MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పరాజయంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ నన్ను నిలబెట్టాడు.. స్నేహితుడిపై పవన్‌ కళ్యాణ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

పరాజయంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ నన్ను నిలబెట్టాడు.. స్నేహితుడిపై పవన్‌ కళ్యాణ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

అభిమానులను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన స్నేహితుడు త్రివిక్రమ్‌ పై ఆయన ఎమోషనల్‌ కామెంట్‌ చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 21 2025, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌
Image Credit : Asianet News

ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చాలా రోజుల తర్వాత తన సినిమా ఈవెంట్లో మెరిశారు. తాజాగా ఆయన నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. అభిమానుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చారు.

 తన పవర్‌ ఫుల్‌ స్పీచ్‌తో వారిని ఖుషీ అయ్యేలా చేశారు. సోమవారం సాయంత్రం శిల్ప కళావేదికలో జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తనతో పనిచేసేందుకు పెద్ద దర్శకులు రారు అని వెల్లడించారు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ గురించి, అలాగే తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పరాజయంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ `జల్సా` ఇచ్చాడు
Image Credit : Youtube print shot/Mega Surya Production

పరాజయంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ `జల్సా` ఇచ్చాడు

పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, తాను విజయాల్లో పెరగలేదని, పరాజయాలతోనే పెరిగానని తెలిపారు. వరస పరాజయాల్లో ఉన్నప్పుడు ఒక్క హిట్‌ కావాలని అభిమానులు అడిగితే అలాంటి సమయంలో హరీష్‌ శంకర్‌ `గబ్బర్‌సింగ్‌`తో హిట్‌ ఇచ్చాడని చెప్పారు. 

ఆ తర్వాత ఒక్క ఫ్లాప్‌ మూవీతో తాను స్ట్రక్ అయిపోయాను, సినిమాలపై గ్రిప్‌ రాలేదు. ఏం చేయాలనే డైలామాలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ నా జీవితంలోకి వచ్చాడు. నాకు `జల్సా` సినిమాని ఇచ్చాడు. 

అప్పటికీ త్రివిక్రమ్‌ గురించి పెద్దగా తేలియదు, కానీ పరాజయంలో ఉన్నప్పుడు ఎవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాకపోయినప్పుడు త్రివిక్రమ్‌ వచ్చి నాతో సినిమా చేసి హిట్‌ ఇచ్చాడు. 

సక్సెస్‌ లో ఉన్నప్పుడు మన వెంట ఉండేవారుకాదు, పరాజయంలో, కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్‌. అలా నాకు దొరికిన గొప్ప స్నేహితుడు త్రివిక్రమ్‌ అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

35
`హరి హర వీరమల్లు` షూటింగ్‌ కష్టాలు
Image Credit : Youtube print shot/Mega Surya Production

`హరి హర వీరమల్లు` షూటింగ్‌ కష్టాలు

`హరి హర వీరమల్లు` సినిమా గురించి, నిర్మాత రత్నం గురించి చెబుతూ, చాలా కష్ట సమయంలో ఈ మూవీ చేసినట్టు తెలిపారు పవన్‌. సినిమాని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. 

ఈ సినిమా రెండు కరోనాలను దాటింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక టైమ్‌ ఇవ్వలేకపోయాను. అలాంటి సమయంలో రోజూ రెండు గంటలు మాత్రమే ఇవ్వగలిగినప్పుడు తన ఆఫీస్‌కి కూత వేటు దూరంలో సెట్ వేసి షూటింగ్‌ చేశామని తెలిపారు. 

ఈ సినిమా విషయంలో తాను డౌన్‌ అవుతున్నప్పుడు, ఏంటి? ఎలా చేయాలి? సినిమా రిలీజ్‌ అవుతుందా అని మదనపడినప్పుడు తన పాటలు, గ్లింప్స్ తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి ఉత్సాహాన్ని నింపారని  చెప్పారు పవన్‌.

45
`జానీ` ఫ్లాప్‌ అయినప్పుడు మీరు నా వెంటే ఉన్నారు
Image Credit : Youtube print shot/Mega Surya Production

`జానీ` ఫ్లాప్‌ అయినప్పుడు మీరు నా వెంటే ఉన్నారు

ఇక అభిమానులను ఉద్దేశించి పవన్‌ చెబుతూ, తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నా వెంటే ఉన్నారని తెలిపారు. వరుస హిట్ల తర్వాత `జానీ` సినిమా పరాజయం చెందినప్పుడు ఒక్కసారిగా అంతా డౌన్‌ అయిన పరిస్థితుల్లో మీరు నా వెంటనే ఉన్నారు. 

అన్నా మీ వెంట మేమున్నామని నిరూపించారు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు ఎప్పుడూ నన్ను వదిలి వెల్లలేదు. అభిమానులది డబ్బుతో కూడిన బంధం కాదు, గుండెకు గుండెకి ఉన్న బంధం. మా మధ్య దూరం రెండు గుండెలు మాత్రమే అని చెప్పారు పవన్‌.

55
`హరి హర వీరమల్లు`తో రికార్డులు బద్దలు కొట్టాలని పవన్‌ పిలుపు
Image Credit : Youtube print shot/Mega Surya Production

`హరి హర వీరమల్లు`తో రికార్డులు బద్దలు కొట్టాలని పవన్‌ పిలుపు

`భీమ్లా నాయక్‌` సినిమా సమయంలో మిగిలిన హీరోల సినిమాలకు టికెట్‌ రేట్లు వందల్లో ఉంటే, నా సినిమాకి మాత్రం పది, ఇరవై రూపాయలు ఉన్నాయని, అయినా సినిమా విజయం సాధించిందని, 

అప్పుడే ఎవర్రా మనల్ని ఆపేదని చెప్పానని, అలాంటిది ఇప్పుడు టైమ్‌, మన రికార్డ్, మన గట్స్, మన కరేజ్‌, మన డైనాస్టీ అని అభిమానుల్లో ఊపు తెచ్చే వ్యాఖ్యలు చేశారు పవన్‌. 

అదే సమయంలో పది, 15 రూపాయలు ఉంటేనే విజయాన్ని అందించారు. ఇప్పుడు టికెట్‌ రేట్లు పెరిగాయి. సినిమా మీకు నచ్చితే రికార్డులు బద్దలు కొట్టండి అంటూ మరోసారి తనదైన స్టయిల్‌లో కామెంట్‌ చేశారు పవన్‌. అభిమానులకు పిలునిచ్చారు.

 మీరే నా బలం, మీరే కోసమే నా గుండె కొట్టుకుంటుందని అభిమానులను ఉద్దేశించి పవన్‌ చెప్పడం విశేషం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` మూవీ తెరకెక్కగా, ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image2
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image3
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Related Stories
Recommended image1
Hari Hara Veera Mallu: బాబీ డియోల్‌ పాత్రకి ముందు అనుకున్న నటుడు ఎవరో తెలుసా? పవన్‌ కళ్యాణ్‌ బయటపెట్టిన నిజం
Recommended image2
ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా `హరి హర వీరమల్లు` నిర్మాత ఏఎం రత్నం.. పవన్‌ కళ్యాణ్‌ క్లారిటీ.. త్వరలో ఉత్తర్వులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved