MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Amitabh Bachchan : కేబీసీ షూటింగ్ లో జారిపడ్డ అమితాబ్, మోకాలికి గాయం..షో ఆగిపోకుండా ఏం చేశారంటే

Amitabh Bachchan : కేబీసీ షూటింగ్ లో జారిపడ్డ అమితాబ్, మోకాలికి గాయం..షో ఆగిపోకుండా ఏం చేశారంటే

కేబీసీ 18 షూటింగ్‌లో కాలు జారి తన ఎడమ మోకాలికి గాయమైందని అమితాబ్ బచ్చన్ రీసెంట్‌గా చెప్పారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న టైమ్‌లో, ముంబై జుహూలోని ఆయన ఫేమస్ ఇల్లు 'జల్సా' మరోసారి వార్తల్లో నిలిచింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 01 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కేబీసీ 18 షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం
Image Credit : Asianet News

కేబీసీ 18 షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం

కౌన్ బనేగా కరోడ్‌పతి 18 షూటింగ్‌లో కాలు జారి తన ఎడమ మోకాలికి గాయమైందని అమితాబ్ బచ్చన్ రీసెంట్‌గా చెప్పారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆయన కూర్చునే తన ఓపెనింగ్ మోనోలాగ్ చెప్పారు. నిలబడటం కొంచెం కష్టంగా ఉందని ఆయన వివరించారు. అయితే ఈ గాయం అంత సీరియస్ కాదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అభిమానులు ఎవరూ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ తెలిపారు.

ఈ న్యూస్ బయటకు రాగానే, దశాబ్దాలుగా బచ్చన్ ఫ్యామిలీతో విడదీయరాని బంధం ఉన్న ముంబైలోని ఆయన ఫేమస్ ఇల్లు 'జల్సా' వైపు అందరి దృష్టి మళ్లింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బచ్చన్ ఫ్యామిలీ ఫేమస్ అడ్రస్ 'జల్సా'
Image Credit : Instagram

బచ్చన్ ఫ్యామిలీ ఫేమస్ అడ్రస్ 'జల్సా'

జుహూలో ఉన్న 'జల్సా' ముంబైలోని అత్యంత ఫేమస్ సెలబ్రిటీ ఇళ్లలో ఒకటి. ఈ రెండంతస్తుల బంగ్లా బచ్చన్ ఫ్యామిలీకి నివాసంగా మారింది. ఎన్నో ఏళ్లుగా వాళ్లు షేర్ చేసే ఫొటోల్లో ఈ ఇల్లు మనకు కనిపిస్తూనే ఉంటుంది.

'సత్తే పే సత్తా' సినిమాలో కలిసి పనిచేసిన తర్వాత ఫిల్మ్‌మేకర్ రమేష్ సిప్పీ ఈ ఇంటిని బచ్చన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. 'జల్సా' అంటేనే వేడుక అని అర్థం.

గ్రాండ్ ఇంటీరియర్స్‌కు కేరాఫ్ అడ్రస్

సాంప్రదాయ భారతీయ శైలి, మోడ్రన్ ఇంటీరియర్స్‌ కలయికే ఈ జల్సా. పెద్దపెద్ద లివింగ్ రూమ్స్, పాతకాలపు ఇత్తడి శిల్పాలు, అందమైన షాండ్లియర్లు, ఆర్ట్‌వర్క్, మార్బుల్ ఫ్లోరింగ్, రిచ్ వుడెన్ డిజైన్స్ ఈ ఇంట్లో కనిపిస్తాయి.

ముఖ్యంగా లివింగ్ రూమ్‌లో ఎత్తైన ఆర్చ్‌లు, ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉండే గ్లాస్ డోర్స్, పెద్ద ఆర్ట్ కలెక్షన్ ఉన్నాయి. పురాతన వస్తువులు, డెకరేషన్ విషయంలో బచ్చన్ ఫ్యామిలీ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ ఇంటీరియర్స్ చూస్తే అర్థమవుతుంది.

అభిమానులకు సుపరిచితమైన గార్డెన్, ఎంట్రన్స్

జల్సా ఎంట్రన్స్, గార్డెన్ అందరికీ బాగా తెలిసినవే. పచ్చని చెట్లు, మొక్కలు, ఆ చెక్క గేట్లు బచ్చన్ దిగిన ఎన్నో ఫొటోలకు బ్యాక్‌డ్రాప్‌గా నిలిచాయి.

ప్రతి ఆదివారం జల్సా బయటకు వచ్చి అభిమానులను పలకరించడం బచ్చన్‌కు అలవాటు. అందుకే ఈ ఇల్లు ఆయన అభిమానులకు ఒక మీటింగ్ పాయింట్‌గా మారిపోయింది. ఆయన్ని ఒక్కసారైనా చూడాలని అభిమానులు ఈ బంగ్లా బయట గుమిగూడుతారు. బచ్చన్ కూడా ఎన్నో ఏళ్లుగా తన అభిమానులతో ఈ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

33
బచ్చన్ పబ్లిక్ లైఫ్‌లో జల్సాకు స్పెషల్ ప్లేస్
Image Credit : Instagram

బచ్చన్ పబ్లిక్ లైఫ్‌లో జల్సాకు స్పెషల్ ప్లేస్

జల్సా కేవలం ఒక లగ్జరీ సెలబ్రిటీ ఇల్లు మాత్రమే కాదు. అది అమితాబ్ బచ్చన్ పబ్లిక్ ఇమేజ్‌లో ఒక భాగమైపోయింది. బంగ్లా బయట ప్రతి వారం జరిగే అభిమానులు మీటింగ్, ప్రేక్షకులతో ఆయనకున్న అనుబంధానికి ఒక ప్రతీకగా నిలిచింది.

'కూలీ' సినిమా షూటింగ్ టైమ్‌లో బచ్చన్‌కు పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాతే ఈ సండే ట్రెడిషన్ మొదలైందని వోగ్ మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. ఆయన కోలుకున్న తర్వాత, తనకోసం ప్రార్థించిన అభిమానులకు థాంక్స్ చెప్పేందుకు ఆయన ఇంటి బయటకు వచ్చారు.

తన తాజా గాయం గురించి అమితాబ్ ఏమన్నారంటే..

ప్రస్తుతానికి తన మోకాలి గాయం అంత సీరియస్ కాదని బచ్చన్ చెప్పారు. ఆయన కేబీసీ 18 షూటింగ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడేందుకు నిలబడటానికి ముందు, ఆయన కూర్చునే తన ఓపెనింగ్ రొటీన్‌ను పూర్తి చేశారు. ఎపిసోడ్‌కు వచ్చిన ఆడియన్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఈ గాయం వల్ల ఆయన కేబీసీ హోస్టింగ్ బాధ్యతలకు బ్రేక్ పడుతుందనే సమాచారం ఎక్కడా లేదు. 83 ఏళ్ళ వయసులో కూడా అమితాబ్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ యువ నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగులో ఆయన కల్కి 2లో నటించాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: కన్నతండ్రిని అలా చూడలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఎఎన్నార్ పెద్ద కొడుకు, నాగార్జున అన్న ఏమన్నాడంటే?
Recommended image2
Charmy: ఛార్మి నిజస్వరూపం ఇదే, ఫోన్ లో గంట బతిమాలి ముంచేసింది.. పూరి జగన్నాధ్ నీతులు మాత్రమే చెబుతాడు
Recommended image3
Venkatesh: సౌందర్య కోసం రోజాకు అన్యాయం చేసిన వెంకటేష్? రాజా సినిమా ఎలా మిస్సయిందంటే?
Related Stories
Recommended image1
Charmy: ఛార్మి నిజస్వరూపం ఇదే, ఫోన్ లో గంట బతిమాలి ముంచేసింది.. పూరి జగన్నాధ్ నీతులు మాత్రమే చెబుతాడు
Recommended image2
Peddi and Paradise: పెద్ది, ప్యారడైజ్ సినిమాల పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అయింది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved