- Home
- Entertainment
- October OTT Releases: అక్టోబర్ ఓటీటీ ధమాకా.. విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే
October OTT Releases: అక్టోబర్ ఓటీటీ ధమాకా.. విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే
October 2026 OTT Releases: అక్టోబర్ 2026 ఓటీటీ లైనప్ అదిరిపోయింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం.

కార్తి ‘సర్దార్ 2’ నుంచి ‘దుపహియా 2’ వరకు: ఈ అక్టోబర్ ఓటీటీలో రచ్చ రంబోలా
అక్టోబర్ నెల రానే వచ్చింది. ఇక డిజిటల్ స్క్రీన్స్ మీద వినోదాల జాతర మొదలైపోయింది. ఈ నెలలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్ వంటి అన్ని మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అదిరిపోయే కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.
సినిమాలు, మైండ్ బ్లాస్టింగ్ వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో పాటు రొమాన్స్, క్రైమ్, స్పై యాక్షన్, ఫ్యామిలీ డ్రామా వంటి ప్రతీ జానర్ వర్కవుట్ అయ్యేలా లైనప్ సెట్ చేశారు. ఈ వారం ముఖ్యంగా అక్టోబర్ 1 నుంచి 4 మధ్యలో ఏ ఏ ఓటీటీలో ఏ సినిమాలు రాబోతున్నాయో ఫుల్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
దుపహియా సీజన్ 2
ప్రైమ్ వీడియోలో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన 'దుపహియా' మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు గజరాజ్ రావ్, రేణుకా షహానే, స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'దుపహియా సీజన్ 2' అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సోనమ్ నాయర్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా కథ ధడక్‌పూర్ అనే చిన్న ఊరి చుట్టూ తిరుగుతుంది.
ఊరిలోకి కొత్తగా ఒక మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని డిసిషన్ తీసుకోవడంతో కథలో ఊహించని ట్విస్టులు, కొత్త సమస్యలు మొదలవుతాయి. ఒకవైపు రోష్ని ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే, ఇంకోవైపు ఇన్స్పెక్టర్ మిథిలేష్‌కి ఏదో పెద్ద మోసం జరుగుతోందనే డౌట్ వస్తుంది. ఫుల్ ఆన్ ఫన్, హ్యూమర్‌తో ఈ సీజన్ సాగుతుంది.
సర్దార్ 2, బేత్లెహేమ్ కుటుంబ యూనిట్
యాక్షన్ ప్రియులకు గుడ్ న్యూస్. కార్తి హీరోగా, పి.ఎస్. మిత్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' అక్టోబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో 'బ్లాక్ డాగర్' అనే రహస్య శక్తి దేశ భద్రతకు ముప్పుగా మారినప్పుడు హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే మిషన్ చుట్టూ కథ నడుస్తుంది.
అలాగే అక్టోబర్ 2 నుంచి జియోహాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ 'బేత్లెహేమ్ కుటుంబ యూనిట్' స్ట్రీమింగ్ కానుంది. నివిన్ పౌలీ, మమితా బైజు నటించిన ఈ సినిమా థియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. గిరీష్ ఎడి దర్శకత్వంలో జస్టిన్ అనే బ్యాచిలర్ లైఫ్‌లోకి ఆష్లీ అనే అమ్మాయి వచ్చిన తర్వాత జరిగే ఇంట్రెస్టింగ్ ఛేంజెస్, ఫ్యామిలీ, లవ్, ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా మైండ్ రీఫ్రెషింగ్‌గా ఉంటుంది.
పూజా మేరీ జాన్, లవ్
క్రైమ్ అండ్ సైకోలాజికల్ థ్రిల్లర్స్ నిష్టపడే వారి కోసం జీ5లో అక్టోబర్ 2 నుంచి 'పూజా మేరీ జాన్' స్ట్రీమింగ్ అవుతోంది. మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా లవ్, రిజెక్షన్, అబ్సెషన్, కన్సట్ వంటి అంశాల చుట్టూ సాగుతుంది. పూజా అనే అమ్మాయి ఒక వ్యక్తి ప్రేమను రిజెక్ట్ చేశాక ఎలాంటి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయో ఇందులో చూపించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 2 నుంచి తమిళ సిరీస్ '#లవ్' అందుబాటులోకి వస్తుంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ఈ సిరీస్‌లో ఒక డేటింగ్ యాప్ ఫౌండర్, అతనికి ఆపోజిట్‌గా ఉండే కాంపిటీటర్ తమ ప్రేమ సిద్ధాంతాలను నిరూపించుకోవడానికి 60 రోజుల ఛాలెంజ్ తీసుకుంటారు. మోడర్న్ డేటింగ్, టెక్నాలజీ, యూత్ రిలేషన్‌షిప్స్ కాన్సెప్ట్‌తో ఈ రొమాంటిక్ డ్రామా చాలా క్యాచీగా ఉంటుంది.
మరికొన్ని ఆసక్తికర రిలీజెస్
ఇవే కాకుండా అక్టోబర్ మొదటి వారంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, షోలు సందడి చేస్తున్నాయి. సన్ నెక్స్ట్ లో డెమోంటే కాలనీ 3, నెట్‌ఫ్లిక్స్‌లో ఓ మై డాగ్, అనిమే లవర్స్ కోసం లిగో వన్ పీస్, అలాగే జియోహాట్‌స్టార్‌లో ట్రాకర్ సీజన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనే జాన్ స్టెయిన్‌బెక్ నవల ఆధారంగా వచ్చిన 'ఈస్ట్ ఆఫ్ ఎడెన్', రేసింగ్ లెజెండ్ బయోపిక్ 'షుమాకర్ '94' కూడా అందుబాటులో ఉన్నాయి.
స్పోర్ట్స్ అండ్ రియాలిటీ హంగామా
కేవలం సినిమాలు, సిరీస్‌లే కాకుండా సోనీ లివ్ 'UEFA ఛాంపియన్స్ లీగ్' లైవ్ స్పోర్ట్స్ మైండ్ బ్లాక్ చేస్తుంటే, జియోహాట్‌స్టార్‌లో వివిధ భాషలకు చెందిన బిగ్ బాస్ కొత్త సీజన్లు నెలాఖరు వరకు ప్రతిరోజూ నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనే ఇన్ని ఆప్షన్లు ఉండటంతో ఓటీటీ లవర్స్ వాచ్‌లిస్ట్ ఫుల్ అయిపోయిందనే చెప్పాలి.

