- Home
- Entertainment
- రాంచరణ్ సినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పిన కింగ్డమ్ డైరెక్టర్.. అక్కడే తేడా కొట్టింది
రాంచరణ్ సినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పిన కింగ్డమ్ డైరెక్టర్.. అక్కడే తేడా కొట్టింది
రాంచరణ్‌తో సినిమా ఎందుకు ఆగిపోయిందో గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు. భవిష్యత్తులో చరణ్ తో తప్పకుండా సినిమా ఉంటుందని తెలిపారు.

స్టోరీ ఐడియా రాంచరణ్ కి నచ్చింది కానీ..
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రాంచరణ్ కాంబినేషన్ లో రావలసిన ఒక చిత్రం ఆగిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయం గురించి గౌతమ్ స్పష్టత ఇచ్చారు. ‘‘రాంచరణ్‌కి ఒక స్టోరీ ఐడియా చెప్పాను. ఆయనకి అది నచ్చింది కూడా. కానీ తర్వాత పూర్తి కథను సిద్ధం చేసినప్పుడు చరణ్‌కి అది సెట్ కావడం లేదు అనిపించింది,’’ అని గౌతమ్ వివరించారు. రాంచరణ్ కూడా కథపై అనుమానం వ్యక్తం చేశారు.
KNOW
కంగారుగా సినిమా చేయడం ఇష్టం లేదు
గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ – ‘‘చరణ్ వంటి స్టార్ హీరోతో అవకాశం వచ్చింది కాబట్టి, ఏదో ఒక కథతో కంగారుగా సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ కథని పక్కన పెట్టాం. తర్వాత మరో మంచి కథ సిద్ధం అయిన తర్వాతే చరణ్‌కి చెప్తానని ముందుగానే చెప్పేశాను,’’ అని వెల్లడించారు. ఆ స్టోరీ పాయింట్ ఇప్పటికీ నాకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. కానీ ఎందుకనో అది వర్కౌట్ కాలేదు.
చరణ్‌తో ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయి
ఇకపోతే.. సినిమా ఆగిపోయిన తర్వాత కూడా రాంచరణ్‌తో తన సంబంధాలు కొనసాగుతున్నాయని గౌతమ్ తిన్ననూరి వివరించారు. ‘‘ఇప్పటికీ చరణ్‌తో తరచూ మాట్లాడుతుంటా. మంచి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఆయన్ను కలవడం ఖాయం. మంచి ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నాం,’’ అని చెప్పారు.
విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ సక్సెస్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ మంచి రెస్పాన్స్‌ను పొందుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹67 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ చాలా కాలంగా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండతో ఆ మూవీ చేయాలనుకున్నా
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ తో గతంలోనే మళ్ళీరావా సినిమా చేయాల్సింది. ఆ టైంలో పెళ్లి చూపులు సక్సెస్ కావడంతో తన కథని వినే పరిస్థితిలో విజయ్ దేవరకొండ లేడని గౌతమ్ తిన్ననూరి తెలిపారు.