- Home
- Entertainment
- Charmy: ఛార్మి నిజస్వరూపం ఇదే, ఫోన్ లో గంట బతిమాలి ముంచేసింది.. పూరి జగన్నాధ్ నీతులు మాత్రమే చెబుతాడు
Charmy: ఛార్మి నిజస్వరూపం ఇదే, ఫోన్ లో గంట బతిమాలి ముంచేసింది.. పూరి జగన్నాధ్ నీతులు మాత్రమే చెబుతాడు
పూరి జగన్నాధ్, ఛార్మిపై నిర్మాత చైతన్య రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పూరి జగన్నాధ్ పైకి మాత్రమే నీతులు చెబుతారు అంటూ విరుచుకుపడ్డారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Charmy
ప్రైమ్ షో నిర్మాణ సంస్థ ద్వారా నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు. వాళ్ళు నిర్మించిన హనుమాన్ మూవీ మీడియం బడ్జెట్ సినిమాగా రిలీజై పాన్ ఇండియా వైడ్ గా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా వల్ల మూతబడిన థియేటర్స్ కూడా రీ ఓపెన్ అయ్యాయి అని చాలా మంది థియేటర్స్ యజమానులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు చైతన్య రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
డబుల్ ఇస్మార్ట్ మూవీ
ఇండస్ట్రీలో మాకు అంతటి మంచి గుర్తింపు లభించింది. దానిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో మాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి జగన్నాధ్ తెరక్కించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ వల్ల దారుణంగా నష్టపోయినట్లు చైతన్య రెడ్డి తెలిపారు. వద్దంటున్న మమ్మల్ని ఆ మూవీ డిస్ట్రిబ్యూషన్ లో ఇరికించి ఛార్మి, పూరి జగన్నాధ్ మోసం చేశారు అంటూ చైతన్య రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆరోణలు చేశారు.
రిలీజ్ కి ముందు ఇబ్బందులు
ఓ అగ్రిమెంట్ ప్రకారం డబుల్ ఇస్మార్ట్ మూవీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంగీకారం తెలిపాం, అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న తేదీకి సమస్యలు మొత్తం పరిష్కారం కావాలి. లేకుంటే వాళ్ళు మా డబ్బు మాకు రీ ఫండ్ చేయాలి అని మాట్లాడుకున్నాం. ఆగష్టు 15, 2024న సినిమా రిలీజ్. ఆగష్టు 1 కల్లా సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళు సినిమాని మాకు ఇచ్చేయాలి. అగ్రిమెంట్ లో అదే ఉంది. ఆగస్టు 1కి సమస్యలు సాల్వ్ కాలేదు. ఆరోజే మేము బయటకు వచ్చేసి ఉండొచ్చు. పూరి జగన్నాధ్ అంటే బయట మంచి పేరు ఉంది. ఒకరి పెట్టే వాడే కానీ నష్టపరిచే వాడు కాదు అని టాక్ ఉంది. సరేలే అని ఆగష్టు 10 వరకు కూడా వెయిట్ చేశాం. అప్పటికీ ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. రిలీజ్ పై డౌట్స్ ఉన్నాయి. అప్పటి నుంచి నాకు తేడా కొట్టింది.
మీరు తప్పుకుంటే మాకు జీవితం లేదు, బతిమాలిన ఛార్మి
కొంతమంది మిత్రులు నాకు ఏం చెప్పారు అంటే.. అమ్మా ఏ సినిమా మొత్తం భారాన్ని మీ మీద వేసుకోవద్దు. ఇప్పటి వరకు ఏదైనా అమౌంట్ కట్టి ఉంటే వైజాగ్ లేదా నైజాం రీజియన్ తీసుకుని సైలెంట్ అయిపోండి. హనుమాన్ లాంటి మూవీతో మీరు బాగా ఉన్నారు. మూసినా థియేటర్స్ కూడా మీ వల్ల రీ ఓపెన్ అయ్యాయి. మీలాంటి వాళ్ళు బావుండాలి. దయచేసి ఈ సినిమాలో ఇన్వాల్వ్ కావొద్దు అని మంచి సలహా ఇచ్చారు. నేను, నిరంజన్.. పూరి, ఛార్మి ని రాతపూర్వక అగ్రిమెంట్ అడిగాం లేదా.. సినిమా నుంచి తప్పుకుంటాం అని చెప్పాం. దీనితో ఛార్మి ఫోన్ లో నాతో గంట మాట్లాడి బతిమాలింది. మీరు ఈ టైంలో తప్పుకుంటే మాకు జీవితం లేదు. చనిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. మీకు రిలీజ్ తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉన్నా మేము చూసుకుంటాం అంటూ ఛార్మి బతిమాలింది. మా పరిస్థితి చూస్తే 40 కోట్ల వరకు నష్టపోయేలా ఉన్నాం. నా భర్త నిరంజన్ ఆ టైంలో నిజంగా పూరి, ఛార్మి గురించి ఆలోచించారు. డబ్బు గురించి ఆలోచించలేదు. మనం చేయకపోయే వాళ్ళకు నిజంగా ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని ఆలోచించారు.
ఛార్మి నిజస్వరూపం ఇదే, నీతులు చెప్పి పూరి ఎక్కడ
దీనితో ఇబ్బందులు పడుతూ సినిమాని రిలీజ్ చేశాం. మనీ సమస్యల వల్ల రిలీజ్ రోజు ఫస్ట్ షోలు డిలే అయ్యాయి. రిలీజ్ అయ్యాక సినిమాకు నెగిటివ్ టాక్. సినిమా పోయింది. అప్పటి వరకు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడిన ఛార్మి.. ఆ తర్వాత మా నంబర్స్ బ్లాక్ లో పెట్టేసింది. కలవాలన్నా కుదర్లేదు. అసలు పూరి జగన్నాధ్ ఎక్కడికి పోయారు.. పూరి టాక్స్ అంటూ అభిమానులకు ఆయన నీతులు చెబుతారు కదా..ఆ టైంలో ఏమయ్యాయి ఆయన నీతులు. ఆయనైతే ఏకంగా నంబరే మార్చేశారు. నిరంజన్ రెండు మూడు సార్లు ప్రయత్నించి ముంబై కి వెళ్లి పూరిని కలిశారు. ఆయన ఏం చెప్పారంటే.. మీకు సినిమా చేస్తాం.. రెమ్యునరేషన్ 15 కోట్లు ఇవ్వాలి. అదే విధంగా ప్రాఫిట్స్ లో 50 శాతం వాటా ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు. అసలు వాళ్ళు మనుషుల్లా మాట్లాడుతున్నారా ? ఆల్రెడీ వాళ్ళ వల్ల 40 కోట్లు పోగొట్టుకున్నాం. అది రికవరీ అయ్యాక ఏమైనా చేసుకోమనండి. ముందే ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, వాటా ఇవ్వాలి అని మాట్లాడడం ఏ విధంగా ఎథికల్ అంటూ చైతన్య రెడ్డి విరుచుకుపడ్డారు. ఛార్మి అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. ఖర్చులు మీరే పెట్టుకుని పోకిరి రీ రిలీజ్ చేసుకోండి. ప్రాఫిట్స్ లో 70 శాతం నాకు వాటా ఇవ్వండి 30 శాతం మీరు తీసుకోండి అని మాట్లాడింది. ఆ రోజు మీరు లేకుంటే మాకు జీవితం లేదు అని బతిమాలుకున్న ఛార్మి.. మూవీ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ డే మాట మార్చేసింది. అది ఆమె నిజస్వరూపం అంటూ చైతన్య రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

