి, పలు చిత్రాల్లో నటించారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతరసమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే, వెంట తీసుకెళ్లేవారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ మార్షల్ ఆర్ట్స్ ని యూత్ కి మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణాంతరం తనదేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది హుస్సైనీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని తెలిపారు పవన కళ్యాణ్.
read more: అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? `మగధీర` సినిమా ఇంత పనిచేసిందా?