MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Maa Inti Bangaram 3 Days Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ముదులుపుతున్న సమంత.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maa Inti Bangaram 3 Days Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ముదులుపుతున్న సమంత.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maa Inti Bangaram 3 Days Collections: సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `మా ఇంటి బంగారం` విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకుంది. మొదటి వీకెండ్‌లో మూవీ అదిరిపోయే కలెక్షన్లని వసూలు చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 22 2026, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్‌ రిజల్ట్
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్‌ రిజల్ట్

సమంత రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం `మా ఇంటి బంగారం`. మూడేళ్ల గ్యాప్‌తో ఆమె చేసిన చిత్రమిది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సమంత భర్త రాజ్‌ నిడిమోరు.. నిర్మిస్తూ, ఈ మూవీకి కథ, కథనం అందించారు. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై ఈ మూవీ రూపొందింది. ఇది మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగానూ అదే జోరు చూపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహిళలకు బాగా కనెక్ట్ అయిన మా ఇంటి బంగారం
Image Credit : Asianet News

మహిళలకు బాగా కనెక్ట్ అయిన మా ఇంటి బంగారం

ఈ మూవీ మొదటి వీకెండ్‌ పూర్తి చేసుకుంది. మరి ఈ మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? సినిమా హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే. కలెక్షన్ల పరంగా మూవీ దుమ్మురేపుతుంది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్ డ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. శనివారం బెటర్‌ అయ్యింది. ఆదివారం మరింతగా పుంజుకుంది. సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి, ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే  బాగా చూస్తున్నారు.

35
మా ఇంటి బంగారం 3 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం 3 రోజుల కలెక్షన్లు

మా ఇంటి బంగారం బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. మూడు రోజుల్లోనే నలబై కోట్లు దాటింది. మొదటి వీకెండ్‌లో ఇది రూ.41.79కోట్లు రాబట్టింది. ఇండియాలో రూ.26.69కోట్లు, ఓవర్సీస్‌లో రూ.15కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా  రూ.23కోట్ల నెట్‌ వసూళ్లని వసూలు చేసింది. టాక్‌తో సంబంధం లేకుండా గట్టిగానే వసూలు చేస్తోందీ మూవీ. ఓవర్సీస్‌లో  1 మిలియన్‌ డాలర్లు దాటేయడం విశేషం. అయితే టీమ్‌ కలెక్షన్లని ప్రకటించింది. రూ.43కోట్లు రాబట్టినట్టు వెల్లడించడం విశేషం.

45
మా ఇంటి బంగారం మూవీ హిట్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ హిట్‌ టార్గెట్‌

సమంత మూవీకి సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. సమంత పారితోషికం, ప్రొడక్షన్‌ కాస్ట్ అన్నీ కలుపుకొని అంత అయ్యిందని అంటున్నారు. ఈమూవీ ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో రూ.35కోట్లు వచ్చాయని సమాచారం. అయితే థియేట్రికల్‌ బిజినెస్‌ కాలేదని సమాచారం. కాకపోతే థియేట్రికల్‌గా రూ.30కోట్ల వ్యాల్యూ లెక్కకట్టారు. ఈ లెక్కన ఈ మూవీ ఇప్పటికే ఇరవై కోట్ల షేర్‌ సాధించింది. ఈ వీక్‌లో ఈజీగా సినిమా పది కోట్లు సాధిస్తుంది. మొత్తంగా `మా ఇంటి బంగారం` బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు.

55
మా ఇంటి బంగారం కథ ఏంటంటే?
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం కథ ఏంటంటే?

ఇక `మా ఇంటి బంగారం` మూవీలో సమంతతోపాటు కన్నడ నటులు గుల్షన్‌ దేవయ్య, దిగంత్‌, శ్రీముఖి, మంజుష, గౌతమి, చైతన్య కృష్ణ, వెన్నెల కిశోర్‌ వంటి వారు కీలకపాత్రలు పోషించారు. అనాథ అయిన హీరోయిన్‌.. చిన్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతుంది. ఎంతో స్ట్రగుల్స్ అనంతరం తిరుగుబాటు చేస్తుంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లి తుపాకులు పడుతుంది. అక్కడ కూడా తనకు మోసమే జరుగుతుంది. దీంతో అక్కడ కూడా తిరుగుబాటు చేసి మళ్లీ సాధారణ లైఫ్‌ స్టార్ట్ చేస్తుంది. ఒక పెద్దింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత తన గతం వెంటాడుతుంది. తన ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో తాను ఎలా పోరాడిందనేదే ఈ మూవీ కథ. ఇందులో సమంత కామెడీతో నవ్వించింది. యాక్షన్‌తో అదరగొట్టింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ప్యారడైజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాని ఎమోషనల్ పోస్ట్
Recommended image2
ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు
Recommended image3
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Related Stories
Recommended image1
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved