MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nandini Reddy: డైరెక్టర్ నందినీ రెడ్డిని ఏడిపించిన కృష్ణ వంశీ.. రమ్యకృష్ణ ఏం చేసిందంటే..

Nandini Reddy: డైరెక్టర్ నందినీ రెడ్డిని ఏడిపించిన కృష్ణ వంశీ.. రమ్యకృష్ణ ఏం చేసిందంటే..

 Nandini Reddy: డైరెక్టర్ నందినీ రెడ్డి ఇప్పుడు అందరికీ పరిచయమే. అయితే.. ఆమెకు ఒకానొక సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ రావడం కూడా చాలా కష్టమైంది. రమ్యకృష్ణ ఒక్క ఫోన్ తో తన తలరాతే మారిపోయిందని ఆమె చెప్పడం విశేషం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రమ్యకృష్ణ  మంచితనం..
Image Credit : meramyakrishnan/Instagram

రమ్యకృష్ణ మంచితనం..

కృష్ణవంశీ దగ్గర నందినీ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే.. మొదట నందినీ రెడ్డిని అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోవడానికి కృష్ణ వంశీ అంగీకరించలేదని..రమ్యకృష్ణ కారణంగానే ఆఫర్ వచ్చిందని నందినీ రెడ్డి చెప్పారు.

‘ కృష్ణ వంశీ ఎడిటింగ్ పనులు ఎక్కువగా రాత్రిపూట చూసుకుంటారు. ఆ సమయంలో అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటం ఎందుకులే.. అనవసరపు తలనొప్పి అని వద్దు అనుకున్నారు. ఆ ఛాన్స్ అలా మిస్ అయిపోయింది.అయితే... వేరే ఫ్రెండ్ ద్వారా నందినీ రెడ్డికి రమ్యకృష్ణ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఓసారి రమ్యకృష్ణ గారు ఫోన్ చేసినప్పుడు తాను బెంగళూరు వెళ్లిపోతున్నాను అని చెప్పాను. నీకు కన్నడ వచ్చా అని అడిగారు. రాదు..కానీ.. ఇక్కడ ఎవరి దగ్గర అసిస్టెండ్ డైరెక్టర్ గా ఛాన్స్ రావట్లేదని..కృష్ణ వంశీ దగ్గర ఆఫర్ వచ్చినట్లే వచ్చి పోయింది అని చెప్పాను. వెంటనే రమ్యకృష్ణ.. తన భర్త కృష్ణ వంశీకి ఫోన్ చేసి మాట్లాడి.. ఒప్పించారు. మరుసటి రోజు నేను వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అలా చంద్ర లేఖ మూవీకి పని చేశాను. ’ అని నందినీ రెడ్డి చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కృష్ణ వంశీ ఏడిపించడంతో..
Image Credit : meramyakrishnan/Instagram

కృష్ణ వంశీ ఏడిపించడంతో..

‘ నిన్నే పెళ్లాడతా సినిమా కోసం కూడా వర్క్ చేశాను. దాని కోసం.. చాలా కష్టపడ్డాను. అయితే.. ఎంత పని చేసినా కూడా..కృష్ణ వంశీ తిట్టేవారు. ఒకరోజు ఉదయాన్నే షూటింగ్.. ఆ సమయంలో కూడా నేను సరిగా పని చేయలేదనే బాగా తిట్టాడు. దీంతో.. వెంటనే ఏడ్చేశాను. అక్కడే.. రమ్యకృష్ణ ఉంది. అంతే.. నేను ఏడవడం చూసి.. వెంటనే కృష్ణ వంశీని తిట్టేసింది. తర్వాత వంశీ నాతో మాట్లాడాడు. నువ్వు బాగా పనిచేస్తున్నావ్ అనే కదా నీకు పని చెబుతన్నాను.. నువ్వు ఏడ్చేసి వెళ్లి దానికి చెబుతున్నావ్.. అది నన్ను తిడుతోంది’ అని అన్నారు.

33
మురారి సినిమాకి తొలిసారి..
Image Credit : our own

మురారి సినిమాకి తొలిసారి..

‘మురారీ సినిమా కోసం కూడా మేము చాలా కష్టపడ్డాం. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్ల పేర్లను సినిమా ఎండ్ క్రెడిట్స్ లో వేస్తూ ఉంటారు. కానీ.. ఈ సినిమా కి మేము చాలా కష్ట పడ్డాం అని.. మా పేర్లు టైటిల్స్ మొదట పడేటప్పుడే వేశారు. అలా చూసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది’ అని నందిని రెడ్డి చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image3
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Folk Song: రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందే..!
Recommended image2
Nandini Reddy: రౌడీలు ఇంటికి వచ్చి బెదిరించారు, అందుకే ఈ అబ్బాయి గెటప్.. డైరెక్టర్ నందినీ రెడ్డి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved