- Home
- Entertainment
- Prema entha madhuram: సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన మాన్సీ.. అనుని సేఫ్ ప్లేస్ లో వదిలిపెట్టిన బామ్మ!
Prema entha madhuram: సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన మాన్సీ.. అనుని సేఫ్ ప్లేస్ లో వదిలిపెట్టిన బామ్మ!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటుంది. ఇంటిని సర్వనాశనం చేసిన తమ్ముడు భార్యని బయటికి గెంటేసిన ఒక బావ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే శారదమ్మ, ఆర్య అను ని తీసుకువస్తాడు కదా అని అడుగుతుంది. ఇంతలో ఆర్య వాళ్ళు బాధపడుతూ వస్తారు. అను దొరకలేదు తన జాడ కూడా తెలియడం లేదు అని బాధపడతాడు ఆర్య. ఎందుకు అను ఇలా చేస్తుంది. తప్పుడు జాతకాలు అన్ని నమ్మి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. నా కోడల్ని మనవల్ని చూసి అదృష్టం నాకు లేదా అని బాధపడుతూ ఉంటుంది శారదమ్మ. అప్పుడు ఆర్య దేవుడు నా కూతుర్ని నాకు దగ్గర చేయడానికి చాలా రకాలుగా సహాయం చేశారు కానీ నేనే గుర్తించలేదు.
మొన్న పూజప్పుడు కూడా నేను ఎత్తుకున్నది పరాయి పిల్లని అనుకున్నాను కానీ నా కూతురినే అని తెలిసింది. కన్న కూతురిని గుండెల్లో పెట్టి చూసుకోవాల్సింది పరాయి పిల్లలాగా చూశాను. ఆ నొప్పి నాకు గుండెల్లో తెలుస్తుంది అని బాధపడతాడు. అప్పుడు అంజలి ఇదంతా మాన్సీ వల్లే వచ్చింది. తనే లేకపోయి ఉంటే కుటుంబం సంతోషంగా ఉండేది అని అంటుంది. అప్పుడు శారదమ్మ ఇంత పాపం చేసిన తను ఎంతో కొంత పాపం తిరిగి పొందుతుంది అని అంటుంది.
ఈ మాటలు విన్న మాన్సీ నన్ను అలాగా శపించకండి మామ్ ఇన్ లా అని గడపలోకి అడుగుపెడుతుంది. నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు నువ్వు బయటికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు నీరజ్. దయచేసి నేను చెప్పింది విను నీరజ్. నేను మంచిదాన్నే కానీ ఇన్ సెక్యూరిటీ వల్ల మనకి పిల్లలు పుట్టరు అని తెలిసి అదే సమయంలో అనుకు పిల్లలు పుట్టేసరికి నేను భరించలేక ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించండి.
నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఇంతలో ఆర్య, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను కానీ వెళ్లిపోయిన నా భార్య పిల్లలు తిరిగి వస్తారా? నువ్వు చేసిన తప్పులన్నీ తిరిగి తీరుతాయా? నా బాధ తీరుతుందా? అని మాన్సీ మీద గట్టిగా అరుస్తూ గడప నుంచి బయటకు తోసేస్తాడు. నాకు తెలుసు మీరు ఇలాగే రియాక్ట్ అవుతారు అని అయినా సరే ఒకసారి అడిగి చూద్దాము క్షమిస్తారని అనుకున్నాను.
కానీ మీరు నన్ను బయటకు పంపిద్దామని ఫిక్స్ అయిపోయారు అందుకే నేను నా లాయర్ ని తీసుకొని వచ్చాను విడాకులు అప్లై చేయడానికి. అలాగే విడాకులు వచ్చేవరకు నా పూర్తి భారం మీదే అంటుంది. ఆస్తిలో వాటాలు కూడా నాకు చాలానే రావాలి కూర్చొని తేల్చుకోవాలి అని అంటుంది. అప్పుడు కోపంలో ఉన్న ఆర్య జెండే ఆ విడాకులు త్వరగా వచ్చేటట్టు చూడు ఈ ఇంట్లో నుంచి ఈ దరిద్రం పూర్తిగా వెళ్లిపోవాలి.
ఈ ఆస్తిలో ఒక్క పైసా కూడా రానివ్వకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా నీకు రాదు అని అంజలి అంటుంది. అది తెల్చేది నువ్వు కాదు అని అంటుంది మాన్సీ. నిన్ను ఎలా వదిలించుకుందామా అనుకుంటున్నాను. ఈ సమయంలో నువ్వే ఒక మంచి దారిని వెతుక్కున్నావ్ మాన్సీ అని అంటాడు నీరజ్. తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు.
కోర్టులో తేల్చుకుందాము అని చెప్పి మాన్సీ ఇంటి బయటకు వెళ్ళిపోతుంది. మరోవైపు అను తన పిల్లలతో బామ్మ వాళ్ళ చెల్లి ఇంటికి వస్తుంది. అప్పుడు బామ్మ, నువ్వు నాతో ఉంటే ఎప్పటికైనా నీ జాడ కనుక్కుంటారు. అందుకే నిన్ను మా చెల్లెలి ఇంట్లో వదిలిపెడుతున్నాను. వీళ్ళు ముగ్గురిని బాగా చూసుకొ అని వాళ్ళ చెల్లి తో అంటుంది. నేనింక వెళ్లొస్తాను నన్ను ఎప్పటికీ మర్చిపోవద్దు అని పిల్లలతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బామ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.