MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vijay Birthday : దళపతి విజయ్ వద్ద ఉన్న అత్యంత లగ్జరీ కారు ఏది? అతి తక్కువ ధర కారు ఏది?

Vijay Birthday : దళపతి విజయ్ వద్ద ఉన్న అత్యంత లగ్జరీ కారు ఏది? అతి తక్కువ ధర కారు ఏది?

తమిళ హీరో నుండి ఇటీవలే ముఖ్యమంత్రిగా మారిన దళపతి విజయ్‌ కి కార్లంటే పిచ్చి. ఆయన గ్యారేజ్‌లో కోట్ల విలువైన లగ్జరీ కార్లే కాదు సామాన్యులు వాడే కార్లు కూడా ఉన్నాయి. ఆయన భర్త్ డే సందర్భంగా ఆ కార్ల వివరాలు, వాటి ధరలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 22 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్
Image Credit : Asianet News

విజయ్ కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్

నేడు (జూన్ 22, సోమవారం) కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ పుట్టినరోజు. ఇప్పటివరకు ఆయన 51 పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు... కానీ ఇవాళ జరుపుకునే 52వ భర్త్ డే ఆయనకే కాదు అభిమానులకు చాలా స్పెషల్.   రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు… అందుకే ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ స్పెషల్ భర్త్ డే సందర్భంగా విజయ్ లగ్జరీ కార్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లెక్సస్ LM 350h (Lexus LM 350h)
Image Credit : X

లెక్సస్ LM 350h (Lexus LM 350h)

విజయ్ కార్ కలెక్షన్‌లో అత్యంత ఖరీదైన వాహనం లెక్సస్ ఎల్ఎం 350హెచ్. దీని విలువ సుమారు రూ.2.20 కోట్ల నుంచి రూ.2.75 కోట్ల వరకు ఉంటుంది. ఈ అల్ట్రా-లగ్జరీ ఎంపీవీలో 48-అంగుళాల పెద్ద రియర్ స్క్రీన్, 23 స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మినీ ఫ్రిజ్, ఆటోమేటిక్ డోర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 2.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ శక్తినిస్తుంది.

36
బిఎండబ్ల్యు ఐ7 (BMW i7)
Image Credit : X

బిఎండబ్ల్యు ఐ7 (BMW i7)

పూర్తిగా విద్యుత్‌తో నడిచే బీఎండబ్ల్యూ i7 విజయ్ కార్ కలెక్షన్‌లోని మరో ప్రీమియం వాహనం. దీని విలువ సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ పెద్ద థియేటర్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, హై-క్వాలిటీ క్యాబిన్ అనుభవానికి ప్రసిద్ధి. 101.7 kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు, నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

46
టయోటా వెల్ఫైర్ (Toyota Vellfire)
Image Credit : X

టయోటా వెల్ఫైర్ (Toyota Vellfire)

సుమారు రూ.1.19 కోట్ల విలువైన టయోటా వెల్‌ఫైర్ కూడా విజయ్ గ్యారేజీలో ఉంటుంది. ఇది భారతదేశంలోని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంపీవీ. 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, విశాలమైన ఇంటీరియర్, విలాసవంతమైన సీట్లు దీని ప్రత్యేకతలు.

56
విజయ్ లగ్జరీ కార్ కలెక్షన్
Image Credit : X

విజయ్ లగ్జరీ కార్ కలెక్షన్

ఆడి ఏ8 ఎల్ (AUDI A8 L)

విజయ్ వద్ద ఉన్న మరో లగ్జరీ కారు ఆడి కంపెనీ ఫ్లాగ్‌షిప్ సెడాన్ ఏ8 ఎల్… దీని ధర రూ.1.34 కోట్ల నుంచి రూ.1.63 కోట్ల వరకు ఉంటుంది. 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మల్టిపుల్ డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series)

రూ.74.80 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్ కూడా విజయ్ వద్ద ఉంది. ఇది పర్ఫార్మెన్స్, లగ్జరీకి పెట్టింది పేరు. 2.0-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, లాంగ్ జర్నీలలో కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

మినీ కూపర్ ఎస్ (Mini Cooper S)

విజయ్ కార్ కలెక్షన్‌లో స్పోర్టీ లుక్‌తో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మినీ కూపర్ ఎస్. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 201 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర రూ.44 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser)

విజయ్ కార్ కలెక్షన్‌లో లేటెస్ట్‌గా చేరిన కారు ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నలుపు రంగు కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.2.25 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఇది విజయ్ కే కాదు ఆయన అభిమానులకు ఫేవరెట్ కారుగా మారింది.

66
మారుతి సుజుకి స్విఫ్ట్
Image Credit : X

మారుతి సుజుకి స్విఫ్ట్

విజయ్ కార్ కలెక్షన్‌లో లగ్జరీ కార్లే కాదు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడు కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో అత్యంత తక్కువ ధర కలిగిన వాహనం మారుతి సుజుకి స్విఫ్ట్. సుమారు రూ.5.79 లక్షల విలువైన ఈ హ్యాచ్‌బ్యాక్ కారు 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సింప్లిసిటీ, నమ్మకం, రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉండటంతో ఇది భారత ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎప్పుడూ లగ్జరీ కార్లలో కనిపించే విజయ్ అప్పడప్పుడు మారుతి స్విప్ట్ లోనూ కనిపిస్తుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Related Stories
Recommended image1
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Recommended image2
Now Playing
CM Vijay Fire Speech in Assembly: సీఎం విజయ్ స్పీచ్ కిదద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved