అమాయకుడు పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్.. బిగ్ బాస్ 8 ఫినాలేకి 300 మంది పోలీసులు, ఇంకా ఏం చేయబోతున్నారో తెలుసా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడు నెలలపైగా ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చింది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో సీజన్ 8 కి ఎండ్ కార్డు పడనుంది. ఫైనలిస్టులుగా ప్రస్తుతం అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్ హౌస్ లో ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడు నెలలపైగా ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చింది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో సీజన్ 8 కి ఎండ్ కార్డు పడనుంది. ఫైనలిస్టులుగా ప్రస్తుతం అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ ఫైట్ ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక, విజేతని ప్రకటించాక కంటెస్టెంట్స్ అంతా బయటకి వస్తారు.
గత ఏడాది సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. శివాజీ, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర కంటెస్టెంట్స్ వాహనాలపై దాడి చేయడం లాంటి సంఘటనలు జరిగాయి. దీనికి తోడు పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన తర్వాత ర్యాలీగా వెళుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పల్లవి ప్రశాంత్ ర్యాలీని అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేదు. బిగ్ బాస్ తెలుగు 7లో పల్లవి ప్రశాంత్ అమాయకంగా కనిపిస్తూ క్రమంగా ఇంటెన్సిటీ పెంచాడు. టైటిల్ గెలిచి బయటకి వచ్చాక రెబల్ గా మారిపోయాడు. గ్రాండ్ ఫినాలే రోజు హైదరాబాద్ వీధుల్లో హంగామా సృష్టించాడు.
ఒక రేంజ్ లో పల్లవి ప్రశాంత్ రచ్చ చేశాడు. దీనితో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పరిణామాలకు తావు లేకుండా పోలీసులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పూర్తయ్యాక కంటెస్టెంట్స్ బయటకి వస్తారు కాబట్టి 300 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియో, ఆ పరిసర ప్రాంతాల్లో 300 మంది పోలీసులని తెలంగాణ ప్రభుత్వం భద్రత కోసం ఏర్పాటు చేసింది. ఇటీవల పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా నేషనల్ వైడ్ గా సంచలనం అయింది. దీనితో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
Pallavi Prashanth
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరవుతారని అంతా భావించారు. అయితే సంధ్య థియేటర్ కేసు, వివాదాల నేపథ్యంలో బిగ్ బిగ్ 8 గ్రాండ్ ఫినాలేకి హాజరు కాలేనని అల్లు అర్జున్ చెప్పేశారట. దీనితో చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ రాంచరణ్ అయినా హాజరయ్యారో లేదో ఫినాలే ఎపిసోడ్ లో తేలనుంది.