- Home
- Entertainment
- ANR: కన్నతండ్రిని అలా చూడలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఎఎన్నార్ పెద్ద కొడుకు, నాగార్జున అన్న ఏమన్నాడంటే?
ANR: కన్నతండ్రిని అలా చూడలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఎఎన్నార్ పెద్ద కొడుకు, నాగార్జున అన్న ఏమన్నాడంటే?
ANR: అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ గురించి చాలామందికి తెలియదు. ఆయన నిర్మాతగా చాలా సినిమాలు చేశాడు. అయితే తండ్రి అంటే చాలా ఇష్టం వెంకట్ కు.. ఓ సినిమాలో ఏఎన్నార్ బాధను చూడలేక.. వెంకట్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఇంతకీ ఏంటా సినిమా?

ఏఎన్నార్ ఇద్దరు తనయులు..
ఏఎన్నార్ తనయులలో నాగార్జున హీరోగా అందరికి పరిచయమే కానీ.. ఆయన అన్న అక్కినేని వెంకట్ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అసలు తెరమీదకు హీరోగా రావల్సింది వెంకట్.. బిజినెస్ లోకి వెళ్లాల్సింది నాగార్జున. కానీ సీన్ రివర్స్ అయ్యింది. నాగార్జున హీరో అయ్యాడు.. బిజినెస్ లు కూడా చూసుకుంటున్నాడు. అటు వెంకట్ మాత్రం వ్యాపారానికే పరిమితం అయ్యాడు. నిర్మాతగా కొన్ని సినిమాలు చేశాడు. తన తండ్రి నటించిన చాలా సినిమాలు నాగార్జున, వెంకట్ ఫ్యామిలీ అంతా చాలా ఇష్టంగా చూసేవారట. కానీ ఓ సందర్భంలో తండ్రిని ఓ పాత్రలో చూడలేక అక్కినేని వెంకట్ బాధతో కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లాడట. ఇంతకీ ఏంటా కథ... ఏంటా సినిమా?
హిస్టరీ తిరగరాసిన సినిమా
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టరీ తిరగరాసిన కొన్ని సినిమాల్లో దేవదాసు ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు (ANR) హీరోగా నటించి, నిర్మించిన అద్భుత దృశ్యకావ్యం 'దేవదాసు'. తరాలు మారినా ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ క్లాసిక్ సినిమా గురించి ANR పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత అక్కినేని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన తండ్రి గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న వెంకట్.. దేవదాసు సినిమా గురించి చెప్పిన విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిస్తుంది.
దేవదాసు' చూసి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను!
'సాధారణంగా ఏఎన్నార్ నటించిన సినిమాలు ఆయన అభిమానులకు మాత్రమే కాదు ఆయన కన్న పిల్లలకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తాయి. కానీ అక్కినేని వెంకట్‌కు మాత్రం 'దేవదాసు' సినిమా ఒక భిన్నమైన, భారమైన అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాను చాలా ఆలస్యంగా చూశారట వెంకట్. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, అంటే దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన 'దేవదాసు' సినిమాను చూడలేదు.
ఆ వయసులో మొదటిసారి ఆ సినిమా చూసినప్పుడు రెండు మూడు రోజుల పాటు తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు వెంకట్ వెల్లడించారు. తెరపై తన తండ్రి పడే బాధను, ఆ పాత్రలోని విషాదాన్ని, నాన్నగారిని చూడలేక తీవ్ర మనోవేదనకు గురయ్యానని, అందుకే ఆ సినిమా తనను అంతగా కుంగదీసిందని చెప్పారు.
23 ఏళ్లకే అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు
అయితే ఈ విషయాన్ని నాన్నగారి వద్ద ఎప్పుడూ నేరుగా చెప్పలేదని అక్కినేని వెంటక్ గుర్తుచేసుకున్నారు. తన సినీ ప్రయాణం , అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ గురించి చెబుతూ... విదేశాల్లో (అమెరికా) ఎంబీఏ (MBA) పూర్తి చేసి 23 ఏళ్ల వయసులోనే భారత్‌కు తిరిగి వచ్చారు వెంకట్. ఆయన రాగానే అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను స్వీకరించారు ప్పటివరకు ఆ సంస్థను మేనేజర్‌గా చూసుకుంటున్న పి.వి. సుబ్బారావు వయోభారంతో రిటైర్‌మెంట్ తీసుకోవడంతో, అప్పటినుంచి స్టూడియో వ్యవహారాలను వెంకట్ పర్యవేక్షించడం ప్రారంభించారు.
సినీ వాతావరణం, ఇతర వ్యాపారాలు
ఆ రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ పెద్ద కష్టంగా అనిపించేది కాదని వెంకట్ చెప్పారు. సంవత్సరానికి మహా అయితే నాలుగు లేదా ఐదు సినిమాలు మాత్రమే నిర్మించేవారు. నాన్నగారి సినిమాలు మాత్రమే ఎక్కువగా ఉండటంతో ఏడాదికి కేవలం 150 కాల్ షీట్స్ వరకు పని ఉండేది. సర్వీస్ ఇండస్ట్రీ కావడం వల్ల ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం, సెట్ అయి ఉండేది. స్టూడియో పనిభారం తక్కువగా ఉండటంతో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతర వ్యాపారాల వైపు కూడా దృష్టి సారించి బయట కొత్త బిజినెస్‌లను ప్రారంభించానని అక్కినేని వెంకట్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

