MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Pawan First Wife: పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు

Pawan First Wife: పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు

పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందనేది క్లారిటీ లేదు. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు గీతా కృష్ణ. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 22 2026, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు
Image Credit : stockPhoto

పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయన నందినిని మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరిది అరెంజ్‌ మ్యారేజ్‌. 1997లో పెళ్లి చేసుకుంటే రెండేళ్లకి విడిపోయారు. కాకపోతే 2008లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్‌ని మ్యారేజ్‌ చేసుకున్నారు పవన్‌. వీరికి అకీరా నందన్‌, ఆధ్యలు జన్మించారు. మూడేళ్లకి వీరిద్దరు విడిపోయారు. అనంతరం రష్యా నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఎక్కడుంది?
Image Credit : Asianet News

పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఎక్కడుంది?

ఇదిలా ఉంటే రేణు దేశాయ్‌ ఇప్పుడు ఎక్కడుంది? ఏంచేస్తుందో అందరికి తెలిసిందే. ఆమె పబ్లిక్‌ లో ఉంటుంది. తరచూ అనేక విషయాలపై మాట్లాడుతుంది. అయితే పవన్‌ మొదటి భార్య నందిని ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేస్తుందనేది పెద్ద మిస్టరీ. ఈ విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. షాకింగ్‌ నిజాలు తెలిసిపోయాయి. ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. నందిని.. గీతా కృష్ణ వాళ్ల బంధువుల అమ్మాయి అట. పత్తిపాటి పుల్లారావు బంధువుల అమ్మాయి అట. వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ అని, వాళ్ల తాత పత్తిపాటి గంగరాజు, వాళ్లది పోలవరం అని, పత్తిపాటి పుల్లారావు సిస్టర్‌ డాటరే నందిని అని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ తో విడిపోయాక మళ్లీ సినిమా వాళ్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ గీతా కృష్ణ వద్దు అని చెప్పాడట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

Related Articles

Related image1
Maa Inti Bangaram 3 Days Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ముదులుపుతున్న సమంత.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
Related image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
35
అమెరికాలో సెటిల్‌ అయిన నందిని
Image Credit : Pawan Kalyan\Twitter

అమెరికాలో సెటిల్‌ అయిన నందిని

ఆ తర్వాత డాక్టర్‌ని పెళ్లి చేసుకుందట నందిని. ఇప్పుడు వాళ్లు అమెరికాలో సెటిల్‌ అయ్యారట. తను కూడా అమెరికా బిజినెస్‌ చేస్తుందని, ఇప్పుడు బాగా సెటిల్‌ అయ్యిందని సమాచారం. పిల్లలు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని వెల్లడించారు గీతా కృష్ణ. రెండో పెళ్లికి తన పేరుని జాహ్నవిగా మార్చుకున్నట్టు సమాచారం. అయితే మరో ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్‌తో నందిని విడిపోయినప్పుడు ఆమెకి పవన్‌ భరణం గట్టిగానే ఇచ్చాడట. మొదట్లో ఇవ్వడానికి నో చెప్పాడని, ఆ తర్వాత కోర్ట్ ద్వారా ఆరున్నర కోట్ల వరకు భరణం ఇచ్చాడని వెల్లడించారు.

45
రేణు దేశాయ్‌కి గట్టిగానే భరణం
Image Credit : Renuu Desai/Instagram

రేణు దేశాయ్‌కి గట్టిగానే భరణం

ఈ సందర్భంగా రేణు దేశాయ్‌ కి సంబంధించిన భరణం గురించి తెలిపారు గీతా కృష్ణ. ఆమెకి కూడా పవన్‌ కళ్యాణ్‌ భరణం ఇచ్చాడట. పది పదిహేను కోట్లకుపైగానే ఇచ్చాడని అంటుంటారు. అయితే ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో తాను భరణం తీసుకోలేదని కామెంట్‌ చేసింది. కానీ దీనిపై గీతా కృష్ణ స్పందించారు. ఆమెకి భరణం ఇచ్చింది నిజమే అని, కానీ ఇన్‌కమ్‌ టాక్స్ సమస్య వస్తుందనే చెప్పలేదేమో అన్నారు. పవన్‌ ఏదైనా అధికారికంగానే చేశారని, కానీ ఆయన్ని పట్టుకొని అంతా విమర్శిస్తుంటారని పవన్‌ని సమర్థించారు గీతా కృష్ణ.

55
ఓజీ 2తో రాబోతున్న పవన్
Image Credit : Asianet News

ఓజీ 2తో రాబోతున్న పవన్

పవన్‌ కళ్యాణ్‌ చివరగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించారు. హరీష్‌ శంకర‌‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనేది క్లారిటీ లేదు. అయితే `ఓజీ 2` చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Related Stories
Recommended image1
Maa Inti Bangaram 3 Days Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ముదులుపుతున్న సమంత.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved