- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: కొడుకులను గెంటేసిన తులసి బెస్ట్ మదర్ ఎలా అవుతుంది..'కలెక్టర్'గా ఎంట్రీ ఇచ్చిన ప్రవళిక!
Intinti Gruhalakshmi: కొడుకులను గెంటేసిన తులసి బెస్ట్ మదర్ ఎలా అవుతుంది..'కలెక్టర్'గా ఎంట్రీ ఇచ్చిన ప్రవళిక!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే లక్కీ (Lucky) తులసి ఆంటీ అంటే నాకు ఇష్టం నీకు ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడకు అని తన తల్లితో అంటాడు. దాంతో లాస్య (Lasya) లక్కీ ను కొట్ట బోతుండగా తులసి లాస్య చేయి పట్టుకుంటుంది. ఇక వాడికి అర్థం కాని విషయాల్లోకి వాడిని లాగొద్దు అని తులసి అంటుంది.
ఆ క్రమంలో నందు (Nandu) మా అమ్మా నాన్నల నుంచి నన్ను విడదీసింది తులసి కాదా? అని అంటాడు. ఇక ప్రవళిక మీ దగ్గర దొరకని ఆప్యాయత ఎదో వాడికి తులసి దగ్గర దొరుకుతుంది అందుకే తులసి ను వాడు ఇష్టపడుతున్నాడని అంటుంది. ఇక అనసూయ (Anasuya) చెప్పుతో కొట్టినట్టు భలే చెప్పావు అమ్మా అని అంటుంది.
ఆ తర్వాత ప్రేమ్ (Prem), అభి లు కలిసి ఆ ఈవెంట్ కు వస్తారు. ఇక ప్రవళిక వాళ్ళిద్దర్నీ నేనే పిలిచాను అని అంటుంది. దాంతో తులసి ఎంతో ఆనంద పడుతుంది. కానీ తులసి ప్రేమ్ ను ఇగ్నోర్ చేస్తుంది. ఆ తర్వాత లాస్య (Lasya) నేను కూడా ఈ కాంపిటేషన్ లో పాటిస్పేట్ చేయలా అని నందు ను అడుగుతుంది.
ఇక నందు (Nandu) వాళ్ళమ్మకు హ్యాపీ మదర్స్ డే అని చెబుతాడు. దాంతో అనసూయ మదర్స్ డే రోజు మాత్రమే గౌరవించడం కాదు.. జీవితాంతం ప్రేమగా వుండాలని నందు కు అనేక మాటలతో బుద్ధి చెబుతుంది. ఇక కాంపిటేషన్ వాళ్ళు లాస్య (Lasya) ను మీ వాడి ఫేవరెట్ ఫుడ్ ఏమిటి? అని అడుగుతారు.
ఇక లాస్య (Lasya) చెప్ప లేకపోతుంది. దాంతో లక్కీ తులసి ఆంటీ ను చెప్పమంటాడు. పాస్తా.. అని తులసి సమాధానం చెబుతుంది. ఇక లక్కీ (Lucky) ఆనందంగా ఫీల్ అవుతాడు. దాంతో లాస్య తల తీసేసి నట్టుగా అవుతుంది. ఆ తర్వాత బెస్ట్ మదర్ అవార్డు తులసి గెలుచుకుంటుంది.
ఇక తులసి (Tulasi) ను కన్నకొడుకులను ఇంట్లో నుంచి పంపిన ఆవిడ, కన్న కొడుకు లతో మాట్లాడిన ఆవిడ బెస్ట్ మదర్ ఎలా అవుతుంది అని ఆ ఈవెంట్ లో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ లోపు ప్రవళిక (Pravalika) చీఫ్ గెస్ట్ రేంజ్ లో ఆ ఈవెంట్ కు వస్తుంది. ఇక రేపటి భాగం లో ప్రవళిక ఎవరో తెలియాల్సి ఉంది.