MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: టెన్షన్'లో మహేంద్ర, జగతి.. రిషిని అనుమానిస్తున్న పాండ్యన్?

Guppedantha Manasu: టెన్షన్'లో మహేంద్ర, జగతి.. రిషిని అనుమానిస్తున్న పాండ్యన్?

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఇద్దరు ఆడపిల్లల ప్రేమ మధ్య నలిగిపోతున్న ఒక యువకుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Sep 01 2023, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 ఎపిసోడ్ ప్రారంభంలో మేనేజర్ నరేష్ జగతి దంపతుల దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇంకా శాలరీస్ పడలేదు అని అడుగుతుంది జగతి. తెలియదు మేడం వర్క్ హడావుడిలో పడే నేను గమనించలేదు. నేను కూడా ఇప్పుడే చూశాను అంటాడు మేనేజర్. వర్క్ హడావుడిలో పడి గమనించలేదా లేదా శైలేంద్రతో స్నేహం చేస్తూ గమనించలేదా అని అడుగుతుంది జగతి.బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కోమని మహేంద్ర తో చెప్తుంది జగతి.
 

29

మహేంద్ర బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేస్తే లైన్ కలవదు. జగతికి టెన్షన్ పడొద్దు అని చెప్పి మేనేజర్ నరేష్ తో కలిసి  బ్యాంకు దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు మహేంద్ర.ఇంతలో ఫణీంద్ర కొడుకుతో సహా అక్కడికి వస్తాడు. జరిగింది తెలుసుకొని దానికోసం మీరు వెళ్లడం ఎందుకు మేనేజర్ తో శైలేంద్రని పంపించండి. మీరు ఏ పనికి చెప్పకపోతే తను మాత్రం ఎప్పుడు వర్క్ నేర్చుకుంటాడు అని చెప్పి మేనేజర్ తో శైలేంద్రని బ్యాంకుకు పంపిస్తాడు ఫణీంద్ర.
 

39

 మరోవైపు ఏంజెల్ గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి. కారు వెళ్లి ఒక ఆటోని డాష్ ఇవ్వబోతుంది. ఆటోవాడు కాస్తలో తప్పించుకొని ఏంటి ఆ డ్రైవింగ్ అనే రిషి ని తిడతాడు.ఆ ఆటోలో వసుధార ఉంటుంది. రిషి ని చూసి కిందకు దిగి ఆటో డ్రైవర్ కి సారీ చెప్తుంది. మీరు ఎందుకు సారీ చెప్తున్నారు అంటాడు డ్రైవర్ . ఈ సార్ నాకు బాగా తెలుసు. ఎప్పుడూ ఇలాంటి  రాష్ డ్రైవింగ్ చేయరు అని చెప్పి రిషి వైపు తిరిగి ఏంటి సార్ మీరు మీరు అంత డిస్టర్బ్ గా ఉంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా  అంటుంది.
 

49

మీ ఉపన్యాసాలు ఇంకా ఆపండి అని చెప్పి కోపంగా కారు ఎక్కిపోతాడు రిషి.  రిషిని మీరు చాలా డిస్టర్బ్ గా ఉన్నారు ఇప్పుడు కారు డ్రైవ్ చేయలేరు, నేను చేస్తాను అని చెప్పే బలవంతంగా రిషి ని పక్క సీట్లోకి పంపించి తను డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వెళ్తుంది వసుధార. కాలేజీకి వెళ్లేటప్పటికీ అటెండర్ వచ్చి మిమ్మల్ని ప్రిన్సిపల్ సర్ రమ్మంటున్నారు అని చెప్పటంతో అక్కడికి వెళుతుంది వసుధార .
 

59

 ప్రిన్సిపల్ సిలబస్ త్వరగా కంప్లీట్ చేయమని అవసరమైతే స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్పి రిషి సార్ తో కలిపి డిస్కస్ చేసి కంప్లీట్ చేయమని చెప్తాడు. మరోవైపు డిస్టర్బ్ గా ఉన్న రిషి నేను ఇప్పుడు క్లాసులు తీసుకోలేను లాస్ట్ క్లాస్ రివైండ్ చేసుకోండి అని పాండ్యన్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రిషి తో మాట్లాడదామని వచ్చిన వసుధార క్లాసులో రిషి లేకపోవడంతో పాండ్యన్ ని పిలిచి అడుగుతుంది. సార్ క్యాబిన్లో ఉన్నారు, ఎందుకో ఈ మధ్య చాలా డిస్టర్బ్ గా ఉన్నారు.
 

69

 అడిగితే ఏం లేదని చెప్తున్నారు కానీ  ఏదో జరిగింది. పర్సనల్ గా  ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అనుమానంగా అడుగుతాడు పాండ్యన్. అలాంటిదేమీ లేదు మీరు చదువుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. నేరుగా రిషి క్యాబిన్ దగ్గరికి వెళ్లేసరికి అతను దీర్ఘాలోచనలో ఉండడం చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్లి తన సిలబస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు జగతి వాళ్ల దగ్గరికి వచ్చిన బ్యాంక్ మేనేజర్ మన అకౌంట్స్ సీజ్  చేశారంట మేడం. ట్రాన్సాక్షన్స్ లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని చెప్తాడు.
 

79

 అదంతా పూర్తిగా కనుక్కొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని రావాలి కదా అని కోప్పడుతుంది జగతి. అంత టైం ఇవ్వలేదు మేడం, బ్యాంకు క్లోజింగ్ టైం అయిపోవడంతో మూడు రోజులు బ్యాంకులు సెలవులు.. మూడు రోజులు  తర్వాత రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్. ఆ మాటలకి టెన్షన్ పడతారు జగతి దంపతులు. అప్పటివరకు శాలరీస్ ఇవ్వకపోతే స్టాప్ ఇబ్బంది పడతారు.
 

89

 బావగారికి తెలిస్తే బాధపడతారు. అందుకే నా గోల్డ్ తాకట్టు పెట్టి సాలరీస్ ఇచ్చేద్దాము. బ్యాంక్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఆ డబ్బులు మనం తీసుకుందాం అంటుంది జగతి. అలాగే అంటాడు మహేంద్ర. మరోవైపు ప్రిన్సిపాల్ రిషి కి ఫోన్ చేసి వసుధార  మేడం ని మిమ్మల్ని కలవమన్నాను వచ్చారా అని అడుగుతాడు. రాలేదు సర్ నేను వెళ్లి కలుస్తాను లెండి అని చెప్పి వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి.
 

99

ప్రిన్సిపల్ గారు నా దగ్గరికి రమ్మంటే ఎందుకు రాలేదు, ఇగో అడ్డు వస్తుందా అని చెప్పి ఆమెని కోప్పడతాడు రిషి. నేను వచ్చాను సార్, మీరే చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. అయినా ఇది చాలా చిన్న విషయం మీరెందుకు అంతలా కోప్పడుతున్నారు. ఎవరి మీద కోపమో నామీద చూపిస్తున్నారు అంటుంది వసుధార. మనసులో మాత్రం మీ కోపం, మీ ప్రేమ, మీ స్వేచ్ఛ అంతా నా మీదే అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved