- Home
- Entertainment
- 'కళావతి' రికార్డు బద్దలు.. నిజంగానే తుఫాన్ సృష్టించిన పవన్ 'ఓజి ఫైర్ స్టార్మ్' సాంగ్
'కళావతి' రికార్డు బద్దలు.. నిజంగానే తుఫాన్ సృష్టించిన పవన్ 'ఓజి ఫైర్ స్టార్మ్' సాంగ్
పవన్ కల్యాణ్ ‘OG’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్టార్మ్’ 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది.

సోషల్ మీడియాలో ఓజి సాంగ్ తుఫాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దే కాల్ హిమ్ OG’ నుంచి విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్’ నెట్టింట హల్‌చల్ సృష్టిస్తోంది. ఈ సాంగ్ నిజంగానే తుఫాన్ సృష్టించిందా అనేంతలా వైరల్ అయింది. తమన్ స్వరపరిచిన ఈ పాట ఆగస్ట్ 2వ తేదీ మధ్యాహ్నం రిలీజ్ అయింది. రిలీజ్ అయి 24 గంటలలోపే విపరీతమైన స్పందనను దక్కించుకుంది. విజువల్స్, మ్యూజిక్, పవన్ స్టైలిష్ లుక్ అన్నీ కలిసి ఈ పాటను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి.
KNOW
కళావతి రికార్డు బ్రేక్ చేసిన ఫైర్ స్టార్మ్
ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్, 830.3K లైక్స్ సంపాదించి ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇది వరకు మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి’ పాట 806K లైక్స్‌తో మూడు సంవత్సరాల పాటు టాప్ లో కొనసాగింది. ఈ రెండు పాటలకూ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కావడం విశేషం.ఎట్టకేలకు ఓజి సాంగ్ కళావతి సాంగ్ రికార్డు బ్రేక్ చేసింది. ఈ విజయంతో తమన్ మ్యూజిక్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
ఓజీ చిత్రంలో నటీనటులు
ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్యామ్, శ్రీయా రెడ్డి వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
A-L-L 🔫
T-I-M-E 🔫
R-E-C-O-R-D 🔫
IS
K-A-L-Y-A-N 💲🔝
F-I-R-E-S-T-O-R-M
🎶♾️ pic.twitter.com/rZYOmSTQzU— thaman S (@MusicThaman) August 3, 2025
ఓజి రిలీజ్ డేట్ ఇదే
‘దే కాల్ హిమ్ OG’ చిత్రం సెప్టెంబర్ 25, 2025 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి పాటతో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరిచింది. ఫైర్ స్టార్మ్ చూపించిన ప్రభావం చూస్తే, రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిరాశ పరిచిన హరిహర వీరమల్లు
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలయింది. అయితే ఈ చిత్రానికి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. దీనితో పవన్ అభిమానులు ఓజిపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఫైర్ స్టార్మ్ సాంగ్ కి ఇంగ్లీష్ లిరిక్స్ ప్రముఖ సింగర్ రాజా కుమారి అందించారు. ఇంగ్లీష్ లో వచ్చే పాటని ఆమె పాడారు. తెలుగులో వచ్చే మిగిలిన భాగం సాంగ్ ని తమన్, శింబు, నజీరుద్దీన్ పాడారు.