MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..ఆ కుటుంబానికి అండగా సోనూసూద్

Pawan Kalyan: చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..ఆ కుటుంబానికి అండగా సోనూసూద్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూశారు. గత నెలలో పవన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 'OG 2' కలిసి చూద్దామని హామీ ఇచ్చారు. ఇప్పుడా కోరిక తీరకుండానే తనువు చాలించాడు. నిరంజన్ మృతిపై నటుడు సోనూసూద్ స్పందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 08 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..
Image Credit : Asianet News

చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండ యువకుడు పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. జన్యుపరమైన వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్న నిరంజన్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. అతని మరణం కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గతంలో పరామర్శించిన పవన్ కల్యాణ్
Image Credit : Asianet News

గతంలో పరామర్శించిన పవన్ కల్యాణ్

నిరంజన్ పరిస్థితి గురించి తెలిసిన పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతనితో సెల్ఫీ దిగడంతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

36
ఓజీ 2 కలిసి చూద్దాం: పవన్
Image Credit : Asianet News

ఓజీ 2 కలిసి చూద్దాం: పవన్

తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా, కొని పంపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే అదే రోజు కుక్కపిల్లను పంపించారు. దీంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని కుటుంబ సభ్యులు అప్పట్లో వెల్లడించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మరో హామీ కూడా ఇచ్చారు. తాను నటిస్తున్న 'OG 2' విడుదలయ్యాక స్పెషల్ గెస్ట్ గా తీసుకెళ్లి కలిసి సినిమా చూద్దామని నిరంజన్‌కు చెప్పారు. అయితే ఆ కోరిక నెరవేరకముందే నిరంజన్ కన్నుమూయడం ఫ్యాన్స్ ను ఆవేదనకు గురి చేసింది.

46
ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తానన్న పవన్
Image Credit : Asianet News

ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తానన్న పవన్

పరామర్శ సమయంలో నిరంజన్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వారి జీవనోపాధికి తోడ్పాటుగా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో ఆయన అభిమానులు పవన్ మానవత్వాన్ని ప్రశంసించారు. 

56
స్పందించి అండగా ఉంటానన్న సోనూసూద్
Image Credit : Twitter/sonu sood

స్పందించి అండగా ఉంటానన్న సోనూసూద్

నిరంజన్ మరణవార్త తెలిసిన వెంటనే నటుడు సోనూ సూద్ కూడా స్పందించారు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయం కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. 

66
విధి మరోలా నిర్ణయించింది
Image Credit : Asianet News

విధి మరోలా నిర్ణయించింది

ఈ ఘటనలో అభిమానులను ఎక్కువగా కదిలించిన అంశం ఏమిటంటే... ఒక అభిమాని కోరికను గౌరవిస్తూ అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్, అతనికి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ విధి మరోలా నిర్ణయించడంతో, 'OG 2'ను తన అభిమాన హీరోతో కలిసి చూడాలనే నిరంజన్ కల కలగానే మిగిలిపోయింది.  

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Inspiring Story: ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే
Recommended image2
Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved